
Telangana News: ‘చేయి..చేయి’ కలిపి.. ఆధిక్యంలో నిలిపి..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు గత అసెంబ్లీ ఎన్నికలకు మించి కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టారు. 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా..84 చోట్ల ఆ పార్టీ వారికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. రెబల్స్‌నూ కలుపుకొంటే ఈ సంఖ్య 87. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే అదనంగా సుమారు 20 శాసనసభ స్థానాల్లో ముందుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మధిరతో సహా మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో 70-80 శాతం వరకు పంచాయతీలు కాంగ్రెస్‌కు దక్కాయి. అనేక చోట్ల కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందిన వారు తిరిగి పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే చాలా చోట్ల చేరారు. విపక్ష భారత రాష్ట్ర సమితి తొమ్మిది నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించగా, ఇక్కడ రెబల్స్, స్వతంత్రులు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఈ ఆధిక్యం ఆరు స్థానాలకే పరిమితమైంది. భాజపా ఒక్క చోట మాత్రమే ముందుంది.
ఉమ్మడి మెదక్ జిల్లా మినహా
రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలను పరిగణనలోకి తీసుకొంటే మెదక్ జిల్లా మినహా మిగిలిన చోట్ల భారత రాష్ట్ర సమితికి ఆధిక్యం లభించలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత రెండు జిల్లాల్లో కలిసి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి.
- హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా నియోజకవర్గాలను పరిశీలిస్తే ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం లభించింది. ఈ జిల్లాల్లో యాభై శాసనసభ స్థానాలున్నాయి. మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు నగర నియోజకవర్గాలు మినహాయిస్తే పది గ్రామీణ స్థానాల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న జనగామ మినహా మిగిలిన తొమ్మిది చోట్లా కాంగ్రెస్‌దే హవా.
- ఉమ్మడి కరీంనగర్‌లో 13 నియోజకవర్గాలుండగా, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే భారత రాష్ట్ర సమితి పూర్తి మెజార్టీ సాధించింది. కౌశిక్‌రెడ్డి నియోజకవర్గం హుజూరాబాద్‌లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భాజపాలు పంచాయతీలను పంచుకోగా, భారత రాష్ట్ర సమితికే స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలున్న కోరుట్ల తదితర నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ముందుంది.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్‌లో భారత రాష్ట్ర సమితి పైచేయి సాధించింది. బోథ్‌లో పోటీ చేసి గెలిచిన స్థానాల్లో భారత రాష్ట్ర సమితికి ఆధిక్యం వచ్చినా, అధిక సంఖ్యలో గెలిచిన రెబల్స్‌తో తమకే ఆధిపత్యం లభించిందని కాంగ్రెస్ పేర్కొంది.
గజ్వేల్‌లో మాకే ఆధిక్యం: కాంగ్రెస్
ఉమ్మడి మెదక్‌లో నాలుగు స్థానాల్లో భారత రాష్ట్ర సమితి ప్రభావాన్ని చూపింది. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట, కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాకలో భారత రాష్ట్ర సమితి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. రెబల్స్ తిరిగి పార్టీలోకి రావడంతో గజ్వేల్‌లో కూడా తమకే ఆధిక్యం లభించిందని కాంగ్రెస్ ప్రకటించింది. సునీతా లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహించే నర్సాపూర్‌లోనూ ఇదే పరిస్థితి.
- సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల, హుజూరాబాద్, జనగామ, సిర్పూర్‌లలో స్వతంత్రులు, రెబల్స్ కాంగ్రెస్‌లో చేరినా భారత రాష్ట్ర సమితిదే మెజార్టీ. రెబల్స్, స్వతంత్రులతో సంబంధం లేకపోతే గజ్వేల్, నర్సాపూర్, బోథ్‌లో కూడా భారత రాష్ట్ర సమితినే ముందుంది. అయితే ఈ నియోజకవర్గాల్లో రెబల్స్, స్వతంత్రుల చేరికతో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.
- జడ్చర్ల, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనూ భారత రాష్ట్ర సమితి పోటాపోటీగా నిలిచే ప్రయత్నం చేసింది.
భాజపాకు ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ఆధిక్యం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో భాజపా గెలిచింది. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాసనసభ నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం దీనికి తగ్గ ఫలితాలు లేవు. ఒక్క ముథోల్‌లో మాత్రమే ముందంజలో ఉంది. నిజామాబాద్ అర్బన్ నగరపాలక సంస్థ కావడంతో ఇక్కడ గెలిచిన భాజపా ఎమ్మెల్యేకు పంచాయతీ ఎన్నికలతో సంబంధం లేదు. హైదరాబాద్‌లోని గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్‌ను మినహాయిస్తే మిగిలిన ఐదింటిలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పాక్షికంగా గ్రామీణ ప్రాంతం ఉంది. ఇక్కడ కాంగ్రెస్, భాజపా మధ్య పోటాపోటీగా సర్పంచి స్థానాలు దక్కగా, భారత రాష్ట్ర సమితి మూడో స్థానానికి పరిమితమైంది. అయితే పార్టీల మద్దతు దక్కక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌లో చేరడంతో తమ స్థానాల సంఖ్య 56కు చేరిందని, రెండో స్థానంలో ఉన్న భాజపాకు 38, భారత రాష్ట్ర సమితికి 22 దక్కాయని కాంగ్రెస్ పేర్కొంది. ముథోల్ పరిధిలోని పంచాయతీల్లో మాత్రం భాజపాకు పూర్తి ఆధిక్యం లభించింది. భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గం నిర్మల్‌లో రెండో స్థానానికి పరిమితం కాగా, ఇక్కడ భారత రాష్ట్ర సమితి మూడో స్థానంలో.. అదీ నామమాత్రపు సీట్లను పొందింది. ఆర్మూరు, కామారెడ్డి, సిర్పూర్ నియోజకవర్గాల్లో భాజపా కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ స్థానాలు దక్కాయి. సిర్పూర్‌లో భారత రాష్ట్ర సమితికి మొదటి స్థానం లభించింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొన్నాళ్ల క్రితం తిరిగి భారత రాష్ట్ర సమితిలో చేరడంతో ఆ ప్రభావం ఇక్కడ కనిపించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత వచ్చిన ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీలో మరింత జోష్ నింపుతాయని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 12,702 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 7,527 చోట్ల కాంగ్రెస్ గెలిచిందని, రెబల్స్ గెలిచిన 808 మందితో కలిపి ఆ సంఖ్య 8,335కు చేరిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీని ప్రకారం 66 శాతం స్థానాలు కాంగ్రెస్‌కు వచ్చినట్లయ్యింది. భారత రాష్ట్ర సమితికి 3,511 పంచాయతీలు దక్కాయని, దీని ప్రకారం 27.64 శాతం వచ్చినట్లని, భాజపాకు 710 పంచాయతీలు దక్కాయని, ఇది 5.59 శాతమని, ఇతరులకు 146 దక్కాయంటూ వాటి శాతం ఒకటిగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 94 అసెంబ్లీ స్థానాల వారీగా ఏ పార్టీ మద్దతుదారులకు ఎన్ని సర్పంచి స్థానాలు వచ్చాయో వివరాలు వెల్లడించారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- హస్తానికి ‘పుర’స్కారం పట్నం ‘చెయ్యె’త్తి జై కొట్టింది.. పుర ఎన్నికల్లో హస్తానికే పట్టం కట్టింది. ఏడింట ఆరు కార్పొరేషన్లు, మూడొంతులకు పైగా మున్సిపాలిటీలను ‘చే’జిక్కించుకునేంతగా అధికార పార్టీ సత్తా చాటింది. 52 శాతానికి పైగా మున్సిపల్ వార్డులను చేజిక్కించుకుని.. ‘పీఠా’ధిపత్యం దిశగా పావులు కదుపుతోంది.
- సతీసమేత విజయం.. పలుచోట్ల భార్యాభర్తల గెలుపు రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన పుర పోరులో పలుచోట్ల భార్యాభర్తలు గెలుపొందారు. జంటగా పుర, నగరపాలికల్లోకి అడుగుపెట్టనున్నారు. మరికొన్ని చోట్ల అత్తాకోడళ్లు, తండ్రీకుమారులు, తల్లీకుమారుడు గెలుపొందారు.
- ఫలించిన సీఎం వ్యూహం ఉత్కంఠ మధ్య సాగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ప్రాంతాల్లో విజయ దుందుభి మోగించి కాంగ్రెస్ పట్టు సాధించింది. నోటిఫికేషన్ వెలువడటానికి ముందు నుంచీ పార్టీ అత్యధిక వార్డులు, డివిజన్లలో నెగ్గడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది.
- ఒక్క ఓటు మ్యాజిక్ ‘పుర’ ఎన్నికల ఓట్లు లెక్కింపు ఉత్కంఠగా సాగింది. విజయం దోబూచులాడిన చోట్ల అభ్యర్థులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు తిరిగి ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో చాలామంది ఒక్క ఓటు తేడాతో తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు.
- వరుస విజయాలతో కాంగ్రెస్‌లో జోష్.. వరుస విజయాలు కాంగ్రెస్‌లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కొన్ని నెలల క్రితం పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ఇప్పుడు నగర..
- మేయర్, ఛైర్‌పర్సన్ పదవులకు16న ఎన్నికలు తెలంగాణలో ‘పుర’ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవడంతో ఏడు నగరపాలక సంస్థల మేయర్లు, ఉప మేయర్లు, 116 పురపాలికల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఈ నెల 16న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టింది.
- లక్షల మంది కార్యకర్తల శ్రమ ఫలితమిది ‘రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
- మాకు ఓట్లు పెరిగాయి పుర ఫలితాలతో తాము సంతృప్తికరంగా ఉన్నామని, తమకు ఓట్లు, సీట్లు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. చాలా చోట్ల కాంగ్రెస్, మజ్లిస్, భారాస ఒక్కటై భాజపా గెలవకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు.
- ‘తిరుగుబాటు’తో తడబాటు తమకు వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు సీటు కావాల్సిందేనని వారు పట్టుబట్టారు. ప్రధాన పార్టీలు ససేమిరా అనడంతో తిరుగుబావుటా ఎగురవేసి.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.
- స్వీపర్‌గా పని చేసి..కౌన్సిలర్‌గా గెలిచి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలికలో సుదీర్ఘకాలం స్వీపర్‌గా పనిచేసి 2019లో పదవీ విరమణ పొందిన ఇంజమూరి వెంకటమ్మ కౌన్సిలర్‌గా గెలిచి ఔరా అనిపించారు.
- పురపాలికల్లో కాంగ్రెస్‌కే పట్టం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 50 శాతానికిపైగా వార్డులతో 66 చోట్ల స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మరో ఐదు మున్సిపాలిటీల్లో సగం వార్డులు సాధించింది.
- ఇక్కడా లెక్కింపు కోలాహలమే! కొత్తగూడెం నగరపాలిక ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శుక్రవారం నెలకొన్న కోలాహలమిది. పాల్వంచ పట్టణంలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటుచేయగా..
- కార్పొరేషన్లలో భారాసకు చుక్కెదురు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి (భారాస)కు చుక్కెదురైంది. ఎన్నికలు జరిగిన ఏడు కార్పొరేషన్లలోనూ పార్టీ నామమాత్రపు పోటీ ఇచ్చింది.
- పండుగ..సందడి హైదరాబాద్ శివారు బాట సింగారం మార్కెట్‌కు వివిధ రకాల పండ్లు తీసుకొచ్చిన వాహనాలతో జాతరను తలపిస్తున్న దృశ్యమిది.
- పార్టీల క్యాంప్ ఫైర్ రాష్ట్రవ్యాప్తంగా క్యాంపు రాజకీయాల హడావుడి మొదలైంది. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాల్టీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహరచనతో రాజకీయాలు వేడెక్కాయి.
- నేడు అనధికారికంగా మంత్రివర్గ సమావేశం రాష్ట్రమంత్రివర్గం శనివారం సమావేశం కానుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
- బజ్జీల విక్రేత.. నేడు విజేత! నిన్నటిదాకా గుబిడే నాగుబాయి వేసే వేడివేడి బజ్జీలు తినడానికి ఇష్టపడ్డ జనం.. రేపట్నుంచి సమస్యలు పరిష్కరించమని కోరనున్నారు.
- కువైట్ ఫ్లైట్ దిగగానే.. ‘గోల్డెన్’ ఛాన్స్! స్థానిక నాయకులు సుదీర్ఘంగా వ్యూహాలతో.. భారీ ప్రచారాలతో చెమటోడ్చితే.. సయ్యద్ మహబూబ్‌అలీ మాత్రం కువైట్ నుంచి వచ్చీరాగానే విజయాన్ని సొంతం చేసుకున్నారు.
- టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన జూ.అసిస్టెంట్ల నియామకానికి చర్యలు టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 1,309 మంది జూనియర్ అసిస్టెంట్లతో ఖాళీలను భర్తీ చేయనున్నందున ఆ పోస్టుల్లో ఒప్పంద, పొరుగుసేవల ద్వారా పనిచేస్తున్న వారిని తొలగించనున్నారు.
- ‘స్వతంత్రం’గానే హ్యాట్రిక్! నల్గొండ జిల్లా దేవరకొండ పురపాలికలో స్వతంత్ర అభ్యర్థి తాళ్ల శ్రీధర్‌గౌడ్ వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించారు.
English Translation

Telangana News: 'Do..do' combined..to lead..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Today, Hyderabad: In the panchayat elections, the rural voters favored Congress supporters more than in the previous assembly elections. Elections were held for panchayats under 94 legislative constituencies. In 84 places, the party got a clear lead. Including the rebels, the number is 87. An additional 20 legislative seats ahead of the assembly elections held two years ago. In the constituencies represented by ministers including Kodangal and Madhira represented by Chief Minister Revanth Reddy and Deputy Chief Minister Bhatti Vikramarka, 70-80 percent panchayats went to the Congress. In many places, those who contested as Congress rebel candidates and won are trying to rejoin the party.
Already joined many places. While the opposition Bharat Rashtra Samithi won in nine constituencies, this lead was limited to six seats as the rebels and independents joined the Congress. BJP is ahead in only one seat.
Except joint Medak district
If we consider the joint ten districts of the state, except Medak district, Bharat Rashtra Samithi did not get the lead. After redistricting, the two districts have more assembly constituencies.
- Except for Hyderabad, if we look at the constituencies wise in the combined districts, the Congress got complete lead in Khammam, Nalgonda, Mahbubnagar, Rangareddy and Nizamabad districts. There are fifty assembly seats in these districts. Former ministers Prashanth Reddy, Jagadish Reddy and Sabita Indra Reddy are MLAs.
- Except for two urban constituencies in Ummadi Warangal district, in ten rural seats, except for Janagama, which is represented by Palla Rajeshwar Reddy, the Congress is in control. In Kaushik Reddy's constituency, Bharat Rashtra Samithi, Congress and BJP shared panchayats in Huzurabad, but Bharat Rashtra Samithi got a slight lead. Congress is leading in Korutla and other constituencies where Bharat Rashtra Samithi MLAs are also present in this district.
- Bharat Rashtra Samithi won in Sirpur in joint Adilabad district. Even though the Bharatiya Rashtra Samithi got the upper hand in the number of seats contested and won in Both, the Congress claimed that they got the upper hand with the rebels who won in large numbers.
We lead in Gajwel: Congress
Bharat Rashtra Samithi has shown influence in four seats in the joint Medak. Harish Rao represented Siddipet, Kota Prabhakar Reddy Dubbaka, Bharat Rashtra Samithi showed complete lead. Congress has given a tough contest in Gajwel, which is represented by former CM KCR. The Congress announced that they got the upper hand in Gajwel as well as the rebels came back into the party. The situation is similar in Narsapur, which is represented by Sunita Lakshmareddy.
- In Siddipet, Dubbaka, Sirisilla, Huzurabad, Janagama, Sirpur independents and rebels have joined the Congress but Bharat Rashtra Samithi is the majority. If there is nothing to do with rebels and independents, Bharat Rashtra Samithi is leading in Gajwel, Narsapur and Both. But in these constituencies, with the inclusion of rebels and independents, the Congress gained the lead.
- Bharat Rashtra Samithi tried to be competitive in Jadcharla and Asifabad constituencies.
BJP leads in one assembly seat
BJP won seven seats in the last assembly elections. In the subsequent Lok Sabha elections, it won eight seats and got a majority in more legislative constituencies than in the assembly elections. However, in the elections of local bodies, the results are not as good as this. Only one Muthole is ahead. As Nizamabad is an urban municipality, the BJP MLA who won here has nothing to do with the panchayat elections. Except for Raja Singh who won from Goshamahal in Hyderabad, the remaining five constituencies are partly rural in Adilabad. Here, Congress and BJP won the Sarpanchi seats, while Bharat Rashtra Samithi was limited to the third position. However, the Congress claimed that most of those who contested as independent candidates joined the Congress and their number of seats reached 56, while the second-placed BJP got 38 and Bharat Rashtra Samithi 22. In the panchayats under Muthol, however, the BJP got a complete lead. BJP legislative party leader Eleti Maheshwar Reddy's constituency was limited to the second position in Nirmal, while Bharat Rashtra Samithi was in the third position and got nominal seats. Congress got more seats than BJP in Armoru, Kamareddy and Sirpur constituencies. Bharat Rashtra Samithi got first position in Sirpur. The impact was felt here when former MLA Koneru Konappa rejoined the Bharatiya Rashtra Samithi a few years ago.
The party sources are of the opinion that the results of this panchayat election, which came after two years of the formation of the Congress government in the state, will fill the party with more vigor. Elections were held for 12,702 gram panchayat seats. The Congress won 7,527 seats, and the number reached 8,335 with the 808 won by the rebels, Chief Minister Revanth Reddy announced in a press conference on Thursday. According to this, 66 percent seats have come to Congress. Bharat Rashtra Samithi got 3,511 panchayats, which is 27.64 percent, BJP got 710 panchayats, which is 5.59 percent, and others got 146. The details of how many Sarpanchi seats have been won by which party's supporters in the 94 assembly seats in rural areas have been revealed. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. Correspondence has no place in this matter.
Patnam has 'cheyye'tti jai. The ruling party has so much power that it has 'captured' six out of seven corporations and more than three quarters of municipalities. Having captured more than 52 percent of the municipal wards... it is moving towards the supremacy of 'Peetha'.
Husband and wife won in many places in the city war that took place in the state. As a couple, they will enter the town and city administration. In some other places mother-in-law, father-son and mother-son won.