NRI video: సోఫాలోంచి లేస్తుండగా పేలిన గన్‌.. ఎన్నారై మృతి

Eenadu icon
By Crime News Team Published : 31 Dec 2025 00:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

NRI video | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆత్మరక్షణ కోసం ఉపయోగించే గన్నే ఓ వ్యక్తి ప్రాణం తీసింది. సోఫాలోంచి లేస్తుండగా పొరపాటున పేలడంతో ఎన్నారై మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ధని సుచా సింగ్‌ గ్రామానికి చెందిన హర్పీందర్‌ సింగ్‌ అలియాస్‌ సోనూ కొన్నేళ్ల పాటు విదేశాల్లో ఉండి ఈ మధ్యే స్వగ్రామానికి తిరిగొచ్చాడు.

సోమవారం తన ఇంట్లో బంధువుతో మాట్లాడుతూ సోఫాలోంచి లేచాడు. ఈ క్రమంలో నడుము భాగంలో ఉన్న తుపాకీ పొరపాటున పేలి ఓ తూటా అతడి పొట్టలోకి దూసుకెళ్లింది. తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన కుటుంబ సభ్యులు.. అతడిని తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. భఠిండా తరలిస్తుండగా మార్గమధ్యంలో మృత్యువాడపడ్డాడు. హర్పీందర్‌కు రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. మృతుడి తండ్రి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదుచేశారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో సంబంధిత దృశ్యాలు రికార్డయ్యాయి.


► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

NRI video: Gun explodes while getting up from sofa.. NRI dies

Eenadu icon
By Crime News Team Published : 31 Dec 2025 00:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

NRI video | Internet Desk: Self-defense gun kills man NRI died when he accidentally exploded while getting up from the sofa. The incident took place in Ferozepur district of Punjab on Monday. A video related to this has recently come to light. Harpinder Singh alias Sonu of Dhani Sucha Singh village returned to his native village after staying abroad for several years.

He got up from the sofa while talking to his relative at his house on Monday. In this process, the gun in the waist went off by mistake and a bullet went into his stomach. The family members, who were shocked by the sound of the gun, first rushed him to the local government hospital. The doctors there advised to move to another hospital. He died on the way while moving to Bathinda. Harpinder has a two-and-a-half-year-old daughter. The police recorded the statement of the deceased's father. The funeral was held at his hometown on Tuesday. The relevant scenes were recorded in the CCTV cameras installed in the house.


► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :