Jana nayagan: ‘జన నాయకుడు’లో ‘భగవంత్ కేసరి’ కథ ఎంత?ట్రైలర్‌లో ఇవి గమనించారా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇప్పటివరకూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. కానీ, శనివారం ‘జన నాయకుడు’ (Jana Nayakudu) ట్రైలర్ వచ్చేసింది. చాలా విషయాల్లో స్పష్టత తెచ్చింది. ఇంకా చాలా విషయాలను దాచి పెట్టింది. మొత్తంగా చూస్తే, ఇది బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) మూవీకి రీమేకే. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే, విజయ్ చివరి సినిమా కావడంతో, అభిమానులు మెచ్చేలా దర్శకుడు హెచ్.వినోద్ చాలా మార్పులు చేసినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.
ఇక్కడ బాలకృష్ణ, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ఉన్నట్లే.. అక్కడ విజయ్, మమతి బైజు, బాబీ దేఓల్ ఉన్నారు. విజ్జి (శ్రీలీల) తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో చేర్చడమే భగవంత్ కేసరి (బాలకృష్ణ) ప్రథమ కర్తవ్యం. ఆమెని ఓ సింహంలా తయారు చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో రాహుల్ సాంగ్వీ (అర్జున్ రాంపాల్)తో యుద్ధం. ‘జన నాయకుడు’ లోనూ అంతే విజ్జి (మమితబైజు)ను ఆర్మీలో చేర్చడమే లక్ష్యంగా దళపతి (విజయ్) శిక్షణ ఇస్తాడు. రెండింటిలోనూ హీరో జైలుకు వెళ్తాడు. ఆ సీన్స్ కామన్‌గా ఉన్నాయి. ‘భగవంత్ కేసరి’లో ఓ హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇందులో అలాంటి సన్నివేశమే ఉంది. ఆ ఫ్యాక్టరీ చూడవచ్చు. ఇక్కడి వరకూ రెండు సినిమాలకు సంబంధించిన కథ, థీమ్ ఒకేలా ఉన్నాయి. కానీ, బాబీ దేఓల్ పాత్ర రంగ ప్రవేశంతో సినిమా టోన్ మారిపోయింది.
- ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
బాబీ ప్లాన్ ఓ-ఎం ఏంటి?
‘ఇప్పటి నుంచి 30వ రోజున ఇండియా నా కాళ్ల ముందు ఉంటుంది. ప్లాన్ ఓ.ఎం. అమలు చేస్తా’ అంటాడు బాబీ దేఓల్. భగవంత్ కేసరి నుంచి ‘జన నాయకుడు’ని వేరు చేసేది బహుశా ఇదే కావచ్చు. ఇక్కడి నుంచి ప్రకాశ్‌రాజ్, సునీల్, ప్రియమణి ఇలా కొత్త పాత్రలు తెరపై కనిపించాయి. రాకెట్ లాంచర్లు, డ్రోన్స్‌తో ఫైట్స్ ఇలా సినిమాలో ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్‌ను కూడా జోడించినట్లు తెలుస్తోంది. అప్పటివరకూ తన కూతురు విజ్జి సమస్య.. కాస్త దేశ సమస్యగా మారుతుంది. ఇక్కడి నుంచే రాజకీయ కోణాన్ని స్పృశిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దాడు హెచ్.వినోద్. ఇది పూర్తిగా విజయ్ రాజకీయ జీవితానికి మరింత ఉపయోగపడేలా మెరుగులు పెట్టినట్లు అర్థమవుతోంది.
మారిన విజయ్ క్రేజీ డైలాగ్..
‘ప్రజలకు మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు. నిన్ను నువ్వు కాపాడుకుని పారిపో’ అంటూ బాబీ వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంది. ఈ సన్నివేశం నుంచి సినిమా పూర్తిగా విజయ్‌ను ఎలివేట్ చేస్తూ సాగేలా హెచ్.వినోద్ తీర్చిదిద్ది ఉంటారు. ‘అర్హతలేని వాళ్లంతా కలిసి నిలబడ్డారు. వాళ్లు గెలవకూడదు’ అంటూ సంభాషణలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా విజయ్ సినిమాల్లో ఒక క్రేజీ డైలాగ్ ఉంటుంది. అదే ‘ఐయామ్ వెయిటింగ్’. కానీ, ఈ సారి ఆ డైలాగ్‌ను పూర్తి రాజకీయ కోణంలో మార్చి చెప్పారు. ‘నిన్ను నాశనం చేస్తాను. అవమానం చేస్తాను. ఎవడు చెప్పినా సరే.. తిరిగి వెళ్లే ఐడియానే లేదు.. ఐయామ్ కమింగ్’ అంటూ విజయ్ చెప్పే పంచ్ డైలాగ్ చూస్తే, ‘భగవంత్ కేసరి’ని ఎలా మార్చారో అర్థం చేసుకోవచ్చు. సినిమా కథ విషయంలో ఒక స్పష్టత వచ్చినా, విజయ్ అభిమానుల ఆకలి తీర్చడానికి ఇంకా చాలా స్టఫ్ అట్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫుల్ క్లారిటీ రావాలంటే జనవరి 9వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.. అప్పటి వరకూ సినీ అభిమానులు ‘వెయిటింగ్..’
-ఇంటర్నెట్‌డెస్క్
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మరో చారిత్రకగాథతో సంజయ్ లీలా భన్సాలీ.. ‘జై సోమనాథ్’ భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో చారిత్రక కథ సిద్ధమవుతోంది. లార్జర్ దేన్ లైఫ్ కథలను అందించడంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సిద్ధహస్తులు.
- చిన్న ఛేంజ్.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్ ఆ రోజే.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్‌ఎస్‌ఎస్) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది.
- ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల వాయిదా పడింది.
- దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్.. అలరిస్తున్న ప్రమోషనల్ వీడియో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు.
- అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ : ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిర్మాత ‘కపుల్ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్ మొగిలినేని తెలిపారు.
- వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే! వాలెంటైన్స్ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి.
- 2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఆసక్తికర పోస్టు తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ప్రకటించింది.
- ఈ కథ చిరంజీవికి బాగా తెలుసు.. విజయ్ సేతుపతిని అనుకున్నా కానీ: అర్జున్ తాను డైరెక్ట్ చేసిన ‘సీతాపయనం’ గురించి అర్జున్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
- పవర్‌ఫుల్ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ.. ‘జీపీఎస్’ అంటే ఇదే తరుణ్ భాస్కర్ కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.
- రామ్‌చరణ్ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే రామ్‌చరణ్ సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది.
- పవన్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదల తేదీ ఖరారైంది.
- ‘డెకాయిట్’ మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే అడివి శేష్ ప్రధాన పాత్రలో రానున్న ‘డెకాయిట్’ మరోసారి వాయిదా పడింది
- ‘వారణాసి’కి ‘అవతార్’తో పోలిక.. రాజమౌళి ఏమన్నారంటే! ‘వారణాసి’ కోసం రాజమౌళికి ప్రియాంక చోప్రా ఒక విజ్ఞప్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె దాని గురించి వివరించారు.
- వేసవిలో ‘బైకర్’.. శర్వా మూవీ కొత్త విడుదల తేదీ ఇదే శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘బైకర్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
- ధనుష్- సాయి పల్లవి జోడీ.. మరోసారి.. ఆ హిట్ డైరెక్టర్‌తో ధనుష్, సాయి పల్లవి మరో సినిమాలో సందడి చేయనున్నారు.
- ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో వినోదం వాటిదే! 2026లో మరో నెల ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి అవేంటో చూసేయండి.
- 94 ఏళ్ల వయసులో సింగీతం కొత్త మూవీ.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్ అడ్రస్.. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ రుషి.
- ‘వారణాసి’ విడుదల అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి ‘వారణాసి’ (Varanasi) విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
- టాలీవుడ్‌కు కొత్తందం.. రషా థడానీ ఫస్ట్‌లుక్ చూశారా! ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి రషా థడానీ లుక్‌ను రిలీజ్ చేశారు.
- ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టికెట్స్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. వారికి మాత్రమే! ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం టికెట్లపై ఆఫర్ ప్రకటించింది.