Jana nayagan: ‘జన నాయకుడు’లో ‘భగవంత్‌ కేసరి’ కథ ఎంత?ట్రైలర్‌లో ఇవి గమనించారా?

Eenadu icon
By Entertainment Team Published : 04 Jan 2026 00:11 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇప్పటివరకూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. కానీ, శనివారం ‘జన నాయకుడు’ (Jana Nayakudu) ట్రైలర్‌ వచ్చేసింది. చాలా విషయాల్లో స్పష్టత తెచ్చింది. ఇంకా చాలా విషయాలను దాచి పెట్టింది. మొత్తంగా చూస్తే, ఇది బాలకృష్ణ- అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) మూవీకి రీమేకే. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే, విజయ్‌ చివరి సినిమా కావడంతో, అభిమానులు మెచ్చేలా దర్శకుడు హెచ్‌.వినోద్‌ చాలా మార్పులు చేసినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.

ఇక్కడ బాలకృష్ణ, శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ ఉన్నట్లే.. అక్కడ విజయ్‌, మమతి బైజు, బాబీ దేఓల్‌ ఉన్నారు. విజ్జి (శ్రీలీల) తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో చేర్చడమే భగవంత్‌ కేసరి (బాలకృష్ణ) ప్రథమ కర్తవ్యం. ఆమెని ఓ సింహంలా త‌యారు చేయాల‌ని చూస్తాడు. ఈ క్రమంలో రాహుల్‌ సాంగ్వీ (అర్జున్‌ రాంపాల్‌)తో యుద్ధం. ‘జన నాయకుడు’ లోనూ అంతే విజ్జి (మమితబైజు)ను ఆర్మీలో చేర్చడమే లక్ష్యంగా దళపతి (విజయ్‌) శిక్షణ ఇస్తాడు. రెండింటిలోనూ హీరో జైలుకు వెళ్తాడు. ఆ సీన్స్‌ కామన్‌గా ఉన్నాయి. ‘భగవంత్‌ కేసరి’లో ఓ హైఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ పడుతుంది. ఇందులో అలాంటి సన్నివేశమే ఉంది. ఆ ఫ్యాక్టరీ చూడవచ్చు. ఇక్కడి వరకూ రెండు సినిమాలకు సంబంధించిన కథ, థీమ్‌ ఒకేలా ఉన్నాయి. కానీ, బాబీ దేఓల్‌ పాత్ర రంగ ప్రవేశంతో సినిమా టోన్‌ మారిపోయింది.

  • ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

బాబీ ప్లాన్‌ ఓ-ఎం ఏంటి?

‘ఇప్పటి నుంచి 30వ రోజున ఇండియా నా కాళ్ల ముందు ఉంటుంది. ప్లాన్‌ ఓ.ఎం. అమలు చేస్తా’ అంటాడు బాబీ దేఓల్. భగవంత్‌ కేసరి నుంచి ‘జన నాయకుడు’ని వేరు చేసేది బహుశా ఇదే కావచ్చు. ఇక్కడి నుంచి ప్రకాశ్‌రాజ్‌, సునీల్‌, ప్రియమణి ఇలా కొత్త పాత్రలు తెరపై కనిపించాయి. రాకెట్‌ లాంచర్లు, డ్రోన్స్‌తో ఫైట్స్‌ ఇలా సినిమాలో ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో పాటు, సైన్స్‌ ఫిక్షన్‌ ఎలిమెంట్‌ను కూడా జోడించినట్లు తెలుస్తోంది.  అప్పటివరకూ తన కూతురు విజ్జి సమస్య.. కాస్త దేశ సమస్యగా మారుతుంది. ఇక్కడి నుంచే రాజకీయ కోణాన్ని స్పృశిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దాడు హెచ్‌.వినోద్‌. ఇది పూర్తిగా విజయ్‌ రాజకీయ జీవితానికి మరింత ఉపయోగపడేలా మెరుగులు పెట్టినట్లు అర్థమవుతోంది.

మారిన విజయ్‌ క్రేజీ డైలాగ్‌..

‘ప్రజలకు మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు. నిన్ను నువ్వు కాపాడుకుని పారిపో’ అంటూ బాబీ వార్నింగ్‌ ఇచ్చే సీన్‌ ఉంది. ఈ సన్నివేశం నుంచి సినిమా పూర్తిగా విజయ్‌ను ఎలివేట్ చేస్తూ సాగేలా హెచ్‌.వినోద్‌ తీర్చిదిద్ది ఉంటారు. ‘అర్హతలేని వాళ్లంతా కలిసి నిలబడ్డారు. వాళ్లు గెలవకూడదు’ అంటూ సంభాషణలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా విజయ్‌ సినిమాల్లో ఒక క్రేజీ డైలాగ్‌ ఉంటుంది. అదే ‘ఐయామ్‌ వెయిటింగ్‌’. కానీ, ఈ సారి ఆ డైలాగ్‌ను పూర్తి రాజకీయ కోణంలో మార్చి చెప్పారు. ‘నిన్ను నాశనం చేస్తాను. అవమానం చేస్తాను. ఎవడు చెప్పినా సరే.. తిరిగి వెళ్లే ఐడియానే లేదు.. ఐయామ్‌ కమింగ్‌’ అంటూ విజయ్‌ చెప్పే పంచ్‌ డైలాగ్‌ చూస్తే, ‘భగవంత్‌ కేసరి’ని ఎలా మార్చారో అర్థం చేసుకోవచ్చు. సినిమా కథ విషయంలో ఒక స్పష్టత వచ్చినా, విజయ్‌ అభిమానుల ఆకలి తీర్చడానికి ఇంకా చాలా స్టఫ్‌ అట్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫుల్‌ క్లారిటీ రావాలంటే జనవరి 9వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.. అప్పటి వరకూ సినీ అభిమానులు ‘వెయిటింగ్‌..’

-ఇంటర్నెట్‌డెస్క్‌



► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మరో చారిత్రకగాథతో సంజయ్‌ లీలా భన్సాలీ.. ‘జై సోమనాథ్‌’ భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో చారిత్రక కథ సిద్ధమవుతోంది. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ కథలను అందించడంలో బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ సిద్ధహస్తులు.
  • చిన్న ఛేంజ్‌.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్‌ ఆ రోజే.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్‌ఎస్‌ఎస్‌) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది.
  • ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్‌’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదల వాయిదా పడింది.
  • దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. అలరిస్తున్న ప్రమోషనల్‌ వీడియో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు.
  • అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ : ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ నిర్మాత ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్‌ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్‌ మొగిలినేని తెలిపారు.
  • వాలెంటైన్స్‌ డే స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే! వాలెంటైన్స్‌ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి.
  • 2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ ఆసక్తికర పోస్టు తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ ప్రకటించింది. 
  • ఈ కథ చిరంజీవికి బాగా తెలుసు.. విజయ్‌ సేతుపతిని అనుకున్నా కానీ: అర్జున్‌ తాను డైరెక్ట్‌ చేసిన ‘సీతాపయనం’ గురించి అర్జున్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
  • పవర్‌ఫుల్‌ టైటిల్‌తో తరుణ్‌ భాస్కర్‌ మూవీ.. ‘జీపీఎస్‌’ అంటే ఇదే తరుణ్‌ భాస్కర్‌ కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.
  • రామ్‌చరణ్‌ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే రామ్‌చరణ్‌ సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది. 
  • పవన్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ విడుదల తేదీ ఖరారైంది.
  • ‘డెకాయిట్‌’ మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే అడివి శేష్‌ ప్రధాన పాత్రలో రానున్న ‘డెకాయిట్‌’ మరోసారి వాయిదా పడింది
  • ‘వారణాసి’కి ‘అవతార్‌’తో పోలిక.. రాజమౌళి ఏమన్నారంటే! ‘వారణాసి’ కోసం రాజమౌళికి ప్రియాంక చోప్రా ఒక విజ్ఞప్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె దాని గురించి వివరించారు.
  • వేసవిలో ‘బైకర్‌’.. శర్వా మూవీ కొత్త విడుదల తేదీ ఇదే శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘బైకర్‌’ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
  • ధనుష్‌- సాయి పల్లవి జోడీ.. మరోసారి.. ఆ హిట్‌ డైరెక్టర్‌తో ధనుష్‌, సాయి పల్లవి మరో సినిమాలో సందడి చేయనున్నారు.
  • ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో వినోదం వాటిదే! 2026లో మరో నెల ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి అవేంటో చూసేయండి.
  • 94 ఏళ్ల వయసులో సింగీతం కొత్త మూవీ.. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య..  ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్‌ అడ్రస్‌.. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ రుషి.
  • ‘వారణాసి’ విడుదల అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి ‘వారణాసి’ (Varanasi) విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
  • టాలీవుడ్‌కు కొత్తందం.. రషా థడానీ ఫస్ట్‌లుక్‌ చూశారా! ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి రషా థడానీ లుక్‌ను రిలీజ్‌ చేశారు.
  • ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టికెట్స్‌.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. వారికి మాత్రమే! ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం టికెట్లపై ఆఫర్‌ ప్రకటించింది.

English Translation

Jana nayagan: How much is the story of 'Bhagwant Kesari' in 'Jana Nayakaya'? Did you notice these in the trailer?

Eenadu icon
By Entertainment Team Published : 04 Jan 2026 00:11 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

So far this question It is a bit difficult to answer. But, on Saturday, the trailer of 'Jana Nayakudu' came out. Clarified many things. It also hides many things. Overall, it is a remake of Balakrishna-Anil Ravipudi's movie 'Bhagavanth Kesari'. There is no doubt about it. If not, since it is Vijay's last film, director H. Vinod has made a lot of changes to make the fans happy.

There are Balakrishna, Srileela, Arjun Rampal here, there are Vijay, Mamathi Baiju, Bobby Deol. Bhagwant Kesari's (Balakrishna) first duty is to induct Vijji (Srileela) into the army as per her father's wish. He wants to make her like a lion. A battle with Rahul Sanghvi (Arjun Rampal) in this order. Similarly in 'Jana Nayak', Dalapati (Vijay) trains Vijay (Mamitbaiju) with the aim of getting him into the army. In both the hero goes to jail. Those scenes are common. In 'Bhagwant Kesari', the interval goes bang with a high voltage action sequence. It has such a scene. The factory can be seen. So far the story and theme of both the movies are same. But, the tone of the movie changed with the entry of Bobby Deol's character.

  • This week's OTT crowd-pleasing films/webseries Live!

What's Bobby's plan?

'On the 30th day from now, India will be at my feet. Plan O.M. It will be implemented' says Bobby Deol. Perhaps this is what separates a 'people's leader' from Bhagwant Kesari. From here, new characters like Prakashraj, Sunil and Priyamani appeared on the screen. Along with full action episodes like rocket launchers and fights with drones, the movie also seems to have added a science fiction element.  Until then, the problem of his daughter Viji will become a bit of a national problem. From here, H. Vinod created the scenes touching on the political aspect. It is completely understood that this has been improved to make Vijay's political career more useful.

Vijay's crazy dialogue. There is a scene where Bobby gives a warning saying 'save yourself and run away'. From this scene, H. Vinod would have shaped the film so that the film will completely elevate Vijay. All the unqualified people stood together. Conversations are also heard that they should not win. Usually Vijay movies have a crazy dialogue. That's 'I'm Waiting'. But, this time the dialogue has been changed in a completely political sense. I will destroy you. Shame on you. No matter who says it.. there is no idea of ​​going back.. I am coming', if you see the punch dialogue of Vijay, you can understand how 'Bhagwant Kesari' was changed. Although there is a clarity about the story of the film, it seems that Vijay has added a lot of stuff to satisfy the appetite of the fans. To get full clarity, we have to wait till January 9. Until then movie fans are 'waiting..'

-Internetdesk



► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Sanjay Leela Bhansali with another historical story.. 'Jai Somnath' Another historical story is getting ready to entertain the Indian cinema audience. Bollywood director Sanjay Leela Bhansali is a master at delivering larger than life stories.
  • Small change.. 'Sampradaini Suppini..'Releasing on the same day.. Sampradaini Suppini Suddapusani' (SSS) in theatres. A small change has taken place in the release of 'The Paradise'.. New release date. came The release of the movie 'The Paradise' starring Nani has been postponed.
  • Varalakshmi Sarathkumar as the director. Actress Varalakshmi Sarathkumar has started a new journey. A movie has been announced as a director.
  • That's why our movie has an 'A' certificate : Producer of 'Couple Friendly' Dheeraj Mogileni said that the Censor Board has objected to 'Couple Friendly'.
  • Valentine's Day Special.. This week's theatre/OTT films! Many interesting films are preparing to greet the audience on the occasion of Valentine's Day. Apart from the theater, watch the entertaining movies here on OTT.
  • 2027 Sankranti Akkineni Hero Movie.. 'Annapurna Studios' Interesting Post 'Annapurna Studios' has announced that their production company will release a film for Sankranti next year. 
  • Chiranjeevi knows this story well.. Vijay thought of Sethupathi but: Arjun Arjun shared interesting facts about 'Sitapayanam' directed by him.
  • Tarun Bhaskar's movie with powerful title.. This is what 'GPS' means. Tarun Bhaskar has announced a new title. This is his second film as a hero.
  • Ram Charan's 'Peddi' postponement.. New release date is this. The release of Ram Charan's film 'Peddi' has been postponed. 
  • Pawan's 'Ustad Bhagat Singh'.. release date fixed The release date of 'Ustad Bhagat Singh' has been finalized.
  • 'Decoit' has been postponed once again. Adivi Sesh's upcoming 'Decoit' has been postponed once again
  • 'Varanasi' is compared to 'Avatar' What is Rajamouli! Priyanka Chopra made a plea to Rajamouli for 'Varanasi'. She explained about it in the latest interview.
  • In the summer 'Biker'.. This is the new release date of Sharva movie. The release date of the movie 'Biker' starring Sharwanand has been finalized.
  • Dhanush-Sai Pallavi pair.. once again.. with the hit director. Dhanush and Sai Pallavi are going to make noise in another movie.
  • This week's theaters are full of small films.. They are the entertainment in OTT! Another month has ended in 2026. Many interesting films are coming to entertain the audience in the first week of February. Interesting films are coming in OTT. And watch that.
  • Singeetham new movie at the age of 94.. Devishree Prasad music Making diverse films is the education that gave him butter.. Caraf address for experimental films.. Cine Rushi who made movies without words.
  • Rajamouli announced the release of 'Varanasi'. There is clarity on the release date of 'Varanasi'.
  • New to Tollywood.. Have you seen the first look of Rasha Thadani! Rasha Thadani's look from 'Srinivasa Mangapuram' has been released.
  • 'Om Shanti Shanti Shantih' tickets.. Buy one get one free.. Only for them! The film team of 'Om Shanti Shanti Shantih' has announced an offer on tickets.