Vijay Hazare Trophy: తిలక్ వర్మ సెంచరీ.. ఎట్టకేలకు బోణీ కొట్టిన హైదరాబాద్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా నాలుగు ఓటములు ఎదురైన తర్వాత శనివారం చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (109; 118 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అభిరత్ రెడ్డి (71 అర్ధ శతకంతో మెరిశాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో ఛండీగడ్ 37.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. సన్యాం సైనీ (46) టాప్ స్కోరర్. మనన్ వోహ్రా (24), విషు కశ్యప్ (27) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో చింతల రక్షణ రెడ్డి 3, చామ మిలింద్ 2, కన్నాల నితీశ్ రెడ్డి 2, మహ్మద్ సిరాజ్, అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
పోరాడి ఓడిన ఆంధ్ర
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 7 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఆంధ్రకు ఇది హ్యాట్రిక్ ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (130; 111 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. విశాల్ జైస్వాల్ (70), రవి బిష్ణోయ్ (31) పరుగులు చేశారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 4, నితీశ్ కుమార్ రెడ్డి 2, మిద్దె ఆంజనేయులు 2, జాగర్లపూడి రామ్ ఒక వికెట్ పడగొట్టారు. లక్ష్యఛేదనలో ఆంధ్ర 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. సి ఆర్ జ్ఞానేశ్వర్ (102) సెంచరీ చేశాడు. ఎస్‌డిఎన్‌వి ప్రసాద్ (48), శ్రీకర్ భరత్ (39), మార్తల ధనుష్ (30), నితీశ్ కుమార్ రెడ్డి (25) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అక్షర్ పటేల్ 2, అర్జాన్ నాగ్వాస్వాలా 2 రెండు వికెట్లు తీశారు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Vijay Hazare Trophy: Tilak Verma century..Hyderabad finally hit the mark

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Rajkot: Hyderabad finally hit the jackpot in the Vijay Hazare Trophy. After four consecutive defeats, they won the match against Chandigarh by 136 runs on Saturday. Batting first, Hyderabad scored 286 runs for the loss of 9 wickets. Captain Tilak Verma (109; 6 fours, 3 sixes off 118 balls) impressed with a century. Abhirat Reddy (71) shone with a half-century. The rest of the batsmen failed. Chandigarh were bowled out for 150 runs in 37.4 overs. Sanyam Saini (46) was the top scorer. Manan Vohra (24) and Vishu Kashyap (27) scored runs. Among the Hyderabad bowlers, Chintala Rakshana Reddy 3, Chama Milind 2, Kannala Nitish Reddy, Mohammad Siraj, Varun Goud took 2 wickets each.