Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. భారత్‌లో T20 WC ఆడమంటున్న బంగ్లాదేశ్!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ ఆదేశాలతో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమన్(Mustafizur Rahman)ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి రిలీజ్ చేయడంతో బంగ్లా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆడే 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఐసీసీని సంప్రదించాలని భావిస్తోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వేదికలు మార్చాలని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని బంగ్లా క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ‘ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయడంపై నేను ఎటువంటి వ్యాఖ్య చేయలేను. ఎందుకంటే ఇది వారి అంతర్గత విషయం. కానీ, ప్రపంచ కప్‌లో పాల్గొనడం విషయానికొస్తే ఇది ఐసీసీ ఈవెంట్. టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించిన విషయాన్ని ఐసీసీతో వీలైనంత త్వరగా బీసీబీ చర్చిస్తుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లి ఆడటానికి టీమ్ఇండియా నిరాకరించిన విషయం అందరికీ తెలిసిందే. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని సదరు అధికారి పేర్కొన్నారు.
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌నకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్, 17న వాంఖడేలో నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ ( IPL) 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders) కొనుగోలు చేసింది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించనుండటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయాలని కేకేఆర్ ఫ్రాంఛైజీని ఆదేశించింది. దీంతో అతడిని కోల్‌కతా జట్టు నుంచి రిలీజ్ చేసింది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.