Guntur: మాతృభాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పేలా..

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 03 Jan 2026 19:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

గుంటూరులో వైభవంగా కొనసాగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

గుంటూరు: మాతృ భాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పిన మహనీయులను గుర్తుకు తెచ్చుకునేలా.. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా.. గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఏర్పాటు చేసిన మహాసభలకు ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌  ఆకుల శేషసాయి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, టి.డి.జనార్ధన్‌, జస్టిస్ మానవేంద్ర రాయ్, తమిళనాడు నేత గోపీనాథ్‌ తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల  నుంచి విచ్చేసిన అతిథులకు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు.

పిల్లలకు మాతృభాషను దూరం చేయొద్దు: జస్టిస్‌ ఆకుల శేషసాయి

‘‘సందేశం ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు.. నాలుగు అమ్మ మాటలు వినటానికి వచ్చా. మాతృభాషను విస్మరిస్తే ఆ జాతి మనుగడ కష్టం. అమ్మను, అమ్మ భాషని గౌరవించే వాళ్లు ఎప్పటికీ తప్పు చేయరు. పిల్లలను మాతృభాషకు దూరం చేయొద్దు. అమ్మ భాషను భావితరాలకు అందించాలి’’ అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల శేషసాయి అన్నారు.

తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు: టి.డి.జనార్థన్‌

‘‘చాలామంది ఇతర దేశాల్లో తెలుగు భాష కోసం సంఘాల నడుపుతున్నారు. అలాంటి అభిమానులంతా ఈ మహాసభలకు హాజరయ్యారు. ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదు. తెలుగువారి కోసం, తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషిని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు. మనమంతా అమ్మ భాష అభివృద్ధికి కృషి చేయాలి. తెలుగు మహాసభల లాంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని ఘనంగా చాటాలి. సినిమాల్లో కూడా తెలుగు భాష అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారు. అనేక దేశాల్లో తెలుగును రెండో భాషగా బోధిస్తున్నారు. మాతృభాష మనుగడలో ఉన్నప్పుడు మాత్రమే మన ఉనికి ఉంటుంది. పాఠశాలల్లో పిల్లలు ఆంగ్లం మాట్లాడినప్పటికీ ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడేలా చూడాలి’’ అని తెదేపా నేత టి.డి.జనార్థన్‌ అన్నారు.

తెలుగు భాష పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: జస్టిస్ మానవేంద్ర రాయ్ 

‘‘తెలుగు మహాసభలకు హాజరు కావడానికి తొలుత సంకోచించా. ఉద్యోగరీత్యా ఆంగ్లంతో ఎక్కువ సంబంధం ఉంటుంది. అందువల్ల తెలుగులో మాట్లాడడం తక్కువగా ఉంటుంది. బ్రిటిష్ వారి పరిపాలన వల్ల చట్టాలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. వైద్య విద్య కూడా ఆంగ్లంలోనే కొనసాగుతోంది. బ్రిటిష్ వారు వెళ్లిపోయినా.. వారి భాషను మనం కొనసాగించడం వల్ల ఆంగ్లం మనం జీవితంలో భాగమైంది. ఆంగ్ల భాష ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. గుజరాత్‌లో ప్రభుత్వ పరమైన అన్ని అంశాలు గుజరాతీ భాషలోనే ఉంటాయి. ప్రభుత్వ పరమైన విధానాల వల్ల మార్పు సాధ్యం. మాతృభాషను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయం. కేవలం ఈ మూడు రోజులు మహాసభల ద్వారానే కాకుండా భాషా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

తమిళనాడులో తమిళ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు: గోపీనాథ్‌

‘‘తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు ప్రయత్నిస్తాను. తమిళనాడులో తమిళ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నేను ప్రాతినిథ్యం వహించే ప్రాంతం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతం. అప్పట్లో రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతో ఇబ్బంది పడ్డాం. తెలుగు వారైనా మా పిల్లలకు తమిళంలో పరీక్షలు పెట్టారు. ఏ పార్టీ కూడా తమిళనాడులోని తెలుగువారి సమస్యను పట్టించుకోలేదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తమిళనాడులో 40 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే నేనొక్కడినే తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తాను. తమిళనాడు నేతలు తమిళంలోనే ప్రసంగాలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన ఎంపీలు ఎవరూ కూడా తెలుగులో మాట్లాడకపోవడం బాధాకరం’’ అని తమిళనాడు నేత గోపీనాథ్‌ అన్నారు.

► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మహాశివరాత్రి తిరునాళ్లు.. ప్రారంభమైన ఎడ్ల పూటీ లాగుడు పోటీలు [ 17-02-2026] నందిగామ మండలం దాములూరు శివారు కూడలిలో సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి.
  • రైల్వే వంతెన నిర్మాణ పనుల పరిశీలన [ 17-02-2026] గుంటూరు నగరంలోని రైల్వే వంతెన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు.
  • వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి [ 17-02-2026] వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
  • జీతాలు పెంచాలంటూ అటవీ ఒప్పంద ఉద్యోగుల నిరసన [ 17-02-2026] ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచాలని కోరుతూ అటవీశాఖలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు మంగళగిరి జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.
  • ఎమ్మెల్యే ధూళిపాళ్ల తల్లి నివాసంలో భారీ చోరీ [ 17-02-2026] గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది.
  • అర్థరాత్రి నుంచి మొదలైన రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ [ 17-02-2026] గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం అర్థరాత్రి  నుంచి అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ప్రారంభమైంది.
  • ఉపాధి హామీ పనుల పూర్తికి పరుగులు [ 17-02-2026] మరో 40 రోజుల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముగిసిపోతుండడం, వీబీజీరామ్‌జీ పేరుతో సరికొత్తగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో పనులు, పద్దులను యుద్ధప్రాతిపదికపై ముగించేందుకు అధికారులు దృష్టి సారించారు.
  • బడ్జెట్‌ లేదంటారు... బకాయిలు కట్టరు! [ 17-02-2026] కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేసేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఏటా బడ్జెట్‌ లేదన్న సాకుతో చాలా కార్యాలయాలు బకాయి పెడుతున్నాయి.
  • వారు ఆడిందే ఆట! [ 17-02-2026] అధికారుల నిర్లిప్తత.. స్వార్థం... గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల పరువు తీస్తున్నాయి. అవినీతి అక్రమాలపై అంతులేని ఆరోపణలున్నా ఏళ్ల తరబడి పాతుకుపోయి రాజకీయ అండతో శాసిస్తూ.. నచ్చినట్టుగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. 
  • అంబటి సంక్రాంతి వసూళ్ల కేసులో ముగిసిన వాదనలు [ 17-02-2026] మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబుపై సంక్రాంతి వసూళ్ల కేసులో వాదనలు ముగిశాయి. తీర్పు ఈ నెల 18న వెలువరిస్తామని గుంటూరు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి కుముదిని ప్రకటించారు. 
  • పనిలో చేరగానే.. పసిడిపై కన్నేశాడు! [ 17-02-2026] పంజాగుట్టలోని బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడిన ఇంటిదొంగను సోమవారం అరెస్ట్‌ చేసినట్టు ఖైరతాబాద్‌ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. దొంగతనం జరిగిన 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్న పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ.
  • వినమ్రులై.. వి‘జేఈఈ’లై [ 17-02-2026] ఐఐటీ, ఎన్‌ఐటీలలో చదవాలనేది వారి ఆకాంక్ష... కల సాకారానికి సంకల్ప సిద్ధితో అడుగులేశారు.. చక్కటి ప్రణాళిక.. నిరంతర కార్యాచరణతో దూసుకెళ్లారు.
  • అబ్బురం.. అభినందనీయం [ 17-02-2026] సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో రైతుల చొరవకు గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అబ్బురపడ్డారు. సాగు విధానాల్లో ఇక్కడి రైతులు ముందంజలో ఉన్నారని ప్రశంసల వర్షం కురిపించారు.
  • విదేశీ విడిదికి వచ్చేశాయ్‌! [ 17-02-2026] ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం గ్రామం వందల ఏళ్ల నుంచి విదేశీ విహంగాల విడిదిగా గుర్తింపు పొందింది.  ఏటా క్రమం తప్పకుండా వచ్చే వేవ్స్‌ జాతి కొంగలు(వేవ్స్‌ స్టార్క్స్‌) కోసం గ్రామస్థులు ఎదురుచూస్తూ ఉంటారు.
  • సులభతరం.. చేలోకి యంత్రం [ 17-02-2026] సాగులో ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. రైతులకు వ్యయ, ప్రయాసలను తగ్గిస్తూ సులభతర పద్ధతులను అందుబాటులోకి తెస్తుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా కొన్నేళ్ల నుంచి ఆన్‌లైన్‌ సేవలను వ్యవసాయానికి అనుసంధానం చేస్తోంది.
  • కాళ్లరిగేలా తిరిగినా.. కాస్తయినా కనికరించరా? [ 17-02-2026] ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ప్రతి అర్జీదారుడి సమస్యను సకాలంలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ అధికారులకు సూచిస్తున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో ఫలితం ఉండట్లేదు.
  • కొడుకులు ఉన్నా.. ఆదరించడం లేదు! [ 17-02-2026] ముదిమి వయసులో తనను కన్నబిడ్డలు ఆదరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ వృద్ధురాలు అధికారుల ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. మచిలీపట్నంలోని జవ్వారుపేటకు చెందిన షేక్‌ అస్మతున్నీసా లేవలేని స్థితిలో ఇబ్బందులు పడుతోంది.
  • నాలుగేళ్ల చిన్నారిపై సొంత బంధువు లైంగిక దాడి [ 17-02-2026] పెదపారుపూడి మండలానికి చెందిన నాలుగేళ్ల బాలికపై సొంత పెదనాన్న లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పామర్రు స్టేషన్లో గుడివాడ డీఎస్పీ ధీరజ్‌ వినీల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం..
  • హలధారీ.. ఇదిగో సేంద్రియ దారి! [ 17-02-2026] రసాయనాలతో నిండిన సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యం వైపు రైతన్నను నడిపించేదుకు సేంద్రియ రైతోత్సవానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో రైతు సాధికార సంస్థ అడుగేస్తోంది.
  • వేసవి డిమాండ్‌ తట్టుకునేందుకు విద్యుత్తు శాఖ సిద్ధం [ 17-02-2026] ఈ ఏడాది వేసవి విద్యుత్తు డిమాండ్‌ తట్టుకునేందుకు విద్యుత్తు శాఖ సన్నద్ధమైంది. ఏటా 20 నుంచి 30 శాతం విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని  ఉపకేంద్రాలు కొత్తవి ఏర్పాటు చేస్తారు.
  • ఈ వినతి వెనుక లక్షల కుటుంబాల కన్నీళ్లు ఉన్నాయి [ 17-02-2026] వైకాపా ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య పేదలకు జారీ చేసిన ఇళ్ల పట్టాలు చెల్లుబాటు కాలేదని, వీటిపై విచారణ చేపట్టాలని భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ నేతృత్వంలో.

English Translation

Guntur: To raise awareness of the mother tongue... To show the glory of Telugu..

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 03 Jan 2026 19:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

The 3rd World Telugu Congress in Guntur continues in splendor

Guntur: To raise awareness of the mother tongue... To remember the great ones who have shown the glory of Telugu... To reflect our culture and traditions... Third World Telugu Congress in Guntur It's happening ridiculously. Odisha Governor Kambhampati Haribabu, AP Assembly Speaker Chintakayala Ayyannapatra, retired High Court judge Justice Akula Seshasai, former MP Yarlagadda Lakshmiprasad, T.D. Janardhan, Justice Manavendra Roy, Tamil Nadu leaders attended the Mahasabha organized by Andhra Saraswata Parishad at Sathya Sai Spiritual City in the suburb of Guntur. Gopinath and others were present. Andhra Saraswata Parishad president Ghajal Srinivas welcomed the guests who came from different places. Many speakers spoke on the occasion and explained the greatness of Telugu language. Seshasai

''I didn't come here to give a message.. I came to hear the words of four mothers. If the mother tongue is ignored, it is difficult for the race to survive. Those who respect mother and mother's language will never do wrong. Don't keep children away from mother tongue. Mother's language should be passed on to future generations," said Justice Akula Seshasai, a retired judge of the High Court.

NTR has done a lot for Telugu language: T.D. Janarthan

"Many people are running associations for Telugu language in other countries. All such fans attended these conferences. There is no country in the world without Telugus. NTR has worked a lot for Telugu people and Telugu language. CM Chandrababu is continuing his efforts. We all should work for the development of our mother tongue. The superiority of the Telugu language in the world should be proudly displayed through programs like Telugu Mahasabhas. NTR has worked so hard for the development of Telugu language in movies as well. Telugu is taught as a second language in many countries. Our existence exists only when the mother tongue survives. Even if children speak English in schools, they should be made to speak Telugu at home," said TEDP leader T.D. Janarthan.

Special steps should be taken to preserve the Telugu language: Justice Manavendra Roy

"First hesitate to attend Telugu Mahasabhas. Employability has more to do with English. Hence speaking in Telugu is less. Due to the British rule, all the laws were in English. Medical education also continues in English. Even though the British left.. English became a part of our life because we continued their language. Special attention should be given to get rid of the influence of English language. All government matters in Gujarat are in Gujarati language. Change is possible because of government policies. It is commendable that these Telugu Mahasabhas are organized with the intention of preserving the mother tongue. Special steps should be taken to preserve the language not just through these three days.

Tamil language is given utmost priority in Tamil Nadu: Gopinath

''I will try to participate in any program related to Telugu. In Tamil Nadu, Tamil language is highly preferred. The region I represent is the border region of Karnataka and Andhra Pradesh. At that time, we had a lot of trouble during the partition of the state. Our children were given exams in Tamil even though they were Telugu. No party cares about the problem of Telugu people in Tamil Nadu. We faced many difficulties due to this. If there are 40 members of Parliament in Tamil Nadu, I alone will take oath in Telugu. Tamil Nadu leaders give speeches in Tamil only. Tamil Nadu leader Gopinath said it is sad that none of the MPs from Andhra Pradesh and Telangana speak Telugu. on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Mahasivaratri Thirunallu.. Edla Poothi Lagudu competitions started [ 17-02-2026] Mahashivratri Tirunal is being celebrated in the temple of Sangameshwara Swamy in Nandigama mandal Damuluru suburb.
  • Observation of construction works of railway bridge [ 17-02-2026] District Collector Tamim Ansaria inspected the railway bridge construction work in Guntur city on Tuesday. 17-02-2026] District Collector Tamim Ansaria has ordered the officials to take measures to prevent drinking water shortage in summer. 17-02-2026] The contract employees working in the forest department staged a protest on the Mangalagiri National Highway demanding job security and salary hike. 17-02-2026] A massive theft took place at the residence of Pramila Devi, the mother of Guntur district Ponnur MLA Dhulipalla.
  • The recruitment rally which started from midnight [ 17-02-2026] Agniveer recruitment rally started at Guntur Acharya Nagarjuna University from late night on Monday. 17-02-2026] With Mahatma Gandhi's National Rural Employment Guarantee Scheme coming to an end in the next 40 days, and a new one under the name of VBG Ramji, the authorities are focusing on completing the works on a war footing. Do not pay dues! [ 17-02-2026] Guntur Municipal Corporation is struggling to collect property tax from central and state government offices. Many offices pay arrears on the pretext of not having a budget every year.
  • The game they play! [ 17-02-2026] Detachment of officials.. Selfishness... Guntur Government Comprehensive Hospital is defaming it. Despite the endless accusations of corruption and illegality, they have been ruling for years and are running the affairs as they like. 
  • Arguments concluded in the Ambati Sankranti collection case [ 17-02-2026] Arguments in the Sankranti collection case against former minister and Vaikapa leader Ambati Rambabu have ended. Guntur Principal Senior Civil Court Judge Kumudi announced that the verdict will be issued on 18th of this month. 
  • When he got to work.. he looked at Pasidi! [ 17-02-2026] Khairatabad DCP K. Shilpavalli said that a house thief was arrested on Monday for stealing from a gold jewelery shop in Panjagutta. Panjagutta ACP Muralikrishna caught the accused within 24 hours of the theft.
  • Vinamrulai.. V'JEE'lai [ 17-02-2026] Their aspiration is to study in IITs and NITs... They stepped forward with determination to make their dreams come true.. Well planned.. They rushed forward with continuous activity.
  • Amazing.. Appreciated [ 17-02-2026] Bill Gates, chairman of the Gates Foundation, was amazed at the initiative of farmers in the use of technology. The farmers here are at the forefront of cultivation methods. [ 17-02-2026] Venkatapuram village of Penuganchiprolu mandal of NTR district has been recognized as a foreign tourist destination for hundreds of years.  Villagers are waiting for waves storks (waves storks) which come regularly every year. 17-02-2026] From time to time, the agriculture department is giving a lot of attention to mechanization in cultivation. It makes available easier methods reducing the cost and effort to the farmers. As part of Digital India, it has been connecting online services to agriculture for a few years now. [ 17-02-2026] Even though CM Chandrababu has been suggesting to the authorities to solve the problem of every petitioner in the public problem resolution platform (PGRS) in every case, there is no expected result in the district. [ 17-02-2026] An old woman expressed her grievances to the authorities saying that her children were neglecting her in her old age. Sheikh Asmatunnisa of Javwarupeta in Machilipatnam is struggling to get up.
  • A four-year-old girl was sexually assaulted by her own relative [ 17-02-2026] A four-year-old girl from Pedaparupudi mandal was sexually assaulted by her own stepfather on Monday. According to the details revealed by Dhiraj Vinil, Gudivada DSP at Palmeru station..
  • Haladhari.. Here is the organic way! [ 17-02-2026] The Organic Farmers' Festival was launched in order to stop the chemical-filled cultivation methods and lead the farmers towards natural farming. With the aim of promoting organic cultivation in 50 thousand acres in the district, the Farmers' Empowerment Organization is asking. 17-02-2026] The electricity department is prepared to cope with the summer electricity demand this year. Every year the electricity demand increases by 20 to 30 percent. Keeping this in mind, new sub-centres will be set up.
  • Behind this plea are the tears of lakhs of families [ 17-02-2026] Under the leadership of BJP district president Adduri Sriram, the house titles issued to the poor between 2019-24 during the Vaikapa government were invalid and an investigation should be conducted.