FTA: కొత్త ఒప్పందాలు సరికొత్త అవకాశాలు

Eenadu icon
By Editorial Team Published : 30 Dec 2025 03:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ట్రంప్‌ సుంకాల బాదుడుకు అంతర్జాతీయ వాణిజ్యం కుదేలైంది. దీంతో ఆయా దేశాలతో విడివిడిగా ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) జోరందుకున్నాయి. ఈ విషయంలో ఇండియా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే బ్రిటన్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకుంది. అమెరికా, ఐరోపా సమాఖ్యలతో చర్చలు సాగిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌తోనూ ఒప్పందంపై సంతకం చేసింది. 

ఫ్‌టీఏ చలవతో భారతీయ ఐటీ, బీపీవో, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్‌ సేవల సంస్థలకు న్యూజిలాండ్‌లో మార్కెట్‌ విస్తరిస్తుంది. టూరిజం వృద్ధి అవుతుంది. భారతీయ ఇంజినీర్లు, కన్సల్టెంట్లు, అధ్యాపకులు, విద్యార్థులు, శిక్షకులకు ఆ దేశంలో సులువుగా ప్రవేశం లభిస్తుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపై 500 కోట్ల డాలర్లకు చేరుతుంది. భారతీయ వస్తువులు సుంకాలు లేకుండా ఆ దేశంలోకి ప్రవేశించగలుగుతాయి. భారత్‌ నుంచి 1,379 రకాల వ్యవసాయ సరకులు, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు, 363 సముద్ర ఉత్పత్తులు, వెయ్యి వస్త్రాలు, దుస్తుల రకాలు సున్నా సుంకంతో న్యూజిలాండ్‌ మార్కెట్‌కు ఎగుమతి అవుతాయి. మరోవైపు, భారత్‌లోకి న్యూజిలాండ్‌ వస్తువుల ఎగుమతులపై భారీగా సుంకాలు సడలిస్తారు. వచ్చే 15 ఏళ్లలో ఇండియాలోకి 2వేల కోట్ల డాలర్ల న్యూజిలాండ్‌ పెట్టుబడులు వస్తాయి. దీనివల్ల భారతీయ వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీసుల రంగాలు లబ్ధి పొందుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎగుమతి కేంద్రిత సంస్థలూ లాభపడతాయి. 

ఎగుమతులకు గిరాకీ 

ఎఫ్‌టీఏ కారణంగా న్యూజిలాండ్‌కు వస్తువులను ఎగుమతి చేస్తున్న ఇతర దేశాలు 10 శాతం సుంకం చెల్లిస్తే, ఇండియా ఎగుమతి చేసే వివిధ తరగతుల వస్తువులపై సుంకమే ఉండదు. దీనివల్ల మన ఎగుమతులకు మార్కెట్‌లో ఆధిక్యం లభిస్తుంది. భారత్‌ ఎగుమతి చేసే తోలు వస్తువులు, పాదరక్షలు, సంబంధిత ఉపకరణాలపైనా సుంకాలు తొలగిపోవడంతో న్యూజిలాండ్‌ మార్కెట్‌లో ఇతర దేశాల వస్తువులకన్నా చవక అవుతాయి. తద్వారా మార్కెట్‌ పెరుగుతుంది. ఆటో విడిభాగాలు, యంత్రభాగాలు, మెషీన్‌ టూల్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర ఇంజినీరింగ్‌ ఎగుమతులపైనా సుంకాలు తొలగడం వల్ల భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఎగుమతులు పెంచుకుని లబ్ధి పొందవచ్చు. సాధారణంగా ఆభరణాలు, గిల్టు నగలు, ఫ్యాషన్‌ ఉపకరణాల ధర బాగా ఎక్కువగా ఉంటుంది. వీటిపై సుంకాలు తగ్గించడం వల్ల భారతీయ ఎగుమతులకు న్యూజిలాండ్‌ మార్కెట్‌లో గిరాకీ పెరుగుతుంది. సున్నా సుంకాలతో బియ్యం, మసాలా ద్రవ్యాలు, టీ, కాఫీ, నూనె గింజలు, ప్రాసెస్‌ చేసిన పండ్లు, కూరగాయలు, సిద్ధాహారాలు, మిఠాయిల ఎగుమతులు పెరుగుతాయి. శీతలీకరించిన రొయ్యలు, చేపల ఎగుమతులకు న్యూజిలాండ్‌ ఆకర్షణీయ గమ్యమవుతుంది. 

మరోవైపు, సువిశాల భారతీయ మార్కెట్‌లోకి న్యూజిలాండ్‌ నుంచి వచ్చే ఉన్ని, బొగ్గు, కలప, అవకాడో, బ్లూబెర్రీస్, పెర్సిమోన్‌ పండ్లపై సుంకాలను భారీగా తగ్గిస్తారు. కివి, ఆపిల్‌ పండ్లపై కోటాలవారీగా సుంకాల తగ్గింపు ఉంటుంది. ఆపిల్‌ పండ్ల విషయంలో భారత్‌ నుంచి రాయితీ పొందుతున్న ఏకైక దేశం న్యూజిలాండే. ఫైనాన్స్, విద్య, పర్యాటకం, భవన, మౌలిక వసతుల నిర్మాణం, వృత్తి సేవలతో పాటు 100 సర్వీసు రంగాల్లో న్యూజిలాండ్‌ కంపెనీలకు ప్రవేశ సౌలభ్యం లభిస్తుంది. న్యూజిలాండ్‌కు జమ్మూకశ్మీర్‌ నుంచి పష్మినా ఉన్ని, హస్తకళా వస్తువులు, కుంకుమ పువ్వు ఎగుమతులు పెరుగుతాయి. పంజాబ్‌ నుంచి క్రీడావస్తువులు, వస్త్రాలు, బాస్మతి బియ్యం, గుజరాత్‌ నుంచి వజ్రాలు, పింగాణి, ప్రాసెస్‌ చేసిన ఆహారానికి అవకాశాలు అధికమవుతాయి. పశ్చిమ బెంగాల్‌ నుంచి దార్జిలింగ్‌ టీ, వస్త్రాలు, జనపనార వస్తువులు, కేరళ నుంచి మసాలా ద్రవ్యాలు, ఎలక్ట్రానిక్స్, కొబ్బరి పీచు ఉత్పత్తులు, ఒడిశా నుంచి వస్త్రాలు, హస్తకళా వస్తువులు, తమిళనాడు నుంచి వస్త్రాలూ ఆటో విడిభాగాల ఎగుమతులు ఊపందుకుంటాయి. 

గరిష్ఠ ప్రయోజనాలు...

మోదీ సర్కారు హయాములో భారత్‌ 2021 నుంచి మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా, ఎఫ్టా దేశాలైన స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, లీచ్టెన్‌స్టీన్, బ్రిటన్, ఒమన్‌లతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకుంది. తాజాగా న్యూజిలాండ్‌తో ఏడో ఎఫ్‌టీఏ కుదిరింది. ఆయా దేశాల నుంచి పాలు, పాల ఉత్పత్తులు, కొన్నిరకాల వ్యవసాయ సరకులను దిగుమతి చేసుకుంటే భారతీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందుకని, ఎఫ్‌టీఏల నుంచి వాటిని మినహాయించింది. పశ్చిమాసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మార్కెట్లలో భారతీయ ఎగుమతులకు ప్రాధాన్య ప్రాతిపదికన ప్రవేశ సౌలభ్యం పొందింది. అమెరికా, కెనడా, ఐరోపా సమాఖ్యలతో వాణిజ్య చర్చలు కొనసాగిస్తోంది. అయితే, ఎఫ్‌టీఏ భాగస్వాముల నుంచి కొన్ని రకాల ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు, ఎఫ్‌టీఏల ద్వారా లభించే ప్రయోజనాలను భారతీయ ఎంఎస్‌ఎంఈలు మెరుగ్గా వాడుకోవాల్సి ఉంది. ఎఫ్‌టీఏల ప్రయోజనాలను సమర్థంగా వాడుకోవాలని రాష్ట్రాలకు, కంపెనీలకు కేంద్ర వాణిజ్య శాఖ సూచించాలి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కంపెనీల కోసం ఎఫ్‌టీఏ హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేసి ఎగుమతిదారులను ప్రోత్సహించాలి. ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలకు వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులను, ఫార్మా, ఐటీ ఉత్పత్తులను విరివిగా ఎగుమతి చేయడానికి సన్నద్ధం కావాలి. పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లను మమేకం చేయాలి. రేవులు, రోడ్డు రవాణా సంస్థలు, నౌకా రవాణా సంస్థలు, శీతల గిడ్డంగులను ఎగుమతి గొలుసు వ్యవస్థల్లో భాగస్వాములుగా మార్చాలి. ఇలాంటి చర్యలద్వారా ఎఫ్‌టీఏలతో గరిష్ఠ ప్రయోజనాలు పొందాలి.

తెలుగు రాష్ట్రాలకు మేలు 

తెలంగాణ నుంచి, ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసరాల నుంచి ఔషధాలు, వైద్యసాధనాలు, ఇంజినీరింగ్‌ వస్తువులు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, బియ్యం, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు చాలా తక్కువ సుంకాలతో న్యూజిలాండ్‌లో ప్రవేశించగలుగుతాయి. ఐటీ, డిజిటల్‌ సేవలు, సైబర్‌ భద్రత, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్‌ సేవలకూ గిరాకీ పెరుగుతుంది. ఏపీ నుంచి చేపలు, రొయ్యలు, బియ్యం, మసాలా దినుసులు, ప్రాసెస్‌ చేసిన ఆహారం, దుస్తులు, జౌళి ఎగుమతులకు సానుకూలత ఏర్పడుతుంది. విశాఖపట్నం, కృష్ణపట్నం రేవుల నుంచి భారీగా ఎగుమతులు చేపట్టవచ్చు.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation
FTA: New Agreements New Opportunities MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
  • 4 min read

    International trade has been hit by Trump's tariffs. As a result, bilateral free trade agreements (FTAs) with the respective countries have gained momentum. India is taking aggressive steps in this regard. FTA has already been signed with Britain. Negotiations are underway with the United States and the European Union. Recently signed an agreement with New Zealand. 

    AFTA will expand the market in New Zealand for Indian IT, BPO, FinTech and HealthTech services companies. Tourism will grow. Indian engineers, consultants, teachers, students and trainers can easily enter the country. Trade between the two countries will double to 500 million dollars. Indian goods can enter the country duty-free. 1,379 types of agricultural commodities, processed food items, 363 types of marine products, 1,000 types of textiles and clothing are exported to the New Zealand market at zero duty from India. On the other hand, the tariffs on New Zealand goods exports to India will be greatly relaxed. In the next 15 years, New Zealand investments of 2 billion dollars will come into India. This will benefit the Indian agricultural, industrial and services sectors. Export oriented companies in Andhra Pradesh and Telangana will also benefit. 

    Demand for Exports

    If other countries exporting goods to New Zealand pay 10 percent duty due to FTA, India exports various classes of goods. There is no duty on goods. This will give our exports an edge in the market. India's exports of leather goods, footwear and related accessories will become cheaper in the New Zealand market than those of other countries due to the removal of tariffs. This will increase the market. Indian Micro, Small and Medium Enterprises (MSMEs) can benefit from increased exports of auto parts, machinery, machine tools, electronics and other engineering exports. In general, jewelry, gilt jewelry, and fashion accessories are priced very high. The reduction in tariffs on these will increase the demand for Indian exports in the New Zealand market. Exports of rice, spices, tea, coffee, oilseeds, processed fruits, vegetables, siddhaharas and confectionery will increase with zero duties. New Zealand is an attractive destination for chilled shrimp and fish exports. 

    On the other hand, tariffs on wool, coal, timber, avocados, blueberries and persimmons from New Zealand entering the vast Indian market will be drastically reduced. Quota-wise duty reduction on kiwi and apple fruits. New Zealand is the only country that gets subsidy from India in respect of apples. New Zealand companies will have access to over 100 service sectors including finance, education, tourism, construction, infrastructure construction and professional services. Exports of pashmina wool, handicrafts and saffron from Jammu and Kashmir to New Zealand will increase. Opportunities for sports goods, textiles, basmati rice from Punjab, diamonds, porcelain and processed food from Gujarat will increase. Exports of Darjeeling tea, textiles, jute goods from West Bengal, spices, electronics, coconut fiber products from Kerala, textiles and handicrafts from Odisha, textiles and auto parts from Tamil Nadu will gain momentum. 

    Maximum benefits...

    During the Modi government, India has signed FTAs ​​with Mauritius, UAE, Australia, FTA countries Switzerland, Iceland, Norway, Liechtenstein, Britain and Oman from 2021. Recently the seventh FTA was concluded with New Zealand. If milk, milk products and certain types of agricultural commodities are imported from those countries, the interests of Indian farmers will be harmed. Hence, they are excluded from FTAs. Indian exports have been given preferential access to markets in West Asia, Europe, Africa, Australia and New Zealand. Trade negotiations with the US, Canada and the European Union are ongoing. However, there is a risk that certain types of products from FTA partners could flood the Indian market. On the other hand, Indian MSMEs need to make better use of the benefits of FTAs. The Union Commerce Department should advise the states and companies to effectively use the benefits of FTAs. AP and Telangana governments should set up FTA helpdesks for companies and encourage exporters. FTA partner countries should be equipped to export agricultural, marine products, pharma and IT products extensively. Industrial and export promotion councils should be formed. Ports, road transport companies, shipping companies and cold warehouses should be made partners in export chain systems. Maximum benefits should be obtained with FTAs ​​through such measures.

    Good for Telugu States

    Drugs, medical equipment, engineering goods, plastic, rubber products, rice, processed food items from Telangana, especially from Hyderabad area can enter New Zealand with very low tariffs. Demand for IT, digital services, cyber security, fintech and healthtech services will also increase. Exports of fish, shrimp, rice, spices, processed food, apparel and textiles from AP will be positive. Massive exports can be taken up from Visakhapatnam and Krishnapatnam docks.

    ► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :