Bangladesh: యూనస్‌ మెడకు చుట్టుకున్న హాదీ హత్య.. పారిపోవడం తప్పదంటూ హెచ్చరికలు

Eenadu icon
By International News Team Published : 24 Dec 2025 11:32 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఢాకా: రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్‌లో నానాటికీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. యువనేత ఉస్మాన్‌ హాదీ హత్యలో ప్రభుత్వం ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ను (Muhammad Yunus) చిక్కుల్లో పడేస్తున్నాయి. అదే సమయంలో అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం విధించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం కూడా యూనస్‌ సర్కారును ఇబ్బంది పెడుతోంది. (Bangladesh Protests)

పారిపోవాల్సి వస్తుంది జాగ్రత్త..!

యువ నాయకుడు, ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ (Sharif Osman Hadi Killing) హత్యతో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై హాదీ సోదరుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. హాదీ హత్యలో యూనస్‌ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు ఆరోపించారు. ‘‘ఉస్మాన్‌ హాదీని మీరే (యూనస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) చంపేశారు. ఈ ఘటనను ఉపయోగించుకొని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు రద్దు చేయాలని చూస్తున్నారు. నా సోదరుడి హత్యపై వేగంగా దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకోవాలి. హాదీకి న్యాయం జరగకపోతే.. మీరు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్‌ను వీడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త..!’’ అని ఉస్మాన్‌ హాదీ సోదరుడు ఒమర్ హెచ్చరించాడు. విద్యార్థి ఉద్యమంతో గతేడాది షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో హాదీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యమంతో హసీనా దేశం వీడాల్సి వచ్చింది. ఆ పరిణామాలను ఉద్దేశిస్తూనే హాదీ సోదరుడు పరోక్షంగా యూనస్‌ను హెచ్చరించారు.

  • భారత్‌తో గొడవలు కోరుకోవడం లేదు: బంగ్లాదేశ్‌

అమెరికా ఆందోళన..

ఇదిలాఉండగా.. మాజీ ప్రధాని షేక్‌ హాసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనిపై అమెరికా చట్టసభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శక, స్వేచ్ఛాయుత విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకొనే హక్కు బంగ్లాదేశ్‌ పౌరులకు ఉందని వారు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. అవామీ లీగ్‌పై నిషేధాన్ని పునఃసమీక్షించాలని వారు సూచించారు.

ఆమెను తొలగిస్తారా, లేదా?

మరోవైపు, బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పలు మీడియా సంస్థలపై ఆందోళనకారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మీడియా సంస్థకు బెదిరింపులు వచ్చాయి. గ్లోబల్‌ టీవీ హెడ్‌ నాజ్నిన్‌ మున్నీని తొలగించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వీసా హక్కు కాదు : అమెరికా విదేశాంగ శాఖ కఠిన వీసా విధానాలపై అమెరికా విదేశాంగ మరోసారి స్పందించింది. వీసా అనేది హక్కు కాదని, విదేశీ పర్యటకులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
  • ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు. 
  • అమెరికా బాటలో చైనా.. మెరైన్‌ కోర్‌ ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా సైనిక ఆపరేషన్లు చేసేందుకు అమెరికా మాదిరిగా చైనా సైతం మెరైన్‌ కోర్‌ను ఏర్పాటుచేసింది. 
  • యూనస్‌ నోట మళ్లీ ‘సెవెన్‌ సిస్టర్స్‌’.. వెళ్లిపోతూ భారత్‌పై కవ్వింపులు Bangladesh: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్‌ యూనస్‌ సోమవారం తన పదవి నుంచి వైదొలిగారు.
  • పిల్లలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌ Indian Man Arrested: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో అరెస్ట్‌ అయ్యాడు. నిందితుడిని ఓడెల యశస్వీ కొత్తపల్లిగా గుర్తించారు.
  • ముంబయి తీరంలో సీజ్‌ అయిన నౌకలు ఇరాన్‌వే! చమురు అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారణంగా భారత్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సీజ్‌ చేసిన మూడు నౌకలకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
  • కిమ్‌ కుమార్తెకు వారసత్వ పగ్గాలు! నిరంకుశ పాలనకు చిరునామాగా నిలిచే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రాజ్యంలో కుటుంబ పోరుకు తెరలేచిందా? అధికార పగ్గాల కోసం కిమ్‌ సోదరి, కుమార్తె పోటీ పడనున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
  • గ్రహాంతర జీవులు సంప్రదింపులు జరిపినట్లు ఆధారాల్లేవు: ఒబామా గ్రహాంతర జీవులున్నాయంటూ ఓ పాడ్‌కాస్ట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
  • బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం చైనాలో వీసా లేకుండా పర్యటించే అవకాశం బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది.
  • పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్‌ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.

English Translation

Bangladesh: Hadi's murder wrapped around Yunus's neck...warnings to run away

Eenadu icon
By International News Team Published : 24 Dec 2025 11:32 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Dhaka: Political instability has always prevailed in Bangladesh. Things are getting worse. Allegations that the government is involved in the assassination of the youth leader Usman Hadi have put the interim head of government, Muhammad Yunus, in trouble. At the same time, the United States' concern over the ban on the Awami League party is also troubling the Yunus government. (Bangladesh Protests)

Beware you have to run away..!

It is known that there has been severe tension recently with the killing of Sharif Osman Hadi, the leader of Inkilab Moncho. Hadi's brother recently made sensational allegations on this. The involvement of key people in the Yunus government was alleged in Hadi's murder. "Usman Hadi was killed by you (referring to the Yunus government). They are trying to use this incident to cancel the elections to be held next year. My brother's murder should be investigated quickly and the killers caught. If justice is not given to Hadi.. One day you too will have to leave Bangladesh and run away..!'' warned Usman Hadi's brother Omar. It is known that Hadi played a key role in ousting Sheikh Hasina's government last year with the student movement. With that movement, Hasina had to leave the country. Hadi's brother indirectly warned Yunus while referring to the consequences.

  • Does not want a fight with India: Bangladesh

America's concern..

However.. The Bangladesh government has banned former Prime Minister Sheikh Hasina's Awami League party. As a result, the party has no chance to contest in next year's elections. Some US lawmakers have expressed concern over this. They claimed that the citizens of Bangladesh have the right to elect the government in a transparent and free manner. He said that the caretaker government should work to organize elections with all the political parties. They suggested a review of the ban on Awami League.

Should she be removed or not?

On the other hand, the tense situation in Bangladesh continues. It is known that agitators have attacked several media organizations recently. Recently another media organization received threats. Global TV Head Naznin Munni has been threatened by some who have threatened to remove him or face severe consequences.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.

More

  • Visa not a right: US State Department The US State Department has once again responded to the strict visa policies. It has warned that visa is not a right and foreign tourists will be canceled if they commit anti-national activities.
  • Imran Khan is ill.. Kapildev, Gavaskar request to Pakistan Imran Khan: Legendary cricketers have asked Pakistan to provide better treatment to Imran Khan. 
  • China in the path of America.. Setting up Marine Core Like the US, China has also established a Marine Corps to conduct military operations around the world. 
  • Younus once again spoke of 'Seven Sisters'. Bangladesh: A new government will be formed in Bangladesh. Mohammad Yunus, who has been the head of the caretaker government so far, resigned from his post on Monday.
  • Sexual abuse of children. Indian Man Arrested: An Indian man has been arrested in America in the case of sexual abuse of children. The accused has been identified as Odela Yashasvi Kothapalli.
  • The ships seized in Mumbai coast are Iranian! It seems that three ships seized by the Indian Coast Guard for smuggling oil have links with Iran. Is there a family feud in the kingdom of North Korean leader Kim Jong Un, who is the address of the autocratic regime? Will Kim's sister and daughter compete for the reins of power? Similar questions arise in light of current developments.
  • No evidence of alien contact: Obama There is a big discussion on social media about the comments made by former US President Barack Obama in a podcast about the existence of extraterrestrial life.
  • Visa-free entry for citizens of Britain and Canada in China. The opportunity to visit China without a visa will be available to the people of Britain and Canada from Tuesday. There has been a massive theft in Pakistan. The thugs broke into a jewelery shop and took gold and diamond jewelery worth 300 million Pakistani rupees.