Actor Shivaji comment: శివాజీ వ్యాఖ్యలు.. ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా: మంచు మనోజ్‌

Eenadu icon
By Entertainment Team Updated : 23 Dec 2025 16:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లోనే ఉంటుందని నటుడు శివాజీ (Actor Sivaji) చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘దండోరా’ (Dhandoraa) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. నటీమణులు కొంచెం డ్రెస్‌ సెన్స్ పాటించాలని, ఇలా చెబుతున్నందుకు ఏమనుకోవద్దని చెబుతూనే, ప్రతిదానికి ఒక హద్దు ఉండాలన్నారు. స్వేచ్ఛ అనేది అదృష్టమన్న ఆయన దాన్ని కోల్పోవద్దంటూ మాట్లాడారు. శివాజీ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో పలువురు మహిళలు, నటీనటులు తీవ్రంగా స్పందిస్తున్నారు. దుస్తుల పేరుతో మహిళలను ఒక ఛట్రంలో బిగించడం సరైనది కాదని మండిపడుతున్నారు. తాజాగా నటుడు మంచు మనోజ్‌ (Manoj Manchu) ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. శివాజీ పేరు ఎత్తకుండా ఆయన తరఫున మహిళాలోకానికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

  • :అందం డ్రెస్‌లలో ఉంటుంది.. హీరోయిన్‌లపై శివాజీ కామెంట్స్

‘‘ఇలాంటి ప్రకటన చేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. మహిళలు ఫలానా దుస్తులు మాత్రమే వేసుకోవాలి.. నైతికంగా ఇలాగే ఉండాలంటూ ఒక ఛట్రంలో పెట్టడం ఆమోదయోగ్యమైనది కాదు. గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే వస్తుంది. దుస్తులను బట్టి ఎదుటివారిని ఎగతాళి చేయడం ద్వారా రాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయాల మేరకు మహిళలు దుస్తులు వేసుకోరు. మహిళలను వస్తువుల్లా చూస్తూ, అగౌరవ పరిచేలా సీనియర్‌ నటుడి చేసిన వ్యాఖ్యలకు ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా. అయితే, అందరు ఆయనలా మాట్లాడతారని అనుకోవద్దు. మౌనంగా ఇవన్నీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు ఎల్లప్పుడూ గౌరవం, హోదా, సమానత్వం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరం’’అని పేర్కొన్నారు.

ఆయన సలహాలు అవసరం లేదు: గాయని చిన్మయి..

శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఘాటుగా స్పందించారు. ‘అసభ్య పదాలను ఉపయోగిస్తూ తెలుగు నటుడు శివాజీ హీరోయిన్స్‌కు ఉచిత సలహాలు ఇవ్వనవసరం లేదు.  ఆయనేమో జీన్స్, హుడీ వేసుకున్నారు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలి కదా. ఒకవేళ ఆయనకు వివాహమై ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు.

నటి అన‌సూయ కూడా ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెడుతూ.. ‘ఇది మా బాడీ.. మీది కాదు. మాకు నచ్చిన‌ట్లు మేం ఉంటాం’ అని పేర్కొన్నారు. ఓ వస్త్రదుకాణం ఓపెనింగ్‌కు హాజరైన ఆమెను శివాజీ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరగా,  ‘ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఆయన వ్యాఖ్యలు చూస్తే అభద్రతాభావంతో ఉన్నారనిపిస్తోంది. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవాలి. ఆయన అలా మాట్లాడటం దురదృష్టకరం’ అని అభిప్రాయపడ్డారు.

‘దండోరా’ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు నవదీప్‌ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు అగౌరవపరిచేలా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 23 Dec 2025 15:00 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • చిరంజీవి భుజానికి సర్జరీ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
  • నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శలు.. స్పందించిన త్రిష ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షకుడు విజయ్‌ (Vijay)ను విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన విమర్శలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అల్లు వారి పెళ్లిసందడి.. తొలి శుభలేఖ చిరంజీవికే.. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పెళ్లి పిలుపులు షురూ చేశారు.
  • బుచ్చిబాబుకు చరణ్‌ విషెస్‌.. ఫొటో పంచుకున్న హీరో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్‌చరణ్‌ విషెస్‌ తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.
  • ‘ధురంధర్‌’లో విలన్‌ రోల్‌ మిస్సయారా?.. నాగార్జున క్లారిటీ..! కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు నాగార్జున (Nagarjuna). ఇటీవల ‘కూలీ’లో ప్రతినాయకుడు సిమన్‌ పాత్రలో నటించి మెప్పించారు.
  • నేను ‘సాగర సంగమం’ తీశానని చెప్పలేదుగా: నాగవంశీ తాను నిర్మించిన కొత్త సినిమా ‘ఫంకీ’ ఫలితంపై నాగవంశీ స్పందించారు.
  • రూ.120 కోట్లకు ‘టాక్సిక్‌’ మూవీ హక్కులు: దిల్‌ రాజు ఏమన్నారంటే? ‘టాక్సిక్‌’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్‌ రాజు స్పందించారు.
  • మిమ్మల్ని కూడా హగ్‌ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్‌ ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు.
  • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. నామినేషన్స్‌ జాబితా ఇదే! ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్‌’. 
  • అప్పుడు నిరుత్సాహంలో ఉన్నా.. క్లిష్ట సమయంలో ‘ఫంకీ’: విశ్వక్‌సేన్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఫంకీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు.
  • అర్జున్‌ ఉదారత.. ఈ రియల్‌ హీరోలకు సన్మానం.. రూ.లక్ష కానుక ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun Sarja) మంచి మనసు చాటుకున్నారు.
  • అల్లు అర్జున్‌తో యాడ్‌ షూట్‌.. ఆ నిబంధనలు పాటించాలట! ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటారు సినీ నటులు.
  • విజయ్‌ దేవరకొండ పెళ్లికి వెళుతున్నారా?: తరుణ్‌ భాస్కర్‌ ఏమన్నారంటే విజయ్‌ దేవరకొండ పెళ్లిపై ప్రశ్న ఎదురవగా దర్శక, నటుడు తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు.
  • ‘దృశ్యం 3’ క్లైమాక్స్‌.. ప్రతి ఒక్కరూ షాక్‌ అవ్వాల్సిందేనట! ‘దృశ్యం’ క్లైమాక్స్‌ ట్విస్ట్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ ట్విస్ట్‌ గురించి అయితే మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.
  • ‘రామాయణ’లో విక్రాంత్‌ మాస్సే?.. నటుడి రియాక్షన్‌ ఇదీ ‘రామాయణ’లో తాను భాగమైనట్లు వచ్చిన రూమర్స్‌పై నటుడు విక్రాంత్‌ మాస్సే స్పందించారు.
  • రాజమౌళి మరో ట్విస్ట్‌.. ‘వారణాసి’ మొత్తం ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదట! ‘వారణాసి’ (Varanasi) మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.
  • సినిమా టికెట్లు.. అలా మోసపోయా: విశ్వక్‌సేన్‌ ‘ఫంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్‌సేన్‌. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వులు పంచారు.
  • నా భార్య ఇంటి నుంచి గెంటేసింది: సరదా విషయం పంచుకున్న మాధవన్‌ కొవిడ్‌ సమయంలో తన ఇంట్లో జరిగిన ఒక విషయాన్ని నటుడు మాధవన్‌ తాజాగా గుర్తుచేసుకున్నారు.
  • ఉగాదికి గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానం: భట్టి విక్రమార్క తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల కమిటీతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) బుధవారం భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు.
  • అల్లు అర్జున్‌- అట్లీ మూవీలో నటిస్తున్నారా?: మృణాల్‌ ఠాకూర్‌ ఏమన్నారంటే.. అల్లు అర్జున్‌- అట్లీ కాంబో మూవీలో మృణాల్‌ నటిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. దానిపై నటి స్పందించారు.