NRI video: సోఫాలోంచి లేస్తుండగా పేలిన గన్.. ఎన్నారై మృతి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

NRI video | ఇంటర్నెట్ డెస్క్: ఆత్మరక్షణ కోసం ఉపయోగించే గన్నే ఓ వ్యక్తి ప్రాణం తీసింది. సోఫాలోంచి లేస్తుండగా పొరపాటున పేలడంతో ఎన్నారై మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ధని సుచా సింగ్ గ్రామానికి చెందిన హర్పీందర్ సింగ్ అలియాస్ సోనూ కొన్నేళ్ల పాటు విదేశాల్లో ఉండి ఈ మధ్యే స్వగ్రామానికి తిరిగొచ్చాడు.
సోమవారం తన ఇంట్లో బంధువుతో మాట్లాడుతూ సోఫాలోంచి లేచాడు. ఈ క్రమంలో నడుము భాగంలో ఉన్న తుపాకీ పొరపాటున పేలి ఓ తూటా అతడి పొట్టలోకి దూసుకెళ్లింది. తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన కుటుంబ సభ్యులు.. అతడిని తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. భఠిండా తరలిస్తుండగా మార్గమధ్యంలో మృత్యువాడపడ్డాడు. హర్పీందర్‌కు రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. మృతుడి తండ్రి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదుచేశారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో సంబంధిత దృశ్యాలు రికార్డయ్యాయి.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :