Fake Websites: నకిలీ వెబ్‌సైట్ల వలలో పడొద్దు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ అధునాతనంగా మారుతున్నాయి. ఇలాంటి స్థితిలో నకిలీ వెబ్‌సైట్లను గుర్తించటం కీలకంగా మారింది. నేరగాళ్లు అధీకృతమైనవిగానే కనిపించే వెబ్‌సైట్లను సృష్టించి, వినియోగదారులను బోల్తా కొట్టిస్తుంటారు. వీటితో వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌ల వంటి వాటిని దొంగిలిస్తుంటారు. అందువల్ల అప్రమత్తంగా ఉండటం, నకిలీ వెబ్‌సైట్లను గుర్తించటం అవసరం. వీటిని పట్టుకోవటానికి కొన్ని హెచ్చరిక సంకేతాలు తోడ్పడతాయి.
డొమైన్ పేరులో తేడాలు:నేరగాళ్లు చాలావరకూ ప్రముఖ కంపెనీలకు చెందిన వెబ్‌సైట్ల నకిలీలు సృష్టిస్తుంటారు. అక్షర క్రమంలో మార్పులతో బురిడీ కొట్టించాలని ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు- ఫ్లిప్‌కార్ట్.కామ్ బదులు ఫ్లిప్‌కార్ట్‌ఆఫర్స్.ఇన్ అని మార్చొచ్చు. అమెజాన్.ఇన్‌లో ఓ అక్షరాన్ని సున్నాగా పేర్కొనొచ్చు. ఇలా డొమైన్ పేర్లలో వెంటనే పోల్చుకోలేని విధంగా చిన్న చిన్న మార్పులు చేస్తుంటారు. నిశితంగా చూస్తే తప్ప ఇది తెలియదు. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు వెబ్‌సైట్ల పేర్లను తనిఖీ చేసుకోవాలి.
కంటెంట్‌లో అక్షర దోషాలు:ప్రముఖ కంపెనీలు తమ వెబ్‌సైట్లలో కంటెంట్, డిజైనింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. అక్షరదోషాలేవీ లేకుండా జాగ్రత్త పడతాయి. అందువల్ల కంటెంట్‌లో ఎక్కువగా అక్షరదోషాలు, సరిగాలేని వాక్యాలు, నాసికరం గ్రాఫిక్స్ కనిపిస్తే నకిలీ వెబ్‌సైట్ కావొచ్చని అనుమానించాలి. తొందర తొందరగా వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసినప్పుడు, కంటెంట్‌ను సరిగా చెక్ చేయనప్పుడు ఇలాంటి తప్పులు దొర్లుతుంటాయి.
కాంటాక్ట్ సమాచారం ఇవ్వకపోవటం:విశ్వసనీయమైన వెబ్‌సైట్లలో అబౌట్ అజ్ పేజీ లేదా కాంటాక్ట్ సమాచారం ఉంటుంది. నకిలీ వెబ్‌సైట్లలో ఇది ఉండదు. నేరగాళ్లు కావాలనే ఇలా సృష్టిస్తుంటారు. వెబ్‌సైట్‌లో కంపెనీకి సంబంధించిన సమాచారం కనిపించకపోతే మోసం చేయటానికి ఉద్దేశించింది కావొచ్చని అనుమానించాలి. అలాగే ఆఫీసు చిరునామా, కస్టమర్ కేర్ నంబర్, జీమెయిల్ వంటి ఉచిత ఈమెయిల్ ఐడీ వంటివి పేర్కొనకపోయినా సందేహించాల్సిందే.
సెక్యూర్ కనెక్షన్ లేకపోవటం:అటాకర్ల దాడుల నుంచి కాపాడటానికి వెబ్‌సైట్లు టీఎల్‌ఎస్/ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికెట్లను ఉపయోగిస్తాయి. మీ పరికరం, సైట్ మధ్య డేటా మార్పిడిని ఇవి ఎన్‌క్రిప్ట్ చేస్తాయి. ఈ సర్టిఫికెట్లలో డొమైన్, ఆర్గనైజేషన్, ఎక్స్‌టెండెట్ వ్యాలిడేషన్ అని మూడు రకాలుంటాయి. నేరగాళ్లు చాలావరకూ డొమైన్ వ్యాలిడేషన్ సర్టిఫికెట్లను వాడుకుంటారు. ఈ సర్టిఫికెట్ డొమైన్ యాజమాన్యాన్ని ధ్రువీకరిస్తుంది గానీ సంస్థ వివరాలను ధ్రువీకరించదు. వాణిజ్య అవసరాలకు ఇది తగదు. కాబట్టి యూఆర్‌ఎల్‌కు ముందు https://ఉందేమో చూసుకోవాలి. ఇది కనెక్షన్ సురక్షితమని తెలియజేస్తుంది. కేవలం httpమాత్రమే ఉన్నట్టయితే సురక్షితం కాదని తెలుసుకోవాలి.
నమ్మశక్యం కాని ఆఫర్లు:ప్రముఖ కంపెనీల వస్తువులు అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పటమూ హెచ్చరిక సంకేతమే. యూజర్లు త్వరగా పేమెంట్ పూర్తిచేయటం కోసం నేరగాళ్లు ఇలాంటి పన్నాగం పన్నుతుంటారు. కాబట్టి నమ్మశక్యం కాని ధరలకు వస్తువులు దొరుకుతున్నాయంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.
పురికొల్పే సందేశాలు:‘కేవలం ఒక వస్తువే ఉంది. త్వరపడండి’ అంటూ ఊరించటం ద్వారానూ మోసగాళ్లు బురిడీ కొట్టించొచ్చు. లేదా కౌంట్‌డౌన్ టైమర్లతో కొనేలా పురికొల్పొచ్చు. పేజీని రిఫ్రెష్ చేసిన ప్రతిసారీ ఇది రీసెట్ అవుతుంటుంది. ఆఫర్ నిజమైందో కాదో ధ్రువీకరించుకోకుండా వెంటనే నిర్ణయం తీసుకునేలా చేయటం వీటి ఉద్దేశం. ఇలాంటి అనుచిత సందేశాలు వెబ్‌సైట్లో కనిపిస్తే నకిలీది కావొచ్చని అనుమానించాలి.
► Read latest Technology Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 00:50 ISTEnglish Translation
Fake Websites: Don't fall into the trap of fake websites

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Online frauds are becoming sophisticated day by day. In such a situation, identifying fake websites becomes crucial. Criminals create websites that look legitimate and trick users. These steal personal information, bank details, passwords etc. Hence it is necessary to be vigilant and identify fake websites. Some warning signs can help to catch these.
Differences in domain name:Criminals often create duplicates of websites belonging to well-known companies. They try to confuse with changes in alphabetical order. For example – flipkart.com can be changed to flipkartoffers.in. A character can be specified as zero in Amazon.in. In this way, small changes are made in the domain names so that they cannot be compared immediately. It is not known unless one looks closely. So check the names of the websites once or twice while doing online shopping.
Spelling errors in content:Leading companies pay special attention to the content and designing of their websites. Care should be taken to avoid typos. Therefore, if you see a lot of typos, incorrect sentences, and poor graphics in the content, you should suspect that it is a fake website. Mistakes like this happen when a website is created in haste and the content is not properly checked.
Not providing contact information:Reliable websites have an about us page or contact information. Fake websites do not have this. Criminals create like this. If the information about the company does not appear on the website, it should be suspected that there is an intention to defraud. Also, if the office address, customer care number, free email ID like Gmail is not mentioned, it should be doubted.
Lack of secure connection:Websites use TLS/SSL certificates to protect against attacks by attackers. They encrypt the data exchange between your device and the site. These certificates are of three types namely Domain, Organization and Extended Validation. Criminals often use domain validation certificates. This certificate verifies the ownership of the domain but not the organization details. It is not suitable for commercial purposes. So make sure the URL is preceded by https://. This indicates that the connection is secure. Be aware that only http is not secure.
Unbelievable offers:It is a warning sign that famous companies offer products at very low prices. Criminals use this scheme to get users to complete the payment quickly. So you have to think twice if you are getting items at unbelievable prices.
Pushing messages:'There is only one thing. Fraudsters can cheat by saying 'Hurry up'. Or push to buy with countdown timers. It is reset every time the page is refreshed. Their purpose is to make an immediate decision without confirming whether the offer is genuine or not. If such inappropriate messages are found on the website, it should be suspected that it is fake.
► Read latest Technology Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 00:50 IST