శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో భక్తులు పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. తాము కొనుగోలు చేసిన పులిహోర ప్రసాదం ప్యాకెట్‌లో నత్త ఉందని, తిరిగి కౌంటరు దగ్గరకి వెళ్లి ప్రశ్నిస్తే అక్కడ పనిచేసే సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదని, ఇంకో ప్యాకెట్టు ఇచ్చేసి పట్టించుకోలేదని ఇద్దరు భక్తులు సోషల్‌ మీడియా వేదిక ద్వారా నిరుత్సాహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా పోస్టు చేశారు.


English Translation

The incident of finding a snail in the pulihora prasadam, which is considered sacred by the devotees in Sri Varaha Lakshminrisimhaswamy Devasthanam, is causing a sensation. Two devotees expressed their disappointment through the social media platform that there was a snail in the Pulihora Prasad packet they had bought, and when they went back to the counter, they did not get a proper answer from the staff working there, and they gave them another packet and did not care. A video related to this has also been posted.