Year of AI: ఏఐ నామ సంవత్సరమే!

Eenadu icon
By Technology News Team Published : 24 Dec 2025 01:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

సాంకేతికపరంగా చూస్తే 2025 ఏఐ నామ సంవత్సరమే. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వినూత్న ఏఐ మోడళ్ల రూపకల్పన పుంజుకుంది. ఏజెంటిక్‌ ఏఐ విస్తృతమైంది. మల్టీమోడల్, రీజనింగ్‌ సామర్థ్యాలు గణనీయంగా మెరుగ య్యాయి. పరిశ్రమలు సైతం పెద్ద పెద్ద భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి. సమ్మిళిత ఏఐ గొప్ప విజయాలు సాధించింది. మనిషిని పోలిన హ్యూమనాయిడ్‌ రోబోలు క్లిష్టమైన పనులనూ చేయగల స్థాయికి చేరుకోవటమే దీనికి నిదర్శనం. భవిష్యత్‌ ఏఐ కాలానికి దిశా నిర్దేశం చేసిన ఈ ఏడాదికి కొద్దిరోజుల్లో గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో కొన్ని మైలురాళ్లు ఇవిగో..

ఫొటోనిక్‌ ఏఐ చిప్‌

ఏఐ రంగంలో ఖర్చును తగ్గించే విషయంలోనూ 2025 కొత్త దారిని చూపించింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లొరిడాకు చెందిన సెమీకండక్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన కొత్తరకం ఫొటోనిక్‌ ఏఐ చిప్‌ దీనికి ఒక ఉదాహరణ. డేటా ప్రాసెసింగ్‌ కోసం విద్యుత్తుకు బదులు కాంతిని వాడుకోవటం దీని ప్రత్యేకత. మరోవైపు చైనాకు చెందిన డీప్‌సీక్‌ చవక ఆర్‌1 వర్షన్‌ ఏఐ మోడల్‌ను తీసుకొచ్చింది. అమెరికా కంపెనీలతో పోలిస్తే 70% తక్కువ ఖర్చుతోనే దీనికి శిక్షణ ఇచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. 

గ్రాక్‌ అద్భుతం

జెమినైని అధునాతనంగా తీర్చిదిద్దే క్రమంలోనే గూగుల్‌ నవంబరులో ప్రొ, డీప్‌ థింక్‌ వర్షన్లతో జెమినై 3ని ఆవిష్కరించింది. అడ్వాన్స్‌డ్‌ రీజనింగ్‌ దీని ప్రత్యేకత. అనంతరం కొద్ది రోజులకే ఇలాన్‌ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ మరో అడుగు ముందుకేసి గ్రాక్‌ అనే ఏఐ బాట్‌ను పరిచయం చేసింది. దీన్ని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లోనూ సమ్మిళితం చేయటం విశేషం. ట్వీట్ల మతలబులను అప్పటికప్పుడు తెలుసుకోవటానికి ఇప్పుడు యూజర్లు ఎక్కువగా దీన్నే ఆశ్రయిస్తున్నారు. సమాచారాన్ని విడమరచి చెప్పటంలో ఇది అద్భుతః అనిపిస్తోంది. ఇమేజ్‌లు, పొట్టి వీడియోలనూ సృష్టిస్తోంది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ తమ రీలవెంట్‌ కార్యక్రమంలో కొత్త నోవా 2.0 మోడల్‌ను పరిచయం చేసింది. ఇది టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, డాక్యుమెంట్స్, స్పీచ్‌లను ప్రాసెస్‌ చేయగల మల్టీమోడల్‌ ఫౌండేషన్‌ మోడల్స్‌ వేదిక. 

డీప్‌సీక్‌ సంచలనంతో ఆరంభం

ఏడాది మొదట్లో జనవరిలోనే చైనాకు చెందిన డీప్‌సీక్‌ సంచలనం సృష్టించింది. డీప్‌సీక్‌-ఆర్‌1 అనే లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఏఐ రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. గొలుసుకట్టు థాట్‌ రీజనింగ్‌ మీద దృష్టి సారించిన దీనికి అతి తక్కువ ఖర్చుతోనే శిక్షణ ఇవ్వటం గమనార్హం. మిస్ట్రల్‌ ఏఐ ఫిబ్రవరిలో తీసుకొచ్చిన లీ చాట్‌ తక్కువదేమీ కాదు. హై స్పీడ్‌ అసిస్టెంట్‌ అయిన ఇది సెకండుకు వెయ్యి పదాల వరకూ అవుట్‌పుట్‌ ఇస్తుంది. అదే నెలలో పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్‌ శిఖరాగ్ర సదస్సులో 100కు పైగా దేశాలకు చెందిన విధానకర్తలు ఏఐ అంశాలపై చర్చించారు. దీనికి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్, మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహ అధ్యక్షత వహించారు. ప్రభుత్వాలు ఏఐ మీద నిశితంగా దృష్టి సారిస్తున్నాయనే సంగతిని ఇది ఘనంగా చాటిచెప్పింది.

జెమినై రోబోటిక్స్, మనుస్‌ ఏఐ అసిస్టెంట్‌

మనుషులు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం లేకుండా నిత్య జీవితంలో ఉపయోగపడే పనులను నిర్వహించటం సాధ్యమేనని మార్చిలో ఆవిష్కృతమైన అటనమస్‌ ఏఐ ఏజెంట్‌ ‘మనుస్‌’ నిరూపించింది. మరోవైపు గూగుల్‌ డీప్‌మైండ్, యాప్‌ట్రానిక్‌ సంయుక్తంగా జెమినై రోబోటిక్స్‌ను పరిచయం చేశాయి. ఇదో విజన్‌ లాంగ్వేజ్‌ మోడల్‌. రోబోలకు తమ చుట్టుపక్కల ప్రపంచాన్ని అర్థం చేసుకొని, మసలుకోవటానికిది తోడ్పడుతుంది. మనిషి మెదడును అనుకరించగల ‘సూపర్‌ ట్యూరింగ్‌ ఏఐ’ పరిశోధన గొప్ప పురోగతి సాధించింది. యూసీఎల్‌ఏ, టెక్సాస్‌ ఏఅండ్‌ఎం, పలు సంస్థల భాగస్వామ్యంతో రూపొందించిన ఏఐ చిప్‌ స్వల్ప విద్యుత్తుతోనే అప్పటికప్పుడు తనకుతాను నేర్చుకోగలదు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా పనులు చేయటానికి తోడ్పడగలదు.

జీపీటీ 5, జెమినై ఫ్లాష్‌ మోడళ్లు

ఆంత్రోపోనిక్‌ మేలో అటనమస్, బహుళ అంచెల పనుల కోసం క్లాడ్‌ 4 మోడల్‌ను తీసుకొచ్చింది. దీన్ని మరింత మెరుగుపరచే ఓపస్‌ 4, సానెట్‌ 4 వర్షన్లనూ పరిచయం చేసింది. ఇక గూగుల్‌ సంస్థ జూన్‌లో మెరుగు పరచిన జెమినై 2.5 ప్రొ, ఫ్లాష్‌ మోడళ్లను తీసుకొచ్చింది. అధునాతన రీజనింగ్, మల్టీమోడల్‌ సామర్థ్యాలు వీటి సొంతం. ఇవి ప్రయోగాత్మక డీప్‌ థింక్‌ వంటి మోడళ్లకు దన్నుగా నిలిచాయి. రీజనింగ్, మల్టీమోడల్‌ అవగాహనను మెరుగుపరచే ఉద్దేశంతో ఓపెన్‌ఏఐ ఆగస్టులో భారీ మోడల్‌ జీపీటీ-5ని ఆవిష్కరించింది. కాకపోతే ఇది యూజర్ల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొంది.

ఓపెన్‌ఏఐతో డిస్నీ జట్టు

ఓపెన్‌ఏఐ డిసెంబరులో అధునాతన రీజనింగ్, కోడింగ్, లాంగ్‌ కాంటెక్స్ట్‌ సామర్థ్యాలతో కూడిన జీపీటీ 5.2 మోడల్‌ను పరిచయం చేసింది. ఇదే నెలలో ఓపెన్‌ఏఐ, వాల్ట్‌ డిస్నీ కంపెనీలు మూడేళ్ల భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఓపెన్‌ఏఐకి చెందిన సోరా ద్వారా జనరేటివ్‌ వీడియోలను సృష్టించటానికి 200కు పైగా డీస్నీ పాత్రలను వాడుకోవటం దీని ఉద్దేశం. 

ఫిజికల్‌ ఏఐ మహత్తు

కృత్రిమ మేధ మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లను దాటుకొని భౌతిక రూపం ధరిస్తోంది. రోబోలకు ఆలోచన, వివేచన శక్తిని ప్రసాదిస్తోంది. అదే ఫిజికల్‌ ఏఐ. ఏవో కొన్ని కమాండ్ల మేరకు నడచుకోవటం కాకుండా మనుషుల్లా ఆలోచించి, నడచుకోగల హ్యూమనాయిడ్‌ రోబోలకు ప్రాణం పోస్తోంది. టెస్లా రూపొందిస్తోన్న ఆప్టిమస్‌ రోబోలు ప్రయోగాత్మక ఉత్పత్తి దశకు చేరుకున్నాయి. ఎన్‌విడియాకు చెందిన ఓమ్నివర్స్, ఫిజికల్‌ ఏఐ ఫ్రేమ్‌వర్క్స్‌ వివిధ రంగాల్లో రోబోల రూపకల్పనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఫిజికల్‌ఏజెంట్, ఎనెర్‌వర్స్‌ వంటి ఏజెంట్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ అయితే రోబోలకు ఏఐ మోడళ్లను సమ్మిళితం చేస్తున్నాయి. కమాండ్స్‌ను అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవటానికివి తోడ్పడుతున్నాయి.


జెమినై 3:గూగుల్‌ తాజా ఏఐ మోడల్‌. సృజనాత్మక రచన, సమస్యల పరిష్కారం, ప్రత్యక్ష రీజనింగ్‌లో దిట్ట.

నానో బనానా:సమగ్ర ఏఐ ఆధారిత పర్సనల్‌ అసిస్టెంట్‌. రోజువారీ డిజిటల్‌ పనులకు తోడు.

ఓపెన్‌ఏఐ అట్లాస్‌:ఏఐ ఆధారిత వెబ్‌ బ్రౌజర్‌. బిల్టిన్‌గా చాట్‌జీపీటీ సామర్థ్యాలు సొంతం.

అడోబ్‌ మ్యాక్స్‌ ఏఐ సూట్‌:ఏఐ సామర్థ్యాలతో కూడిన సృజనాత్మక టూల్స్‌ బుట్ట.

వియో 3:టెక్స్ట్‌ ప్రాంప్ట్‌లతో వీడియోలుగా మలచే మోడల్‌. వాటికి డైలాగ్స్, సౌండ్‌ ఎఫెక్ట్స్, సంగీతాన్నీ జోడిస్తుంది.

చాట్‌జీపీటీ 5.2:ఓపెన్‌ఏఐ చాట్‌బాట్‌ తాజా వర్షన్‌. ప్రొఫెషనల్, సంక్లిష్ట నాలెడ్జ్‌ పనులకు ప్రత్యేకం.

పర్‌ప్లెక్సిటీ కామెట్‌:పర్సనల్‌ ఏజెంట్‌లాంటి ఏఐ ఆధారిత వెబ్‌ బ్రౌజర్‌. టాస్కులను ఆటోమేట్‌ చేయటం, కంటెంట్‌ సారాంశాన్ని గుదిగుచ్చటం వంటి పనులను తేలికగా చేసేస్తుంది.

ఫ్లో:గూగుల్‌ రూపొందించిన అధునాతన ఫిల్మ్‌ మేకింగ్‌ టూల్‌. టెక్స్ట్‌ ప్రాంప్ట్స్, ఇమేజెస్‌ నుంచి వీడియో క్లిప్స్, సీన్స్, స్టోరీలను జనరేట్‌ చేస్తుంది. 

► Read latest Technology Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Year of AI: AI is the name of the year!

Eenadu icon
By Technology News Team Published : 24 Dec 2025 01:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

Technically speaking 2025 AI Name year There is no exaggeration in this. The design of innovative AI models is booming. Agentic AI is widespread. Multimodal and reasoning capabilities are significantly improved. Industries have also entered into big partnerships. Blended AI has made great strides. This is evidenced by the fact that humanoid robots are able to perform complex tasks. Here are some milestones in the background of saying goodbye to this year that set the direction for the future AI era in a few days..

Photonic AI Chip

2025 has also shown a new way in terms of cost reduction in the field of AI. An example of this is a new type of photonic AI chip developed by the Semiconductor Institute of the University of Florida. Its specialty is that it uses light instead of electricity for data processing. On the other hand DeepSeek from China has brought a cheap R1 version AI model. The company has announced that it has been trained at 70% less cost compared to American companies. 

Grac Awesome

In order to upgrade Gemini, Google launched Gemini 3 in November with Pro and Deep Think versions. Advanced reasoning is its specialty. A few days later, Elon Musk's XAI went one step further and introduced an AI bot called Grac. It is remarkable that it has been integrated into the social media platform X. Now users are increasingly resorting to it to know the status of tweets from time to time. It seems amazing to leave out information. Creating images and short videos. Amazon Web Services has introduced the new Nova 2.0 model in its Relavent program. It is a multimodal foundational models platform that can process text, images, videos, documents, and speech. 

Beginning with deepseek sensation

At the beginning of the year, China's deepseek created a sensation in January. A large language model (LLM) named DeepSeq-R1 has shaken the AI ​​field. It is noteworthy that it focuses on chain thought reasoning and provides training at a very low cost. Mistral AI brought LeChat in February is no less. Being a high speed assistant, it can output up to a thousand words per second. At the AI ​​Action Summit held in Paris in the same month, policymakers from more than 100 countries discussed AI issues. French President Macron and our Prime Minister Narendra Modi co-chaired it. It proudly shows that governments are paying close attention to AI.

Gemini Robotics, Manus AI Assistant

Manus, an autonomous AI agent discovered in March, proved that it is possible to carry out useful tasks in daily life without the need for constant human supervision. On the other hand, Google DeepMind and Apptronic jointly introduced Gemini Robotics. This is the vision language model. It helps robots understand and sense the world around them. Research on 'Super Turing AI' that can mimic the human brain has made great progress. The AI ​​chip, developed in partnership with UCLA, Texas A&M, and several other organizations, can learn itself from time to time with little electricity.

GPT 5, Gemini Flash Models

In May, Anthroponic introduced the Clad 4 model for autonomous, multi-level tasks. It has also introduced Opus 4 and Sonnet 4 versions which further improve it. In June, Google brought improved Gemini 2.5 Pro and Flash models. They have advanced reasoning and multimodal capabilities. These have become the basis for models such as experimental deepthink. OpenAI unveiled GPT-5, a massive model in August, aimed at improving reasoning and multimodal understanding. However, it has received some criticism from users.

Disney teams up with OpenAI

OpenAI introduced the GPT 5.2 model in December with advanced reasoning, coding, and long context capabilities. In the same month, OpenAI and Walt Disney Company entered into a three-year partnership. The idea is to use over 200 Disney characters to create generative videos through OpenAI's Sora. 

Physical AI Mahattu

Artificial intelligence is taking physical form beyond mobile phones and computers. Giving robots the power of thinking and discernment. That is physical AI. Avo is giving life to humanoid robots that can think and act like humans instead of just following certain commands. Tesla's Optimus robots have reached the experimental production stage. Nvidia's Omniverse and Physical AI frameworks stand behind the design of robots in various fields. Agent frameworks such as PhysicalAgent and Enerverse, however, integrate AI models into robots. It also helps to adapt the commands according to the current situation.


Gemini 3:Google's latest AI model. Strong in creative writing, problem solving, direct reasoning.

Nano Banana:Comprehensive AI based personal assistant. In addition to everyday digital tasks.

OpenAI Atlas:AI powered web browser. Has built-in ChatGPT capabilities.

Adobe Max AI Suite:Creative tools basket with AI capabilities.

Vio 3:Model to turn into videos with text prompts. Adds dialogues, sound effects and music to them.

ChatGPT 5.2:Latest version of OpenAI Chatbot. Specialized for professional, complex knowledge tasks.

Perplexity Comet:A personal agent-like AI-based web browser. Automate tasks and make it easy to capture the essence of content.

Flow:An advanced filmmaking tool by Google. Generates video clips, scenes and stories from text prompts and images.  href="https://x.com/eenadulivenews/" target="_blank" rel="noopener">Twitter, Instagram& Google News. Tags :