School: స్థాయి పెంచారు సరే.. హెచ్‌ఎంలు ఏరి?

Eenadu icon
By Telangana News Desk Published : 03 Jan 2026 03:20 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి వరకు బోధించే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో (హైస్కూళ్లలో) ప్రధానోపాధ్యాయు(హెచ్‌ఎం)ల పాత్ర అత్యంత కీలకం. పాఠశాలల అభివృద్ధి.. విద్యార్థుల ప్రగతి.. ఉత్తమ ఫలితాల సాధన వంటివాటికి హెచ్‌ఎంల అవసరం ఎంతో ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టులు.. గత దశాబ్దకాలంగా రాష్ట్రంలోని చాలా స్కూళ్లకు మంజూరు కాలేదు. ప్రధానంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా ఉన్నతీకరించిన చోట గెజిటెడ్‌ హెచ్‌ఎం(జీహెచ్‌ఎం) పోస్టులను మాత్రం ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ మేరకు 300 వరకు హైస్కూళ్లు జీహెచ్‌ఎం పోస్టుల కోసం ఎదురు చూస్తున్నాయి.

  • రాష్ట్రంలో 4,704 హైస్కూళ్లు ఉండగా.. వాటిలో 300 వరకు అప్‌గ్రేడ్‌ అయినవి ఉన్నాయి. అవన్నీ రాష్ట్ర విభజన తర్వాత జరిగినవే. హైస్కూళ్లకు జీహెచ్‌ఎం పోస్టు ఉండాలి. అయితే చాలాచోట్ల వాటిని మంజూరు చేయకపోవడంతో.. అక్కడి సీనియర్‌ టీచర్లకు ఇన్‌ఛార్జి హెచ్‌ఎంలుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు అటు పాఠాలు బోధించడంతోపాటు.. ఇటు పరిపాలనాపరమైన వ్యవహారాలు చూడటం సమస్యగా మారింది. పోస్టులు మంజూరైతే సీనియారిటీ ఆధారంగా పదోన్నతి కల్పించి.. భర్తీ చేయవచ్చు.
  • ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో అప్‌గ్రేడ్‌ అయిన హైస్కూళ్లలో వలసల వల్ల పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. ఉదాహరణకు 2015లో (పదేళ్ల క్రితం) అప్‌గ్రేడ్‌ అయిన శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో 640 మంది పిల్లలుండగా.. ఆ పాఠశాలకు హెచ్‌ఎం పోస్టు మంజూరు కాలేదు. అలాగే 2018లో ఏర్పడిన కోకాపేట హైస్కూల్‌లో 315 మంది విద్యార్థులుండగా.. అక్కడా అదే పరిస్థితి. మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 12 హైస్కూళ్లకు హెచ్‌ఎం పోస్టులు అవసరం.

పోస్టులను బదిలీ చేసినా మంచిదే..

కనీసం 50-100 మంది విద్యార్థులు లేని హైస్కూళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నాయి. కేవలం 10 మంది పిల్లలున్న ఉన్నత పాఠశాలలు 18 ఉండటం గమనార్హం. అలాంటివాటి నుంచి హెచ్‌ఎం పోస్టులను అప్‌గ్రేడ్‌ అయిన చోటుకు మార్చినా కొంతవరకు సమస్య తీరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైన చోటుకు పోస్టులను బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించేలా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలని వారు కోరుతున్నారు.

ఒక్క విద్యార్థీ లేని హైస్కూళ్లు కూడా 40 వరకు ఉన్నాయి. వాటికి హెచ్‌ఎం పోస్టులున్నాయి. ఈక్రమంలో అక్కడ వాటిని రద్దు చేయాలన్నది పాఠశాల విద్యాశాఖ ఆలోచన. మరో 261 జీహెచ్‌ఎం పోస్టులు అవసరమని, వాటిని మంజూరు చేయాలని మూడు నెలల క్రితం ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య డిమాండ్‌ చేశారు. 

