అనుమానంతో కెమెరాలు పెట్టాడు!

నా మీద అనుమానంతో నా భర్త నా ప్రతి కదలికనూ గమనిస్తారు. ఇప్పుడా పరిస్థితి పద్నాలుగేళ్ల నా కూతురుకీ వచ్చింది. నిత్యం తనని సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడు. ఈ మధ్య ఇల్లంతా కెమెరాలు పెట్టించాడు.

Eenadu icon
By Vasundhara Team Published : 23 Dec 2025 01:47 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

నా మీద అనుమానంతో నా భర్త నా ప్రతి కదలికనూ గమనిస్తారు. ఇప్పుడా పరిస్థితి పద్నాలుగేళ్ల నా కూతురుకీ వచ్చింది. నిత్యం తనని సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడు. ఈ మధ్య ఇల్లంతా కెమెరాలు పెట్టించాడు. నరకంలా ఉంది. ఎదురు తిరిగితే రక్తం వచ్చేలా కొడతాడు. ఇన్నాళ్లూ పెళ్లికావలసిన పిల్ల ఉందని ఓపిక పట్టాను. ఇక ఉండలేను. బయటకు వెళ్తే నాకు, బిడ్డకి దక్కే హక్కులు, రక్షణ ఏంటి? 

న్నాళ్లు మీరు చూపిన సహనాన్ని అతడు మీ బలహీనతగా భావించి ఉండొచ్చు. మీ భర్తది మానసిక సమస్య. అలానే వదిలేస్తే ఏమైనా చేస్తారు. పరువు పేరుతో ప్రాణాలు తీసే రోజులివి. మీ అమ్మాయి భవిష్యత్తు కోసమైనా మీరు బయటకి రండి. అతడి మీద కేసులు వేయడం కంటే ముందు మిమ్మల్నీ, పాపని కాపాడుకోవడం ముఖ్యం. మీరు భరిస్తూ ఉంటే తను ఏమైనా చేసుకోవచ్చు. తల్లిని కొడుతోన్న తండ్రిని చూసి పెళ్లి మీద నమ్మకాన్ని పోగొట్టుకోవచ్చు. మీరు మీ భర్త మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టొచ్చు. విడాకులు కావాలంటే క్రూరత్వాన్ని కారణంగా చూపించి హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌ 13(1)కింద డివోర్స్‌ తీసుకోవచ్చు. మీరు ఇచ్చిన కట్నకానుకలూ వెనక్కి ఇవ్వమనీ అడగొచ్చు. మీ పాపకు, మీకు... నెలసరి పోషణ, భవిష్యత్తులో అమ్మాయి చదువుకీ, పెళ్లికీ అయ్యే ఖర్చు, ఇన్నాళ్లూ మీరు అనుభవించిన మానసిక, శారీరక హింసలకు ఒకే మొత్తంగా కూడా డబ్బుని కోరవచ్చు. అలానే గృహహింస చట్టం కింద మీకూ అమ్మాయికీ పోషణ ఖర్చు, మీకు రక్షణ, ఇంట్లో ఉండే హక్కులు, శాశ్వత పరిహారం అన్నీ కలిపి కూడా పొందవచ్చు.. ముందుగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. వాళ్లు పిలిచి కౌన్సెలింగ్‌ చేస్తారు. మారక పోతే క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తారు. తొందరగా నిర్ణయం తీసుకోండి.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Put cameras out of suspicion!

My husband is suspicious of me and watches my every move. Now the situation has come to my fourteen year old daughter. He is constantly harassing her with blunt words. Lately he has installed cameras all over the house.

Eenadu icon
By Vasundhara Team Published : 23 Dec 2025 01:47 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

My husband is suspicious of me and watches my every move. Now the situation has come to my fourteen year old daughter. He is constantly harassing her with blunt words. Recently, he installed cameras all over the house. It's like hell. If you turn around, he will beat you to draw blood. I have been patient all these years because there is a child who wants to be married. I can't stay anymore. What are the rights and protection for me and the child if I go out? 

Your husband has a mental problem. If left like that, they will do anything. These are the days when lives are taken in the name of honour. Come out for your girl's future. It is important to protect yourself and the baby before filing charges against him. He can do anything if you bear it. Seeing the father beating the mother can make one lose faith in marriage. You can file a case against your husband under domestic violence act. If you want a divorce, you can get a divorce under Section 13(1) of the Hindu Marriage Act on the ground of cruelty. You can also ask for the dowry given back. For your baby, you... monthly maintenance, future girl's education and marriage expenses, mental and physical torture you have suffered all these years can also demand money in one lump sum. Also under the Domestic Violence Act you and the girl can get maintenance expenses, protection, rights to stay at home and permanent compensation. First file a complaint at the police station. They call and counsel. If there is no change, criminal cases will be booked. Take a quick decision.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :