Water Disputes: జలాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల్లో రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున నియమించింది. గత ఏడాది జులై 16న జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కమిటీకి ఛైర్మన్‌గా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్, సభ్యులుగా తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ సలహాదారు, ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీ(జనరల్)... ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఈఎన్సీ(నీటిపారుదల), అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీర్ ఉంటారు. వీరితోపాటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు, జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్ ఇంజినీర్ సభ్యులుగా, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్ ఎప్రైజల్ ఆర్గనైజేషన్) మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.
నీటి యాజమాన్యంపై సూచనలు...
జల వనరులకు సంబంధించి రెండు రాష్ట్రాలు వ్యక్తం చేసిన పలు అంశాలను సమగ్రంగా, సాంకేతికంగా పరిశీలించి... నీటి యాజమాన్యానికి సంబంధించి సూచనలు చేయడం, నీటి పంపిణీ న్యాయంగా, పటిష్ఠంగా అమలు జరిగేలా చూడటంపై కమిటీ దృష్టి సారిస్తుంది. ఈ కమిటీ 3 నెలల్లోగా నివేదికను అందజేయాల్సి ఉంటుంది. కమిటీకి అవసరమైతే ఇతర అధికారులు, నిపుణుల సాయం తీసుకోవడానికి అవకాశం కల్పించారు. గతంలో గోదావరి-బనకచర్లపై చర్చ సందర్భంగా ఈ కమిటీ అంశం ముందుకు వచ్చింది. ప్రస్తుత కమిటీ బాధ్యతల్లో గోదావరి, కృష్ణా ఇలా దేన్నీ ప్రస్తావించకుండా రెండు రాష్ట్రాల మధ్య జలాలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Water Disputes: Central committee to discuss water

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Today, Hyderabad: The Union Ministry of Water Resources has issued orders to form a committee with 12 members headed by the chairman of the Central Water Association to discuss the issues of river water between Andhra Pradesh and Telangana. Four members were appointed from two states each. It said that this committee was formed in accordance with the decision taken in the meeting of the Chief Ministers of the two states held on July 16 last year under the chairmanship of the Minister of Hydropower. The committee will be chaired by the Chairman of the Central Water Society (CWC), and the members will be Irrigation Department Adviser, Chief Secretary, Special Secretary, ENC (General) from Telangana... Water Resources Department Special Chief Secretary, Adviser, ENC (Irrigation) from Andhra Pradesh and Chief Engineer of Interstate Water Resources Department. Apart from them, the Chairman of Krishna and Godavari River Management Boards, Chief Engineer of National Water Development Authority (NWDA) and Chief Engineer (Project Appraisal Organization) of Central Water Society will act as Member Secretary.
Instructions on water ownership...
The committee will focus on comprehensively and technically examining the many points expressed by the two states regarding water resources... making suggestions regarding water ownership and ensuring that water distribution is implemented fairly and firmly. The committee has to submit its report within 3 months. The committee has been given the opportunity to take the help of other officers and experts if necessary. Earlier, during the discussion on Godavari-Banakachar, the issue of this committee came up. The Ministry of Water Power has revealed that the current committee's responsibilities will examine issues related to water between the two states without mentioning Godavari and Krishna.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :