
West Bengal: నక్సల్‌బరీలో కమల వికాసం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మావోయిస్టు ఉద్యమం రోజురోజుకూ బలహీనమవుతోంది. కీలక నాయకులను కోల్పోతుండటం, కొత్త చేరికలు లేకపోవడంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో దేశంలో సాయుధ విప్లవ పోరాటాలకు దారిచూపిన నక్సల్‌బరీలో పరిస్థితి ఎలా ఉందన్నది పరిశీలనార్హం!
బెంగాల్ ఉత్తర భాగంలో ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమానికి పురిటిగడ్డగా ఉన్న నక్సల్‌బరీ గ్రామం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా మారింది. భాజపా అగ్రనేత అమిత్ షా 2017లో ఈ గ్రామంలోని ఒక దళిత కుటుంబంతో కలసి భోజనం చేయడం ఆపరేషన్ లోటస్‌కు నాంది పలికింది. అది క్రమక్రమంగా పశ్చిమ బెంగాల్, త్రిపురలలో భాజపా బలం పెరగడానికి కారణమైంది. గతంలో పశ్చిమ బెంగాల్ శాసనసభలో భాజపాకు ఒకటీ అరా సభ్యులు మాత్రమే ఉండగా, 2021 ఎన్నికల్లో వారి సంఖ్య రెండంకెలకు చేరింది. బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లోని దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలలో బలం పెంచుకోవడానికి భాజపా పట్టుదలగా చేసిన కృషి ఫలిస్తోంది.
కనుమరుగైన వామపక్ష ప్రాబల్యం
రాష్ట్ర శాసనసభలో ఉత్తర బెంగాల్‌కు 54 సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతం గూర్ఖాల్యాండ్ కోసం గళమెత్తుతున్న దార్జిలింగ్ గూర్ఖాలకూ, కూచ్ బిహార్‌లోని రాజ్ బన్షీలకూ గట్టి నెలవు. ఈ రెండు గ్రూపులూ పశ్చిమ బెంగాల్ నుంచి వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగానో, కేంద్ర పాలిత ప్రాంతంగానో ఆవిర్భవించాలని కోరుకుంటున్నాయి. తమ కోరిక భాజపా వల్ల తీరుతుందని వారు ఆశిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పాలక పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పట్ల ఇక్కడ చాలామంది విముఖంగా ఉన్నారు. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల నిర్విరామ కృషి వల్ల ఉత్తర బెంగాల్‌లో భాజపా పాగా వేయగలిగింది. నేడు అక్కడ కాషాయ పతాకాలు దండిగా రెపరెపలాడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కడికెళ్లినా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు తమ సంఘ సేవా కార్యక్రమాలతో, పౌర సమస్యలపై ఉద్యమాలతో చురుగ్గా కనిపిస్తారని తృణమూల్ నాయకుడు, సిలిగురి మేయర్ గౌతమ్ దేవ్ వెల్లడించడం గమనార్హం.
నక్సల్‌బరీ ఒకప్పుడు కమ్యూనిస్టులకు, ముఖ్యంగా నక్సలైట్లకు పెట్టనికోటగా ఉండేది. కానూ సన్యాల్, చారు మజుందార్‌లు నక్సల్‌బరీ నుంచి ప్రారంభించిన ఉద్యమం నక్సలైట్ ఉద్యమంగా దేశంలో విస్తరించిన సంగతి తెలిసిందే. ఉద్యమ ప్రారంభ సమయంలో ఇక్కడ పోలీసు కాల్పుల్లో చాలామంది మరణించారు. వారిలో అత్యధికులు మహిళలే. కాల్పుల్లో మరణించినవారి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన విగ్రహాలు నక్సల్‌బరీ చౌకీలో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. తోడుగా మార్క్స్, లెనిన్, స్టాలిన్, కానూ సన్యాల్, చారుమజుందార్‌ల విగ్రహాలనూ ఏర్పాటుచేశారు. వామపక్షాలు చీలికలు వాలికలైన దృష్ట్యా భాజపాయే తమకు మిగిలిన ప్రత్యామ్నాయమని స్థానికులు భావిస్తున్నారు. 1967లో నక్సల్‌బరీలో తిరుగుబాటు ప్రారంభమైన స్థలాన్ని స్థానికంగా తియనాన్మెన్ చౌకీగా పిలుచుకుంటారు. వామపక్ష స్మారక చిహ్నాలు, తియనాన్మెన్ చౌకీ జోలికి వెళ్లకుండానే వాటి ప్రాధాన్యాన్ని భాజపా తగ్గించగలిగింది. గ్రామ ముఖద్వారంలో కార్గిల్ యుద్ధంలో అమరులైన వారికి స్మారక చిహ్నం నిర్మించడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఈ పని సాధించగలిగారు. ఆ స్మారక చిహ్నంలో స్థానిక గుర్ఖాల ఆయుధం కుక్రీతోపాటు హృదయాకారంలో ఒక గుర్తు కూడా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే సమీపంలోని కాంచనగంగ శిఖరం కనిపిస్తుంది. కార్గిల్ హిమ శిఖరాలలో పాకిస్థానీలతో భారతీయ వీరులు చేసిన యుద్ధాన్ని అది గుర్తుచేస్తుంది. నక్సల్‌బరీ యువత హృదయాలతో కార్గిల్ స్మారక చిహ్నం పెనవేసుకుంది. మరోవైపు నక్సల్ ఉద్యమ మూలాలను స్థానికులు మరచిపోవడం గమనార్హం.
అందరి మదిలో కార్గిల్ స్థూపమే
తియనాన్మెన్ చౌకీ పక్కనే పొలం పని చేసుకునే మీనూ సైబా అనే మహిళకు చౌకీలో ఉన్న విగ్రహాలెవరివో తెలియదు. కార్గిల్ యుద్ధ చిహ్నం గురించి మాత్రం బాగా తెలుసు. దేశంకోసం భాజపా పాటుపడుతోందనీ, కార్గిల్ స్మారక స్థూపం గర్వకారణమని ఆమె చెప్పుకొచ్చారు. ఆ స్థూపం మీది ఫలకంలో కార్గిల్ అమర వీరుల పేర్లు లిఖించి ఉన్నాయి. అక్కడ సందర్శకులు సెల్ఫీలు దిగుతుంటారు. తియనాన్మెన్ చౌకీలోని కానూ సన్యాల్ విగ్రహం పక్కన కూడా ఒక ఫలకంపై నక్సల్ అమరుల పేర్లుంటాయి. కానీ, అక్కడెవరూ సెల్ఫీలు దిగడం లేదు. నక్సల్‌బరీలో కానూ సన్యాల్ నివసించిన పూరిపాకలో ఇప్పుడు సీపీఎం కార్యకర్తలు గ్రంథాలయం నడుపుతున్నారు. ఆ గుడిసెను పర్యాటక ప్రాంతంగా మార్చడానికి తృణమూల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, గ్రామస్థులు ఆ ప్రతిపాదనను స్వాగతించడం లేదు. నక్సల్‌బరీ చుట్టుపక్కల ప్రాంతాలపై భాజపా పట్టు పెరిగిన నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన పార్టీలు ఇక్కడ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయో మరి!
స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యేనాటికి దేశంలోని అందరినీ బీమా రక్షణ పరిధిలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆశయం. ఆ బృహత్ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా బీమా చట్టాల సవరణకు కేంద్రం నిశ్చయించింది. ఆ మేరకు సర్కారు రూపొందించిన ‘సబ్ కా బీమా సబ్ కా రక్షా’ బిల్లు తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందింది. దీంతో దేశీయ బీమా రంగంలోకి వందశాతం ఎఫ్‌డీఐల రాకకు మార్గం సుగమమైంది. 2047 నాటికి భారతీయులందరినీ బీమా ఛత్రంలోకి తేవాలన్న సంకల్పం ఘనంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశీయంగా ఇన్సూరెన్స్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని బీమా ప్రీమియంల మొత్తం జీడీపీలో ఎంత శాతం ఉందన్న దాన్ని బట్టి ఇన్సూరెన్స్ వ్యాప్తిని లెక్కేస్తారు. 2014లో అది మన దేశంలో 3.3శాతంగా ఉంటే- 2023 నాటికి 3.7శాతానికి పెరిగింది. కానీ- ప్రపంచ సగటుతో, అనేక దేశాలతో పోలిస్తే భారత్‌లో బీమా వ్యాప్తి చాలా తక్కువ. 2023లో అది ఏయే దేశాల్లో ఎంత ఉందంటే (శాతాల్లో)...
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation

West Bengal: Lotus development in Naxalbury

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Maoist movement is getting weaker day by day. The number of Maoist-affected areas is decreasing due to the loss of key leaders and lack of new recruits. In this background, the situation in Naxalbari, which paved the way for armed revolutionary struggles in the country, is noteworthy!
BemThe village of Naxalbari in the northern part of Gal, which was once the stronghold of the Naxalite movement, has now become a stronghold of the Bharatiya Janata Party. Operation Lotus was launched in 2017 when BJP supremo Amit Shah dined with a Dalit family in this village. It gradually led to the increase in BJP's strength in West Bengal and Tripura. Earlier, BJP had only one member in the West Bengal Legislative Assembly, but in the 2021 elections, their number has reached double digits. BJP's persistent efforts to strengthen the Dalit, tribal and backward communities in the northern parts of Bengal are bearing fruit.
Disappearing Left Predominance
North Bengal has 54 seats in the state legislature. The region is a hot spot for the Gorkhas of Darjeeling clamoring for Gorkhaland and the Raj Banshees of Cooch Bihar. Both these groups want to separate from West Bengal and emerge as a separate state or union territory. They hope that their wish will be fulfilled by BJP. Many here are averse to the Trinamool Congress, the ruling party of West Bengal. On the other hand, due to the unremitting efforts of the RSS workers, the BJP was able to gain a foothold in North Bengal. Today, saffron flags are fluttering there. Trinamool leader and Siliguri Mayor Gautam Dev revealed that wherever they go in this region, RSS workers are active with their community service programs and movements on civic issues.
Naxalbury was once a stronghold of communists, especially Naxalites. But it is known that the movement started by Sanyal and Charu Mazumdar from Naxalbari spread as Naxalite movement in the country. Many people were killed in police firing here during the beginning of the movement. Most of them are women. Statues erected in memory of those killed in the firing are still visible in Naxalbari Chowki. Besides, statues of Marx, Lenin, Stalin, Kanu Sanyal and Charumajumdar were also installed. Locals feel that BJP is their only remaining alternative as the Left parties are split. The place where the rebellion started in Naxalbury in 1967 is locally known as Tiananmen Square. The BJP managed to de-prioritize Leftist monuments and Tiananmen Square without going too far. The RSS workers managed to achieve this by constructing a memorial to the Kargil war martyrs at the village entrance. The memorial includes a kukri, the local Gurkha weapon, as well as a heart-shaped symbol. If you look from there, you can see the nearby Kanchanaganga peak. It reminds of the war fought by Indian heroes against Pakistanis in Kargil mountains. The Kargil memorial is intertwined with the hearts of the youth of Nuxalbury. On the other hand, it is noteworthy that the locals have forgotten the roots of the Naxal movement.
Kargil Stupa is in everyone's mind
Minoo Saiba, a woman who works in the field next to Tiananmen Chowk, does not know who the statue is in the Chowk. The symbol of Kargil war is well known. She said that BJP is working for the country and the Kargil monument is a source of pride. The names of Kargil's immortal heroes are written on the plaque on the stupa. Visitors take selfies there. A plaque with the names of Naxal martyrs is also on a plaque next to Kanoo Sanyal's statue in Tiananmen Square. But, no one is taking selfies there. Not in Naxalbari but in Puripaka, where Sanyal lived, CPM activists now run a library. The Trinamool government is trying to convert the hut into a tourist area. But, the villagers are not welcoming the proposal. What kind of strategy will the rest of the parties follow in the 2026 assembly elections in the wake of BJP's increasing grip on the areas around Naxalbari?
Government's ambition is to bring everyone in the country under insurance coverage by the time of hundred years of independence. The Center has decided to amend the insurance laws as part of its efforts to achieve this ambitious goal. To that end, the 'Sab Ka Bima Sab Ka Raksha' bill drafted by the government has recently been approved by the Parliament. This paved the way for 100% FDI inflow into the domestic insurance sector. Although the determination to bring all Indians under the insurance umbrella by 2047 is strong, at present the penetration of insurance in the country is very low. Insurance coverage is calculated as a percentage of the total GDP of all insurance premiums across the country. If it was 3.3 percent in our country in 2014, it will increase to 3.7 percent by 2023. But – compared to the global average, insurance penetration in India is very low compared to many countries. In which countries will it be in 2023 (in percentage)...
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :