



Maduro: బస్సు డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
అమెరికా నిర్బంధించిన నికొలస్ మదురో.. దాదాపు పన్నెండేళ్లుగా వెనెజువెలా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రముఖ వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌కు అత్యంత సన్నిహితుడు. చావెజ్ మరణం తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించిన మదురో.. 90వ దశకంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. అదే సమయంలో తీవ్ర విమర్శలూ ఎదుర్కొన్నారు.
సాధారణ కుటుంబం నుంచి..
వెనెజువెలా రాజధాని కారకాస్‌లో 1962లో మదురో జన్మించారు. తండ్రి ఓ కార్మిక నాయకుడు. 1990ల్లో మదురో బస్ డ్రైవరుగా పనిచేశారు. అదే సమయంలో వామపక్ష రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తదనంతర కాలంలో హ్యూగో చావెజ్‌కు అత్యంత సన్నిహితుడయ్యారు. 1999లో చావెజ్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మదురో దశ మారింది. ఆయనకు కీలక పదవులు లభించాయి. జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా, విదేశాంగమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
చావెజ్ మరణంతో..
క్యాన్సర్‌తో 2013లో చావెజ్ మరణించడంతో దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మదురో బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది జరిగిన ప్రత్యేక అధ్యక్ష ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించి.. పూర్తిస్థాయిలో అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. ఆ తర్వాత మరో రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని విపక్షాలే కాదు.. చాలా దేశాలు కూడా ఆక్షేపించాయి.
తీవ్రమైన అణచివేత..
మదురో పాలనలో వెనెజువెలా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. 2014, 2017లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాటిని మదురో తీవ్రంగా అణచివేశారు. వేల మంది పౌరులను నిర్బంధించారు. 2025 జనవరిలో మదురో మూడోసారి దేశాధ్యక్ష పగ్గాలను చేపట్టారు. ఆ ఎన్నికలపైనా తీవ్ర దుమారమే రేగింది. మదురోను అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా తిరస్కరించింది. విపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్‌నే తాము గుర్తిస్తామని పేర్కొంది.
మదురో వర్సెస్ ట్రంప్
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలను చేపట్టినప్పటి నుంచీ కథ మారింది. మదురోను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి వెనెజువెలా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోకి మాదకద్రవ్యాలు, అక్రమ వలసదారులు రావడానికి మదురోయే కారణమని నిందించారు. వెనెజువెలాలోని డ్రగ్స్ ముఠాలను ఉగ్రవాదులుగా ట్రంప్ ప్రకటించారు. పదవి నుంచి మదురో తప్పుకొంటే.. దేశం నుంచి సురక్షితంగా బయటకు వెళ్లే అవకాశం ఆయనకు కల్పిస్తామని ట్రంప్ ప్రతిపాదన కూడా చేశారు. మదురో దీన్ని తిరస్కరించారు. తమ దేశంలో చమురు నిల్వలపై అమెరికా కన్నేసిందంటూ ఆయన ఎదురు దాడిచేశారు. ఆ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్యే మదురోను నిర్బంధించాలని ట్రంప్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మదురో.. పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తుడు. ఆయన కార్యాలయంలో బాబా భారీ చిత్రపటం ఉంటుంది. 2005లో విదేశాంగమంత్రి హోదాలో భారత్ పర్యటనకు వచ్చిన ఆయన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సాయిబాబాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో ఆయన భార్య సిలియా ఫోర్‌ను అమెరికా నిర్బంధించిన నేపథ్యంలో తదుపరి ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మదురో నిర్బంధం 1989లో పనామాపై అమెరికా జరిపిన దురాక్రమణను గుర్తుకు తెస్తోంది. అప్పట్లో తమ దేశ పౌరులకు రక్షణ కల్పించే సాకుతో అమెరికా పనామాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మాన్యువెల్ నోరీగాను నిర్బంధించింది. నోరీగా అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నారని, అవినీతికి పాల్పడుతూ మాదక ద్రవ్యాల వ్యాపారానికి ఊతమందిస్తున్నారని నాటి అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.నోరీగా సుదీర్ఘకాలం అమెరికా, ఫ్రాన్స్, పనామా జైళ్లలో మగ్గారు. 2017లో 83 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించారు. అలాగే ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్‌ను కూడా అమెరికన్ బలగాలు 2003 డిసెంబరు 13న నిర్బంధించాయి. ఇరాక్ వద్ద భారీ విధ్వంసానికి దారితీయగల ఆయుధాలు ఉన్నాయన్న సాకుతో అమెరికా ఆ దేశంపై దాడి చేసి సద్దాం ప్రభుత్వాన్ని కూల్చి వేసింది. తన సొంత నేల అయిన తిక్రిత్‌లో ఒక సొరంగంలో దాగి ఉండగా అమెరికన్ సేనలు ఆయనను పట్టుకున్నాయి. అమెరికా పేర్కొన్న ఆయుధాలు ఇరాక్‌లో ఏనాడూ లభించలేదు. మానవాళికి వ్యతిరేకంగా నేరాలు చేశారంటూ సద్దాంపై అమెరికా అభియోగం మోపింది. దీనిపై విచారణ అనంతరం 2006 డిసెంబరు 30న సద్దాం హుసేన్‌ను ఉరితీశారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- బంగ్లా పీఠంపై బీఎన్‌పీ బంగ్లాదేశ్‌లో దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరతకు తెరపడింది. దేశ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది.
- ‘డార్క్ ప్రిన్స్’కు బంగ్లా పగ్గాలు ఒకప్పుడు విమర్శకుల చేత ‘డార్క్ ప్రిన్స్’గా మాటలు పడిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) నేత తారిఖ్ రెహమాన్ ఇప్పుడు బంగ్లా పగ్గాలు చేపట్టబోతున్నారు.
- ఐఎస్‌ఎస్‌కు పయనమైన నలుగురు వ్యోమగాములు వైద్యపరమైన అత్యవసర కారణాల వల్ల నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి అర్ధాంతరంగా భూమికి తిరిగొచ్చిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి తాజాగా మరో బృందం నింగిలోకి పయనమైంది.
- ఎప్‌స్టీన్‌తో బంధంపై కలకలం.. గోల్డ్‌మాన్ సాక్స్ న్యాయవాది రాజీనామా అంతర్జాతీయ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
- పర్యవసానాలు బాధాకరంగా ఉంటాయి అణు ఒప్పందానికి అంగీకరించకుంటే ఇరాన్ అత్యంత బాధాకరమైన పర్యవసానాలు చవి చూడాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు.
- వచ్చేవారం మళ్లీ రష్యా-ఉక్రెయిన్ చర్చలు యుద్ధం ముగింపు దిశగా రష్యా, ఉక్రెయిన్ మధ్య వచ్చేవారం జెనీవాలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. 17, 18 తేదీల్లో ఈ చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ శుక్రవారం వెల్లడించారు.
- సంక్షిప్త వార్తలు (3) సోవియట్ రష్యాలో స్టాలిన్ విధానాలను, కృశ్చెవ్, బ్రెజ్నెవ్‌ల హయాంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన మార్క్సిజాన్నీ ప్రశ్నించిన విమర్శకుడు రాయ్ మెద్వెదేవ్ శుక్రవారం నూరేళ్ల వయసులో కన్నుమూశారు.
- గాజా శాంతి బోర్డుపై ఇండోనేసియాలో వ్యతిరేకత గాజా కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన శాంతి సంస్థాపన బోర్డులో చేరిన ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబువో సుబియాంతో, అక్కడ నియోగించే అంతర్జాతీయ భద్రతా దళం (ఐఎస్‌ఎఫ్) కోసం 8 వేల మంది సైనికులకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు.
- కృత్రిమ మేధ ప్రభావం, ముప్పుపై ఐరాస నిపుణుల కమిటీ ఏర్పాటు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో...కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం, దాని ముప్పును అంచనా వేయడానికి ప్రపంచ స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటయ్యింది.
English Translation

> maduro: bus From Driver to President..!
- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Nicolas Maduro, who was arrested by America, has been the president of Venezuela for almost twelve years. He is a close associate of prominent leftist leader and former President Hugo Chavez. After Chavez's death, he assumed the presidency. Maduro, who was born in a common labor family, started his political rise in the 90s and rose step by step. At the same time, he faced severe criticism.
From a simple family..
Maduro was born in 1962 in Caracas, the capital of Venezuela. Father is a labor leader. In the 1990s, Maduro worked as a bus driver. At the same time, he actively participated in left-wing political movements. Later became very close to Hugo Chavez. After Chavez assumed the presidency in 1999, Maduro's phase changed. He got key positions. He served as the President of the National Assembly and as the Minister of Foreign Affairs.
After the death of Chavez..
After Chavez died of cancer in 2013, Maduro took over as the interim president of the country. In the special presidential election held in the same year, he won with a very small majority and took over the presidential reins. After that he won two more elections. But it was not only the opposition that said that there were irregularities in that election.. Many countries also objected.
Severe repression..
Venezuela has faced many crises under Maduro's rule. Especially the country's economy is in shambles. Inflation is sky high. There was a severe food shortage. In 2014 and 2017, there were massive protests across the country against the government. People took to the streets. Maduro repressed them severely. Thousands of civilians were detained. In January 2025, Maduro assumed the reins of the country's presidency for the third time. There was a lot of controversy over that election. The US has refused to recognize Maduro as president. The opposition leader, Edmundo González, said that they would recognize him.
Maduro vs. Trump
The story has changed since Trump took the reins of the American presidency for the second time. Trump targets Maduro. He accused the Venezuelan president of trying hard to destabilize his country. Maduro was blamed for the influx of drugs and illegal immigrants into America. Trump has declared drug gangs in Venezuela as terrorists. Trump also proposed that if Maduro steps down, he will be given the opportunity to leave the country safely. Maduro denied this. He counter-attacked by saying that the US was looking at the oil reserves in their country. It is noteworthy that Trump took the decision to detain Maduro amid those accusations and counter-accusations.
Maduro.. Puttaparthi is a devotee of Satya Sai Baba. There is a huge portrait of Baba in his office. In 2005, when he visited India in the capacity of Foreign Minister, he visited Prashanthi Nilayam in Puttaparthi. Had a special meeting with Sai Baba.
There is a lot of excitement about what is going to happen next in the wake of the arrest of Venezuelan President Nicolás Maduro and his wife Celia Four by the United States. Maduro's detention is reminiscent of the 1989 US invasion of Panama. At that time, on the pretext of protecting its citizens, the United States attacked Panama and detained the country's president, Manuel Noriega. The American government of the time accused Noriga of adopting undemocratic policies and encouraging the drug trade by committing corruption. Noriga spent a long time in the prisons of America, France and Panama. He died of a brain tumor in 2017 at the age of 83. Also, Iraqi President Saddam Hussain was arrested by American forces on December 13, 2003. America invaded Iraq and toppled Saddam's government on the pretext that Iraq had weapons of mass destruction. He was captured by American forces while hiding in a tunnel in his home soil of Tikrit. The weapons claimed by the US were never found in Iraq. America accused Saddam of committing crimes against humanity. Saddam Hussein was hanged on December 30, 2006 after the trial.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- BNP on Bangla pedestal The political instability that has been going on for almost a year and a half in Bangladesh has come to an end. The Bangladesh Nationalist Party (BNP) has won a landslide victory in the 13th general election of the country. Bangladesh Nationalist Party (BNP) leader Tariq Rahman, who was once called the 'Dark Prince' by critics, is now going to take over the reins of Bangladesh.
- Four astronauts who went to ISS Another team has recently flown to Ninggi to replace four astronauts who returned to Earth halfway from the International Space Station (ISS) due to medical emergencies. Another key development has taken place in the case of international sex offender Jeffrey Epstein.
- The consequences will be dire. US President Trump has reiterated that Iran will suffer the most painful consequences if it does not agree to the nuclear deal.
- Russia-Ukraine talks again next week. Another round of talks will be held in Geneva next week between Russia and Ukraine towards the end of the war. Dmitry Peskov, the spokesperson of the Russian presidential office, revealed on Friday that these discussions will take place on the 17th and 18th.
- Brief news (3) Roy Medvedev, a critic who questioned Stalin's policies in Soviet Russia and Marxism followed by the Russian Communist Party under Khrushchev and Brezhnev, died on Friday at the age of one hundred.
- Opposition in Indonesia against the Gaza Peace Board. Indonesian President Prabuo Subianto, who joined the peace-building board announced by US President Trump for Gaza, conducted a training program for 8,000 soldiers for the International Security Force (ISF) to be deployed there. In the background of the strong opposition of the superpower America... a world-class expert committee has been formed to assess the impact of artificial intelligence (AI) and its threat.