Parenting: తల్లిదండ్రులూ.. మీ పిల్లల్ని ఈ ప్రశ్నలు తప్పక అడగండి!

Eenadu icon
By Features Team Updated : 30 Dec 2025 11:52 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత. అలా అని మంచి స్కూల్‌లో చేర్పించామా? రూ.లక్షల ఫీజు చెల్లించి చదువు చెప్పించామా అన్నట్లు ఉండకూడదు. పిల్లల్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. వారి భావాలను, ఆలోచనలను అర్థం చేసుకొని అండగా నిలవాలి. తరచూ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే తల్లిదండ్రులతో పిల్లలకు సాన్నిహిత్యం పెరగడంతోపాటు ఏవైనా భయాందోళనలు ఉంటే తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. మరి వారిని ఏం అడగాలంటే..

మీ రోజు ఎలా గడిచింది?

ఉదయం హడావుడిగా పెద్దలు ఉద్యోగాలకు, పిల్లలు పాఠశాలకు వెళ్తారు. సాయంత్రం ఇంటికొచ్చాక కాస్త తీరిక చేసుకొని ‘మీ రోజు ఎలా గడిచింది?’అని పిల్లలను ప్రశ్నించండి. దీంతో ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ చెప్పేస్తారు. ఈ క్రమంలో వారి ఆలోచనా విధానం, పరిసరాలను, పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటారనే విషయాలు తెలుస్తాయి. పిల్లలతో సమయం గడిపేందుకు ఇదొక మంచి మార్గంగానూ ఉంటుంది. 

మీకు ఏవైనా సమస్యలున్నాయా?

ఏ వయసుకు ఆ సమస్యలు ఉంటూనే ఉంటాయి. చిన్నతనంలో స్కూల్‌లో టీచర్‌ కొట్టడం, స్నేహితులతో గొడవలు, లైంగిక వేధింపులు వంటివి జరుగుతుంటాయి. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారేమో తెలుసుకోవాలి. స్కూల్‌లో సమస్యలైతే వెళ్లి స్కూల్‌ యాజమాన్యంతో మాట్లాడొచ్చు. ఇంట్లో సమస్యలైతే పెద్దలే చొరవ తీసుకొని పరిష్కరించాలి. ఏ సమస్యనైనా తీవ్రం కాకముందే గుర్తిస్తే మేలు. 

మీ ఇష్టాయిష్టాలు ఎవరితో చెప్పుకొంటారు? 

పిల్లలకు స్కూల్‌లో చాలామంది స్నేహితులు ఉండొచ్చు. కానీ, ఒకరితో మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు. తమ ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, కష్టసుఖాలు వారితో పంచుకుంటారు. అలాంటి మిత్రులు ఎవరున్నారో అడిగి తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏవైనా సమస్యలున్నా తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. అలాంటప్పుడు ఆ మిత్రుడిని అడిగి విషయం తెలుసుకునే అవకాశముంటుంది. 

మీకు ఎప్పుడు భయంగా ఉంటుంది?

చిన్నారులకున్న భయాందోళన గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. టీచర్లు కొట్టారనో, దారిలో పోకిరీలు వేధించడం వల్లో భయపడుతుంటారు. చదువు, పరీక్షలన్నా ఆందోళన చెందుతుంటారు. అలా వారికి ఏ విషయాల్లో భయపడుతున్నారో అడగాలి. చదువుకుంటే ఎంత ఉన్నతస్థాయికి ఎదగగలరో తెలియజేసి చదువుపై మక్కువ ఏర్పడేలా చూడాలి. పోకిరీలు వేధిస్తే పోలీసులను ఆశ్రయించొచ్చు. సౌమ్యంగా మాట్లాడమని టీచర్లకు చెప్పొచ్చు. 

మీ ఆరోగ్యం ఎలా ఉంది?

చిన్నారులకు ఆరోగ్యంపై అంతగా అవగాహన ఉండదు. ఈ కాలం పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రాణాపాయస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ, వారు శరీరంలో ఇబ్బందులు వచ్చినా సమస్య ఇదని చెప్పలేరు. అందుకే, మీ ఒంట్లో ఎలా ఉంది? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని అడగాలి. ఏ చిన్న సమస్య ఉందని చెప్పినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించాలి. 

మా(తల్లిదండ్రులు) గురించి ఏమనుకుంటున్నారు?

పిల్లలకు వయసు పెరుగుతున్నకొద్దీ తల్లిదండ్రులపై అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఆ అభిప్రాయమేంటో తెలుసుకోవాలి. పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు కటువుగా ప్రవర్తించి ఉండొచ్చు. సమయం కేటాయించకపోవచ్చు. వారి కోర్కెలు నెరవేర్చకపోవచ్చు. అలా తల్లిదండ్రులపై పిల్లలకు వ్యతిరేక భావన కలిగే అవకాశముంది. అలాంటివేమైనా వారికి అనిపిస్తే ఆ పద్దతిని మార్చుకోవాలి. మా తల్లిదండ్రులు బెస్ట్‌ అనేలా ఉండాలి.

భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు?

పిల్లలు తాము పెద్దయ్యాక అలా అవ్వాలి.. ఇలా అవ్వాలని కలలు కంటున్నారు. అది మంచి విషయమే. కానీ, నిజంగా వారికి ఉన్న ఆసక్తి ఏంటో అడిగి తెలుసుకోవాలి. భవిష్యత్తు లక్ష్యాలు, అభిరుచుల గురించి ఆరా తీయాలి. పిల్లలు ఆసక్తి కనబర్చిన విషయాల్లో తల్లిదండ్రులు చేయూత అందించాలి. చదువుతోపాటు కెరీర్‌కు ఉపయోగపడే వివిధ మార్గాలను వారికి చూపించాలి. క్రీడల్లోనూ వారు రాణించేలా ప్రోత్సహించాలి.

► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 11:37 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పేరుకే పెద్దమనిషి.. భారత్ అంటే నిలువెల్లా విద్వేషమే! ఆయన చేసింది బ్యాంకు వ్యాపారం.. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీలు ఇచ్చి అయినకాడికి వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.
  • ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్‌ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
  • టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
  • విహారయాత్ర సరే.. బడ్జెట్‌ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించడం కష్టమే. అయితే, చేసే ఖర్చుల్లోనే కొంత మొత్తం పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్‌ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..
  • వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్‌ ఓవర్‌క్రౌడింగ్‌! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. 
  • ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
  • పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
  • మాటలెందుకు? మీమ్స్‌ ఉండగా.. జెన్‌ జీ లైఫ్‌స్టైల్‌ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్‌’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అయినా మీమ్స్‌ అవి.
  • టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్‌ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
  • జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్‌ డిస్టెన్స్‌ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
  • గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్‌.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
  • నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్‌ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
  • ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
  • పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్‌ నాయిస్‌ ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్‌ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
  • ఇజ్రాయెల్‌ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్‌ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (IDF) సొంతం.
  • ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
  • ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
  • ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే! కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
  • అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.