
సమాధానం ఇవ్వడం... సమస్యగా మారితే..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

- బీటెక్ సెకండియర్ చదువుతున్న రమేశ్ ఎంత పనిలో ఉన్నా సరే నోటిఫికేషన్ శబ్దం వస్తే చాలు ఆ పని ఆపేసి రిప్లై ఇస్తాడు. ఇవ్వకపోతే ఎవరేమనుకుంటారోనన్న ఆందోళన దీనికి కారణం. ఒకసారి వాష్‌రూంలో ఉన్నప్పుడు మెసేజ్ వచ్చింది. ఆ శబ్దం విని ఫోన్ తీసుకోవడానికి బయటకు వచ్చే క్రమంలో కాలు జారి కిందపడ్డాడు. కాసేపాగి కూడా రిప్లై ఇవ్వచ్చన్న విచక్షణ కూడా అతడిలో లేకపోయింది.
- కొత్తగా సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరిన అనూజకు మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. అందుకే బాస్, సహోద్యోగులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆఫీస్ వాట్సప్ గ్రూప్స్‌లో యాక్టివ్‌గా ఉండేది. ఏ టాస్క్ ఇచ్చినా నేనున్నా అంటూ తీసుకునేది. కొన్నాళ్ల తర్వాత తాను తీరికలేని పనిలో ఉన్నా సరే పనులు చెప్పడం మొదలుపెట్టారు. మితిమీరిన ఎవైలబిలిటీ ఇంత చేటు చేస్తుందని తనకు ఆలస్యంగా అర్థమైంది.
సెల్‌ఫోన్‌లో నోటిఫికేషన్ శబ్దం వచ్చిందా.. వెంటనే బదులివ్వాలనే తొందర... తింటున్నా, వాష్‌రూమ్‌లో ఉన్నా, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా.. చేతివేళ్లు కీబోర్డుపైకి వెళ్లాల్సిందే. మితిమీరిన ఈ ఎవైలబిలిటీనే భవిష్యత్తును గందరగోళంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మనకు నచ్చిన వారి మెసేజ్ నోటిఫికేషన్ పడిన వెంటనే రిప్లై ఇవ్వాలన్న ఆలోచన మొదట మంచిగానే అనిపిస్తుంది. బాధ్యతగా ఉంటున్నామని, ఎదుటివారికి ఎవ్వరూ ఇవ్వనంత విలువిస్తున్నామని మన భుజం మనమే తట్టుకుని ఆనందపడతాం. అలవాటుగా మొదలైన ఈ తంతు ఏపని చేస్తున్నా, ఆఖరికి నిద్రలో కూడా ఆ రిప్లైల గురించే ఆలోచించే స్థాయికి చేరేలా చేస్తుంది. చివరకు మెదడు దీనికి బానిసగా మారడంతో మన లక్ష్యాలు, బాధ్యతలను కూడా మర్చిపోతుంటాం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు...అలాగే కాలం చేజారాక బాధపడినా ప్రయోజనం శూన్యం.

మనసు చెదిరి.. కాలం కరిగి
- కంపల్సివ్ రెస్పాన్సివ్‌నెస్, నోటిఫికేషన్ డ్రివెన్ బిహేవియర్, ఇన్‌స్టెంట్‌్ రిప్లైయింగ్..పేరేదైనా ఈ దురలవాటు మానసికంగా చేటు చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
- ముఖ్యంగా అప్పటికే మనం చేస్తున్న పని ఆగుతూ సాగడంతో ఫలితం అనుకున్నంత ప్రభావవంతంగా ఉండదు.
- మెదడులో ఆలోచనలు ఎప్పుడూ ఆ నోటిఫికేషన్ చుట్టే తిరుగుతుడడంతో కుదురుగా కూర్చోలేని స్థాయికి చేరిపోతాం.
- క్రమంగా చేతిలోని కాలం కరిగిపోతుంది.
- మన ఎవైలబిలిటీ ఎదుటివారికి అలుసుగా మారి బంధాలు బీటలు వారుతాయి.
- ఆఖరికి ఒత్తిడి, కంగారు, అభద్రతా భావం వంటి సమస్యలు ఎదురవుతాయి.
- తల్లిదండ్రులు, స్నేహితులతో సరిగ్గా మాట్లాడకపోవడంతో వారి ప్రేమకూ దూరం కావాల్సి వస్తుంది.
- ఇన్‌స్టెంట్ మెసేజింగ్ చూడ్డానికి నిమిషాల వ్యవహారంగా కనిపిస్తున్నా.. ఒక దశకు వచ్చేసరికి సరిదిద్దుకోలేని సమస్యగా మారిపోతుంది.
ఇలా ప్రయత్నిద్దాం..
- రోజుకు కొద్ది సమయాన్నే రిప్లైలకు కేటాయించాలి.
- ఆఫీస్ బాస్, కొద్ది మంది కుటుంబ సభ్యుల మెసేజ్‌లకు నోటిఫికేషన్ వచ్చే సెట్టింగ్స్ ప్రయత్నించవచ్చు.
- మెసేజ్ నోటిఫికేషన్ శబ్దం, ఫోన్‌లైట్ మన మెదడులో డోపమైన్‌ను పెంచుతాయి. ఇది రిప్లై ఇచ్చేలా ఉత్సాహపరుస్తుంది.
- అందుకే ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టుకుంటే క్రమంగా మెదడు అలవాటు పడుతుంది.
- ఇంతకు ముందు వెంటనే రిప్లై ఇచ్చేవారు.. ఇప్పుడేంటి ఇలా అని కొందరు అడగవచ్చు.
- దానికి అపరాధిలా సమాధానం ఇవ్వకుండా కాస్త బిజీగా ఉంటున్నానని చెప్పవచ్చు.
- లేదంటే కాల్ యు లేటర్, ఐయాం బిజీ.. లాంటి మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా వెళ్లిపోయే ఐచ్ఛికాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు.
డ్రగ్స్ కన్నా తక్కువేమీ కాదు..
- క్రష్ లేదా గర్ల్ ఫ్రెండ్ విషయంలో అబ్బాయిల్లో ఇన్‌స్టెంట్‌్ రిప్లైయింగ్ మరీ విపరీతానికి చేరుతోంది.
- వెంటనే బదులివ్వాలని చేస్తున్న పని పక్కనపెట్టి మరీ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు.
- బదులు రాకపోతే మానసిక ఆందోళనకు గురవుతుంటారు.
- డ్రగ్స్ సమయానికి తీసుకోకపోతే ఎదురయ్యే అనుభవం కన్నా ఇది తక్కువేమీ కాదు.
- ఈ అలవాటు క్రమంగా కెరీర్‌ను దెబ్బతీయడమే కాక మానసిక అనారోగ్యానికీ దారితీస్తుంది.
- పైగా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వెంటనే ప్రతిస్పందించే వారికి కాలగమనంలో అంత విలువా ఉండదు.
English Translation

Answering...if it becomes a problem..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

- Ramesh, who is studying BTech Secondary, no matter how much work he is doing, as soon as the notification sounds, he stops the work and gives a reply. The reason for this is the concern that who will think if it is not given. Once I got a message while in the washroom. On hearing that sound, he slipped and fell while going out to take the phone. He did not even have the discretion to reply even for a moment.
- Newly joined software job, Anuja wants to get a good name. That's why she was active in office WhatsApp groups to always be available to her boss and colleagues. She used to take whatever task was given to me. After some years, he started doing things even though he was busy. Lately he realized that excessive availability can do so much.
If there is a notification sound on the cell phone... the rush to respond immediately... whether it is eating, whether it is in the washroom, talking to parents... fingers have to go to the keyboard. Experts warn that this excessive availability will lead to confusion in the future. We take pride in being responsible and valuing others more than anyone else. This habit-forming thread eventually leads to thinking about those replies even in sleep. Eventually the mind becomes addicted to it and we forget our goals and responsibilities. There is no benefit if the hands hold the leaves...also if the time passes, it is of no use. class="my-2">
Let's try this..
No less than drugs..