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కార్‌ టీ-సెల్‌ థెరపీతో క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు కార్‌ టీ-సెల్, జీన్‌ థెరపీలతో భవిష్యత్తులో క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం(అమెరికా) ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌ పేర్కొన్నారు.
  • జీవన ప్రమాణాలను మార్చేసే అద్భుత శక్తి.. ఏఐ కృత్రిమ మేధ (ఏఐ) ఒక సాంకేతిక విప్లవం మాత్రమే కాదని.. అది ప్రకృతి రహస్యాలను ఛేదించి, మానవాళి జీవన ప్రమాణాలను మార్చేసే అద్భుత శక్తి అని గూగుల్‌ డీప్‌మైండ్‌ సైన్స్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ డా.పుష్మీత్‌ కోహ్లీ స్పష్టం చేశారు.
  • రోడ్డుప్రమాద బాధితులకు అండగా ‘పీఎం రాహత్‌’ రోడ్డుప్రమాద బాధితులను ఆదుకునేలా.. ‘పీఎం రాహత్‌’ పథకంతో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు.
  • ‘టిమ్స్‌’లో సకల సౌకర్యాలు ఉండాలి: రాజనర్సింహ హైదరాబాద్‌ సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రిని వచ్చే నెల ఉగాదికి ప్రారంభించనున్న నేపథ్యంలో.. సకల సౌకర్యాలతో సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
  • ఐదు నుంచి పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల క్యూర్‌(కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
  • సీఎంకు అభినందనల వెల్లువ మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వచ్చి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.
  • ముంబయి వెళ్లిన సీఎం మహారాష్ట్ర ప్రభుత్వం, బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘క్లైమెట్‌ వీక్‌’ పేరుతో బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ముంబయి బయలుదేరి వెళ్లారు.
  • భూ అక్రమాలపై ‘కోడ్‌’ ఆడిటింగ్‌! సాగు భూముల పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆధారంగా చేసుకుని జరిగిన భూ అక్రమాలను పూర్తిస్థాయిలో వెలికితీసేందుకు ‘కోడ్‌’ ఆడిటింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • గుట్టలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు మహా దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో బుధవారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
  • 23న మంత్రివర్గ సమావేశం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న జరగనుంది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు, రానున్న మూడు నెలల్లో తాగునీరు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.
  • స్టాండింగ్‌లోనే.. సిట్‌ అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • ఏడాదిలో ‘కాళేశ్వరం’ బ్యారేజీల పునరావాస డిజైన్లు కాళేశ్వరం బ్యారేజీలు ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల’ పునరుద్ధరణకు అవసరమైన పునరావాస డిజైన్లు రూపొందించే టెండర్‌ అగ్రిమెంట్‌ ఖరారయింది.
  • తెలంగాణ అంటేనే కేసీఆర్‌ ఆనవాలు ‘‘రాష్ట్రంలో తెలంగాణవాదుల జాతి, తెలంగాణ ద్రోహుల జాతి మాత్రమే ఉన్నాయి. మాది ఉద్యమకారుల జాతి. వారిది ద్రోహుల జాతి. నా తండ్రి తెలంగాణ జాతికి హీరో అన్న విషయం వాస్తవం.
  • మెదక్‌ కలెక్టర్‌కు 6 నెలల జైలు, జరిమానా ఆస్తి హక్కులకు సంబంధించి ఇరుపక్షాలకు నోటీసులు పంపి వివాదాన్ని పరిష్కరించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
  • ప్రజలు కొన్న భూములను ప్రభుత్వానివని ఎలా నిర్ధారిస్తారు? ప్రజలు కష్టపడి స్థలం కొనుగోలు చేస్తే.. అవి ప్రభుత్వ భూములని ఎలా లాక్కుంటారని హైడ్రాపై మంగళవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • ‘ఈహెచ్‌ఎస్‌ ట్రస్టులో పెన్షనర్ల తరఫున సభ్యులుండాలి’ రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్యపథకం కోసం ఏర్పాటు చేయనున్న ట్రస్టులో పెన్షనర్ల తరఫున ఆరుగురు సభ్యులను నియమించాలని రాష్ట్ర పెన్షనర్ల ఐకాస డిమాండ్‌ చేసింది.
  • గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్లు విడుదల తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
  • కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌రెడ్డి, చంద్రబాబు భారాస అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని మంగళవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు రాజకీయ పార్టీల ప్రముఖులు, సినీ తారలు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
  • సంక్షిప్త వార్తలు (13) నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసినందున రాష్ట్రంలో పురపాలక ఎన్నికల కోడ్‌ గడువు మంగళవారంతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
  • బీసీలకు 61% ఛైర్మన్‌ పదవులు.. ఉద్యమ ఫలితమే: జాజుల పల్లెల్లోనే కాదూ.. పట్టణాల్లోనూ బీసీల సత్తా చాటామని బీసీ ఐకాస ఛైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

English Translation

School: The level has been raised ok.. HMs?

Eenadu icon
By Telangana News Desk Published : 03 Jan 2026 03:20 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Today, Hyderabad: In government high schools teaching up to class 10 (In high schools) the role of Headmasters (HMs) is very crucial. HMs are very much needed for the development of schools, progress of students, achievement of best results. Posts with such priority.. have not been sanctioned to many schools in the state for the past decade. Government has not sanctioned gazetted HM (GHM) posts mainly where primary and secondary schools have been upgraded to high schools. To this extent, up to 300 high schools are waiting for GHM posts.

  • There are 4,704 high schools in the state.. among them up to 300 are upgraded. All of them happened after the partition of the state. High schools should have GHM post. But since they were not sanctioned in many places, the senior teachers there were given the responsibilities as in-charge HMs. Due to this, besides teaching lessons, it has become a problem to look after administrative affairs. If the posts are approved, they can be promoted on the basis of seniority and replaced. For example, in 2015 (ten years ago), Kondapur ZP High School of Serilingampally Mandal, which was upgraded, had 640 children, but HM post was not granted to that school. Also, there are 315 students in Kokapet High School, which was established in 2018. The situation is the same there. All 12 high schools in Medchal district need HM posts.

It would be better if the posts are transferred..

There are tens of high schools across the state that do not have at least 50-100 students. It is noteworthy that there are 18 high schools with only 10 children. Experts suggest that shifting HM posts from such to upgraded places will solve the problem to some extent. They also want the government to issue orders to provide flexibility to transfer the posts to the required place.

There are up to 40 high schools without a single student. They have HM posts. It is the idea of ​​the school education department to cancel them there in this program. Three months ago, school education officials sent proposals to the government that 261 more GHM posts were required and they should be sanctioned. PRTU Telangana State President M. Chennaiah demanded that the government should grant HM posts quickly keeping in view the next academic year. 

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence on this matter.

More

  • Revolutionary changes in cancer treatment with CAR T-cell therapy Prof. Dr. Bruce Levin of the University of Pennsylvania (USA) stated that with Car T-cell and gene therapies, there will be revolutionary changes in the treatment of cancer in the future. Dr. Pushmeet Kohli, Vice President of Google's DeepMind Science Division has clarified that artificial intelligence (AI) is not only a technological revolution. Union Minister Kishan Reddy praised the Modi-led government for taking a big step forward with the 'PM Rahat' scheme to support road accident victims. Hyderabad Sanatnagar Tims Hospital will be opened next month in the context of Ugadi.. Health Minister Damodar Rajanarsimha ordered the officials to prepare with all facilities.
  • Indiramma houses on five to ten floors. State Revenue and Housing Minister Ponguleti Srinivasa Reddy said that the construction of Indiramma houses will be started soon in CURE (Core Urban Region Economy) of Hyderabad, Medchal Malkajigiri, Rangareddy and Sangareddy districts.
  • Congratulations to the CM Many ministers, MLAs and other leaders came to Chief Minister Revanth Reddy's house for his huge victory in the municipal elections and congratulated him by giving flowers.
  • CM who went to Mumbai. CM Revanth Reddy left for Mumbai from Shamshabad Airport on Tuesday night to participate in a conference under the joint auspices of Maharashtra Government and Brihan Mumbai Corporation named 'Climate Week' at Bandra Kurla Jio Convention Center.
  • 'Code' auditing on land irregularities! The government has decided to conduct 'code' auditing to fully uncover land irregularities based on technical loopholes in the agricultural land portal.
  • Brahmotsavam in Gutta from today. The annual Brahmotsavam will begin from Wednesday at Yadagirigutta, the great divine temple.
  • Ministerial meeting on 23 The state cabinet meeting will be held on 23rd of this month. In the budget meetings of the Legislative Assembly, there is a possibility to discuss issues related to drinking water, health and education in the cabinet in the next three months.
  • While standing.. Sit The special investigation team (SIT) which was set up with great fanfare to crack down on the betting apps that are taking innocent lives is limited to the name. The tender agreement for making the necessary rehabilitation designs for the restoration of Kaleshwaram barrages 'Medigadda, Annaram, Sundilla' has been finalised. "In the state there is only a race of Telanganaists and a race of Telangana traitors. We are a race of activists. They are a race of traitors. It is a fact that my father is a hero of the Telangana nation. The High Court expressed impatience with Medak District Collector Rahulraj, who violated the order to resolve the dispute by sending notices to both parties regarding property rights. If people work hard and buy land.. On Tuesday, the High Court expressed its anger against HYDRA that how they grab government lands.
  • 'EHS Trust should have members on behalf of pensioners'. The State Pensioners' Association has demanded that six members be appointed on behalf of the pensioners in the trust to be set up for the employees' health scheme in the state. The State Finance Department issued an order on Tuesday releasing Rs.256 crores to the Gram Panchayats in Telangana.
  • Revanth Reddy and Chandrababu congratulated KCR on his birthday. Celebrating the birthday of President of India and former CM KCR on Tuesday, Chief Ministers of Telugu states, Ministers, celebrities of various political parties, film stars and leaders from various fields extended their greetings.
  • Brief News (13) The State Election Commission has revealed that the municipal election code has expired on Tuesday as the election process for municipal bodies and municipal bodies has ended. BC ICASA Chairman Jajula Srinivas Goud said that not only in rural areas, but also in towns.