Ishika Sharma: రోల్‌బాల్‌లో రాణిస్తోన్న ఇషికా శర్మ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మేరఠ్: ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌కు చెందిన ఇషికా శర్మ రోల్‌బాల్‌లో సత్తా చాటుతున్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన భారత్‌ను గర్వపడేలా చేశారు. మేరఠ్‌లోని సంజయ్ శర్మ, ఆకాంక్ష దంపతుల కుమార్తె ఇషికా. వీరిది సాధారణ కుటుంబం. 2011 నుంచి ఇషికా స్కేటింగ్ నేర్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె కోచ్ అంకుర్.. రోల్‌బాల్ క్రీడను పరిచయం చేశారు. ఓ ఏడాది పాటు సాధన చేసిన ఆమె అందులో పట్టు సాధించారు. 2012లో జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశం రావడం, అందులో అద్భుతంగా ఆడి తన సత్తా చాటుకున్నారు.
2019లో అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న ఇషికా.. మూడుసార్లు వరల్డ్ కప్‌లో పాల్గొన్నారు. 2022లో ఓ సారి ప్రమాదానికి గురైన ఆమె.. కొంతకాలం ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ, వెనక్కితగ్గకుండా కృషి చేసి మరుసటి ఏడాది తిరిగి జట్టులోకి వచ్చారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన మహిళల రోల్‌బాల్ వరల్డ్ కప్ పోటీల్లో ఇషికా సారథ్యంలోని భారత బృందం అద్భుత ప్రతిభ కనబరిచింది. రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ కెన్యాను ఓడించి బంగారు పతకం సాధించింది. 50దేశాల్లో ఈ క్రీడ ఆడుతున్నప్పటికీ మన దేశంలో కొంతమంది మాత్రమే మంచి క్రీడాకారులున్నారని, మరింత మందిని ప్రోత్సాహించేందుకు ప్రయత్నిస్తున్నారు.
-ఈటీవీ భారత్
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
- కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్ అనగానే టాప్ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
- పాక్ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్.. తన చివరి గ్రూప్ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
- ముగింపులో నేపాల్ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
- సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ దిశగా అడుగులేస్తోంది.
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.