Aadhaar like number for EV batteries: ఈవీ బ్యాటరీలకు ఆధార్ తరహా నంబర్.. దేనికంటే?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Aadhaar like number for EV batteries | దిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలకు ఆధార్ నంబర్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా బ్యాటరీల ఎండ్-టు-ఎండ్ జాడను గుర్తించడంతో పాటు సమర్థమైన రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం.. బ్యాటరీ తయారీదారు లేదా దిగుమతిదారు మార్కెట్‌లోకి తెచ్చే ప్రతి బ్యాటరీ ప్యాక్‌కు 21 అక్షరాల ‘బ్యాటరీ ప్యాక్ ఆధార్ నంబర్’ (BPAN) తప్పనిసరిగా కేటాయించాలి. ఈ నంబర్ బ్యాటరీపై స్పష్టంగా కనిపించేలా, తొలగించడానికి వీల్లేకుండా ఉండాలి.
బ్యాటరీలో వినియోగించే ముడిపదార్థాల దగ్గర నుంచి, వినియోగం, రీసైక్లింగ్ వరకు వివిధ దశలకు సంబంధించిన సమాచారాన్ని ఈ నంబర్ ద్వారా నిల్వ చేస్తారు. రీసైక్లింగ్ లేదా రీపర్పోజింగ్ వల్ల బ్యాటరీ లక్షణాలు మారితే కొత్త BPAN కేటాయించాలి. ఇది బ్యాటరీ ఎకోసిస్టమ్‌లో పారదర్శకత, జవాబుదారీతనం, స్థిరత్వం తెస్తుందని మంత్రిత్వ శాఖ ఆశిస్తోంది. బ్యాటరీ పనితీరు, పర్యావరణంపై ప్రభావాన్ని కూడా కచ్చితంగా ట్రాక్ చేయడం కుదురుతుందని తెలిపింది. ముఖ్యంగా సెకండ్-లైఫ్ వినియోగం, నిబంధనల అమలు, రీసైక్లింగ్‌లో సమర్థతలో ఈ BPAN కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
- సాంకేతిక లోపంతో ఖాతాలో రూ.40 కోట్లు.. నిమిషాల్లో రూ.1.75 కోట్ల లాభం
భారత్‌లో లిథియం-ఐయాన్ బ్యాటరీల మొత్తం డిమాండ్‌లో 80-90 శాతం విద్యుత్ వాహనాల నుంచే వస్తోంది. అందుకే మొదటి దశలో ఈవీ బ్యాటరీలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 2 kWh పైబడిన ఇండస్ట్రియల్ బ్యాటరీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కమిటీ (AISC)కి నిర్దేశించిన ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) ద్వారా దీన్ని అమలు చేయనున్నారు. బ్యాటరీ తయారీదారులు, ఈవీ తయారీదారులు, రీసైక్లర్లు, టెస్టింగ్ ఏజెన్సీలు, రెగ్యులేటరీ బాడీల ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారు. ఈ గుర్తింపు సంఖ్య వల్ల నకిలీ బ్యాటరీలను అరికట్టడమూ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Aadhaar like number for EV batteries: Aadhaar like number for EV batteries.. than what?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Aadhaar like number for EV batteries | Delhi: The Union Transport Ministry has proposed to give a unique identification number similar to Aadhaar number to electric vehicle (EV) batteries. The main objective of this system is to ensure end-to-end traceability of batteries and promote efficient recycling. Draft guidelines have been issued to this effect. Accordingly.. a battery manufacturer or importer must assign a 21-character 'Battery Pack Aadhaar Number' (BPAN) to every battery pack brought into the market. This number should be clearly visible on the battery and should not be removed.
Information related to the various stages of the battery, from the raw materials used in the battery, to consumption and recycling, is stored through this number. A new BPAN should be assigned if battery characteristics change due to recycling or repurposing. The ministry hopes that this will bring transparency, accountability and stability in the battery ecosystem. Battery performance and environmental impact can also be accurately tracked. The central government hopes that this BPAN will play a key role in the efficiency of second-life usage, enforcement of regulations and recycling.
- Rs.40 crores in the account due to technical error..Rs.1.75 crores profit in minutes
80-90 percent of the total demand for lithium-ion batteries in India comes from electric vehicles. That is why EV batteries will be given priority in the first phase and this policy will be implemented. This also applies to industrial batteries above 2 kWh. It will be implemented through the Automotive Industry Standards (AIS) prescribed by the Automotive Industry Standards Committee (AISC). Representatives of battery manufacturers, EV manufacturers, recyclers, testing agencies and regulatory bodies will be on this committee. The government hopes that this identification number will also prevent fake batteries.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :