Actor Shivaji comment: శివాజీ వ్యాఖ్యలు.. ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా: మంచు మనోజ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లోనే ఉంటుందని నటుడు శివాజీ (Actor Sivaji) చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘దండోరా’ (Dhandoraa) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. నటీమణులు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలని, ఇలా చెబుతున్నందుకు ఏమనుకోవద్దని చెబుతూనే, ప్రతిదానికి ఒక హద్దు ఉండాలన్నారు. స్వేచ్ఛ అనేది అదృష్టమన్న ఆయన దాన్ని కోల్పోవద్దంటూ మాట్లాడారు. శివాజీ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో పలువురు మహిళలు, నటీనటులు తీవ్రంగా స్పందిస్తున్నారు. దుస్తుల పేరుతో మహిళలను ఒక ఛట్రంలో బిగించడం సరైనది కాదని మండిపడుతున్నారు. తాజాగా నటుడు మంచు మనోజ్ (Manoj Manchu) ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. శివాజీ పేరు ఎత్తకుండా ఆయన తరఫున మహిళాలోకానికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
- :అందం డ్రెస్‌లలో ఉంటుంది.. హీరోయిన్‌లపై శివాజీ కామెంట్స్
‘‘ఇలాంటి ప్రకటన చేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. మహిళలు ఫలానా దుస్తులు మాత్రమే వేసుకోవాలి.. నైతికంగా ఇలాగే ఉండాలంటూ ఒక ఛట్రంలో పెట్టడం ఆమోదయోగ్యమైనది కాదు. గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే వస్తుంది. దుస్తులను బట్టి ఎదుటివారిని ఎగతాళి చేయడం ద్వారా రాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయాల మేరకు మహిళలు దుస్తులు వేసుకోరు. మహిళలను వస్తువుల్లా చూస్తూ, అగౌరవ పరిచేలా సీనియర్ నటుడి చేసిన వ్యాఖ్యలకు ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా. అయితే, అందరు ఆయనలా మాట్లాడతారని అనుకోవద్దు. మౌనంగా ఇవన్నీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు ఎల్లప్పుడూ గౌరవం, హోదా, సమానత్వం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరం’’అని పేర్కొన్నారు.
ఆయన సలహాలు అవసరం లేదు: గాయని చిన్మయి..
శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఘాటుగా స్పందించారు. ‘అసభ్య పదాలను ఉపయోగిస్తూ తెలుగు నటుడు శివాజీ హీరోయిన్స్‌కు ఉచిత సలహాలు ఇవ్వనవసరం లేదు. ఆయనేమో జీన్స్, హుడీ వేసుకున్నారు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలి కదా. ఒకవేళ ఆయనకు వివాహమై ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు.
నటి అనసూయ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ.. ‘ఇది మా బాడీ.. మీది కాదు. మాకు నచ్చినట్లు మేం ఉంటాం’ అని పేర్కొన్నారు. ఓ వస్త్రదుకాణం ఓపెనింగ్‌కు హాజరైన ఆమెను శివాజీ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరగా, ‘ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఆయన వ్యాఖ్యలు చూస్తే అభద్రతాభావంతో ఉన్నారనిపిస్తోంది. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవాలి. ఆయన అలా మాట్లాడటం దురదృష్టకరం’ అని అభిప్రాయపడ్డారు.
‘దండోరా’ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు నవదీప్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు అగౌరవపరిచేలా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 23 Dec 2025 15:00 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చిరంజీవి భుజానికి సర్జరీ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
- నయినార్ నాగేంద్రన్ విమర్శలు.. స్పందించిన త్రిష ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షకుడు విజయ్ (Vijay)ను విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన విమర్శలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
- అల్లు వారి పెళ్లిసందడి.. తొలి శుభలేఖ చిరంజీవికే.. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పెళ్లి పిలుపులు షురూ చేశారు.
- బుచ్చిబాబుకు చరణ్ విషెస్.. ఫొటో పంచుకున్న హీరో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్‌చరణ్ విషెస్ తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.
- ‘ధురంధర్’లో విలన్ రోల్ మిస్సయారా?.. నాగార్జున క్లారిటీ..! కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు నాగార్జున (Nagarjuna). ఇటీవల ‘కూలీ’లో ప్రతినాయకుడు సిమన్ పాత్రలో నటించి మెప్పించారు.
- నేను ‘సాగర సంగమం’ తీశానని చెప్పలేదుగా: నాగవంశీ తాను నిర్మించిన కొత్త సినిమా ‘ఫంకీ’ ఫలితంపై నాగవంశీ స్పందించారు.
- రూ.120 కోట్లకు ‘టాక్సిక్’ మూవీ హక్కులు: దిల్ రాజు ఏమన్నారంటే? ‘టాక్సిక్’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్ రాజు స్పందించారు.
- మిమ్మల్ని కూడా హగ్ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్ ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు.
- ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. నామినేషన్స్ జాబితా ఇదే! ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్’.
- అప్పుడు నిరుత్సాహంలో ఉన్నా.. క్లిష్ట సమయంలో ‘ఫంకీ’: విశ్వక్‌సేన్ విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు.
- అర్జున్ ఉదారత.. ఈ రియల్ హీరోలకు సన్మానం.. రూ.లక్ష కానుక ప్రముఖ నటుడు అర్జున్ (Arjun Sarja) మంచి మనసు చాటుకున్నారు.
- అల్లు అర్జున్‌తో యాడ్ షూట్.. ఆ నిబంధనలు పాటించాలట! ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటారు సినీ నటులు.
- విజయ్ దేవరకొండ పెళ్లికి వెళుతున్నారా?: తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే విజయ్ దేవరకొండ పెళ్లిపై ప్రశ్న ఎదురవగా దర్శక, నటుడు తరుణ్ భాస్కర్ స్పందించారు.
- ‘దృశ్యం 3’ క్లైమాక్స్.. ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందేనట! ‘దృశ్యం’ క్లైమాక్స్ ట్విస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ ట్విస్ట్ గురించి అయితే మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.
- ‘రామాయణ’లో విక్రాంత్ మాస్సే?.. నటుడి రియాక్షన్ ఇదీ ‘రామాయణ’లో తాను భాగమైనట్లు వచ్చిన రూమర్స్‌పై నటుడు విక్రాంత్ మాస్సే స్పందించారు.
- రాజమౌళి మరో ట్విస్ట్.. ‘వారణాసి’ మొత్తం ఐమ్యాక్స్ ఫార్మాట్ కాదట! ‘వారణాసి’ (Varanasi) మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
- సినిమా టికెట్లు.. అలా మోసపోయా: విశ్వక్‌సేన్ ‘ఫంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్‌సేన్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వులు పంచారు.
- నా భార్య ఇంటి నుంచి గెంటేసింది: సరదా విషయం పంచుకున్న మాధవన్ కొవిడ్ సమయంలో తన ఇంట్లో జరిగిన ఒక విషయాన్ని నటుడు మాధవన్ తాజాగా గుర్తుచేసుకున్నారు.
- ఉగాదికి గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం: భట్టి విక్రమార్క తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కమిటీతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) బుధవారం భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు.
- అల్లు అర్జున్- అట్లీ మూవీలో నటిస్తున్నారా?: మృణాల్ ఠాకూర్ ఏమన్నారంటే.. అల్లు అర్జున్- అట్లీ కాంబో మూవీలో మృణాల్ నటిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. దానిపై నటి స్పందించారు.
English Translation
Actor Shivaji comment: Shivaji comments.. I apologize on his behalf: Manchu Manoj

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: Beauty of heroines Actor Sivaji's comments that it is in the dress that he wears are causing a stir on the social media platform. Speaking at the pre-release event of 'Dhandoraa' in which he played the lead role, he said that actresses should have a bit of dress sense and don't think anything for saying this, there should be a limit for everything. Freedom is a fortune, he said, don't lose it. As Shivaji's comments went viral on social media, many women and actors reacted strongly. In the name of dress, it is not right to lock women in a chhattra. Recently, actor Manoj Manchu (Manoj Manchu) posted as an X platform. He stated that he is apologizing to the women's world on his behalf without mentioning Shivaji's name.
- : Beauty lies in dresses.. Shivaji's comments on heroines
''Making such a statement is deeply disappointing. Women should only wear certain clothes. It is not acceptable to put them in a box to be morally like this. Respect and accountability come only through personal conduct. It doesn't come from making fun of others because of their clothes. Making such comments is also a violation of constitutional rights. Equality, respect and personal freedom are not up for debate. Women don't dress according to public opinion. I apologize on behalf of the senior actor for his comments regarding women as objects and disrespecting them. However, don't think that everyone talks like him. There is no need to ignore all this in silence. Women should always be given respect, status and equality. Accountability is needed in such matters.
His advice is not needed: Gayani Chinmayi..
Gayani Chinmayi reacted strongly to Shivaji's comments. There is no need for Telugu actor Shivaji to give free advice to heroines by using vulgar words. He is wearing jeans and hoodie. And according to what he said, should we follow the Indian tradition by tying a dhoti? If he is married, he should also put a blob and a ladder. It is understood how real women are seen here.
Actress Anasuya also posted on the X platform.. 'This is our body.. not yours. We will be as we like. When reporters asked her to respond to Shivaji's comments while attending the opening of a clothing store, she said, 'Anyone can wear whatever they like. Looking at his comments, it seems that he is insecure. That is why such words are spoken. What if we all just listen to what he says? Food and clothes should be what we like. Wear comfortable clothes. He opined that it is unfortunate that he spoke like that.
Actor Navdeep, who participated in the 'Dandora' event, also denied these comments. "The comments made at the event were disrespectful. Expressing opinion with such comments is not acceptable.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 23 Dec 2025 15:00 IST
Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Chiranjeevi's shoulder surgery..Posted as recovering Top hero Chiranjeevi underwent shoulder surgery. He is currently recovering.
- Nainar Nagendran's criticism.. Trisha responded It is known that BJP state president Nainar Nagendran's criticism of famous actor and TVK president Vijay has become a topic of discussion.
- Allu's wedding buzz.. First good letter to Chiranjeevi.. Allu's house has started a wedding buzz. The work related to this has been expedited. In this order, the marriage calls have started.
- Charan wishes for Buchibabu.. the hero shared the photo. Hero Ram Charan wishes to director Buchi Babu. He shared a picture with him.
- Did he miss the villain role in 'Dhurandhar'?.. Nagarjuna Clarity..! Nagarjuna shines not only as the protagonist but also in special roles. Recently, he played the role of the villain Simman in 'Coolie'. Nagavanshi reacts to the result of his new movie 'Funky'.
- Rs 120 Crores 'Toxic' Movie Rights: What is Dil Raju? When asked about the rights of the movie 'Toxic', producer Dil Raju responded. Senior actor Naresh said that after an affair recently, all women are seen in sarees at film festivals.
- Filmfare Awards. Filmfare is an awards ceremony that is eagerly awaited by the audience as well as movie stars.
- Despite being depressed.. 'Funky' in difficult times: Vishwaksen Vishwaksen's latest movie is 'Funky'. The pre-release event of this movie was held in Khammam.
- Arjun's generosity.. a tribute to these real heroes.. a gift of Rs. Famous actor Arjun (Arjun Sarja) showed a good heart.
- Ad shoot with Allu Arjun.. those rules must be followed! Film actors act as promoters of various products while making films on the one hand.
- Is Vijay Devarakonda going to get married?: What does Tarun Bhaskar think? Director and actor Tarun Bhaskar responded to a question about Vijay Devarakonda's marriage. Everyone was surprised by the climax twist of 'Drisham'. There is no need to say about the twist of 'Drisham 2' which came as a continuation.
- Vikrant Massey in 'Ramayana'?.. This is the actor's reaction. Actor Vikrant Massey has responded to the rumors that he is a part of 'Ramayana'.
- Rajamouli's another twist.. 'Varanasi' is not the entire IMAX format! Director S.S.Rajamouli said that the entire movie 'Varanasi' will not be in true IMAX format, only the key scenes will be enjoyed. Vishwaksen is ready to make noise with 'Funky'. Laughter was spread by recalling the memories of the movie promotions.
- My wife ran out of the house: Madhavan shared a funny story. Actor Madhavan recently recalled something that happened in his home during Covid.
- Gaddar Film Awards for Ugadi: Bhatti Vikramarka Deputy Chief Minister Mallu Bhatti Vikramarka met the Telangana Gaddar Film Awards Committee on Wednesday. Many issues were discussed with them.
- Are you acting in Allu Arjun- Atlee movie?: What is Mrinal Thakur?.. There was a campaign that Mrinal is acting in Allu Arjun-Atlee combo movie. The actress responded to it.