
ఫోన్ ట్యాపింగ్‌పై సిట్

- A
- A+
- A++
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం. ఈ కేసు నమోదైన దాదాపు 21 నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది. దీంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్‌కు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఆయనతోపాటు మరో 9 మంది పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరినే సిట్ దర్యాప్తు అధికారిగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని గుర్తించగా.. తాజా దర్యాప్తులో ఇంకా ఎవరు బయటికొస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు సమర్థులైన అధికారులు దర్యాప్తు చేసినా.. దర్యాప్తును సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం జరిగిందనే ప్రచారం నేపథ్యంలో సిట్ ఏర్పాటైంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారనే కోణంలో ఈసారి దర్యాప్తును విస్తృతం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వారం క్రితమే సిట్‌పై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొని.. ఇందులోకి తీసుకోబోయే అధికారులతో ఒకట్రెండు విడతలు చర్చించి గురువారం ఉత్తర్వులు వెలువరించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ)లో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం ద్వారా భారత రాష్ట్ర సమితికి సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు నమోదైంది. ఆ కేసు దర్యాప్తును హైదరాబాద్ నాటి కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. హైదరాబాద్ వెస్ట్‌జోన్ అప్పటి డీసీపీ ఎస్.ఎం.విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి దర్యాప్తు చేపట్టారు. అప్పట్లోనే టాస్క్‌ఫోర్స్ విశ్రాంత డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్‌రావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని విచారించిన క్రమంలోనే ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి 90 రోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు అమెరికాలో తలదాచుకోవడంతో రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయించి రప్పించారు. వారిని రప్పించినా ఎస్‌ఐబీలో కీలకాధారాల్ని ధ్వంసం చేయడంతో దర్యాప్తులో పెద్దగా పురోగతి కనిపించలేదు.
ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాను ఆధారాల్ని ధ్వంసం చేశానని ప్రభాకర్‌రావు చెప్పడంతో దర్యాప్తు జటిలంగా మారింది. ప్రభాకర్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్న ఉన్నతాధికారులను విచారించేందుకు పలు అవాంతరాలు ఎదురు కావడంతో అప్పట్లో ఈ కేసు విచారిస్తున్న పోలీస్ అధికారుల బృందం ముందుకెళ్లలేకపోయిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. వారిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేయకుండా కేసు దర్యాప్తు కొలిక్కిరాదనే అభిప్రాయాలు వ్యక్తమైనా ఇన్నాళ్లూ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ వ్యవహారం వెనక నాటి ప్రభుత్వంలోని కీలక నేతలున్నా.. ఆధారాల్ని ధ్వంసం చేశామనే ధీమాతో ప్రభాకర్‌రావు వాస్తవాల్ని వెల్లడించడంలేదని అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మరింత లోతుగా విచారించడం ద్వారా ఉన్నతాధికారులు, నేతల గుట్టు విప్పేందుకే సిట్‌ను ఏర్పాటు చేశారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఎస్‌ఐబీపై ఉన్న నమ్మకంతోనే తాము ప్రభాకర్‌రావు సూచించిన ఫోన్‌లను ట్యాప్ చేసేందుకు అనుమతించామని రాష్ట్ర హోంశాఖ అప్పట్లో న్యాయస్థానానికి నివేదిక పంపించింది.
అంబర్ కిషోర్ ఝా (రామగుండం కమిషనర్), ఎస్.ఎం.విజయ్‌కుమార్ (సిద్దిపేట కమిషనర్), రితీరాజ్ (మాదాపూర్ డీసీపీ), కె.నారాయణరెడ్డి (మహేశ్వరం డీసీపీ), ఎం.రవీందర్‌రెడ్డి (గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్), కె.ఎస్.రావు (రాజేంద్రనగర్ అదనపు డీసీపీ), పి.వెంకటగిరి (జూబ్లీహిల్స్ ఏసీపీ), సీహెచ్ శ్రీధర్ (టీజీఏఎన్‌బీ డీఎస్పీ), నాగేందర్‌రావు (హైదరాబాద్ మెట్రో రైల్ డీఎస్పీ).
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్టాండింగ్‌లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
English Translation

Sit on phone tapping

alt="Eenadu icon" class="img-fluid rounded">By Telangana News Desk Published : 19 Dec 2025 06:36 IST Ee Font size - A
- A+
- A++
3 min read
Today, Hyderabad: Another sensation in the illegal phone tapping case. Almost 21 months after the case was registered, the government has recently formed a special investigation team (SIT) which has become a key development. It is believed that the investigation of the case will take a crucial turn. The SIT will be headed by Hyderabad Commissioner VC Sajjanar. DGP Shivdhar Reddy issued an order on Thursday setting up a sit with him along with 9 other police officers. Jubilee Hills ACP Venkatagiri, who has been the investigating officer in the case so far, has been appointed as the investigating officer of the SIT. While six accused have been identified in this case so far, it is interesting to see who else will come out in the latest investigation.
Though competent authorities have investigated so far.. The SIT was formed in the wake of the campaign that there was a delay in the necessary permissions to carry forward the investigation in a proper manner. It seems that this time there is a chance to widen the investigation in the sense that threats were committed through illegal tapping of the phone. In fact, it seems that after a week ago, the higher officials had decided on the SIT.. After discussing one or two rounds with the officials who are going to be included in it, the orders were issued on Thursday. It has been stated in the order that a charge sheet will be filed as soon as possible.
A complaint was registered in Panjagutta police station on March 10 last year against the allegations of illegal phone tapping in the Special Intelligence Branch (SIB) and cooperation with the Bharatiya Rashtra Samithi. The investigation of that case was supervised by the commissioner of Hyderabad, Kothakota Srinivasa Reddy. The then DCP SM Vijaykumar and ACP Venkatagiri of Hyderabad West Zone took up the investigation. At that time, the task force arrested retired DCP Radhakishan Rao, additional DCPs Bhujanga Rao, Thirupatanna and ACP Praneet Rao and sent them to remand. As soon as they were interrogated, former SIB chief Prabhakar Rao was identified as the prime accused and a charge sheet was filed within 90 days. Prabhakar Rao and another accused, Shravan Rao, were hiding in America, so red corner notices were issued and they were extradited. Although they were brought in, there was no progress in the investigation due to the destruction of vital evidence in the SIB.
The investigation became complicated when Prabhakar Rao said that he had destroyed the evidence only on the orders of his superiors. Criticisms were expressed that the team of police officers investigating the case at that time could not move forward as there were many obstacles to interrogate the high officials mentioned by Prabhakar Rao in his testimony. Although there have been opinions that the investigation of the case cannot be concluded without interrogating them and recording their statements, no steps have been taken in that direction. It is suspected that Prabhakar Rao is not revealing the facts because of the fact that the key leaders of the previous government are behind this affair. In this context, it is being argued that the SIT was formed to reveal the secrets of the high-ranking officials and leaders by investigating more deeply. On the other hand, the state home department sent a report to the court that it was only because of their trust in the SIB that they allowed the tapping of the phones indicated by Prabhakar Rao. DCP), M. Ravinder Reddy (Greyhounds Group Commander), K. S. Rao (Additional DCP Rajendranagar), P. Venkatagiri (Jubilee Hills ACP), CH Sridhar (TGANB DSP), Nagender Rao (Hyderabad Metro Rail DSP).
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Standing.. Sit.. Investigating the case of betting apps not moving forward The Special Investigation Team (SIT), which was set up with much fanfare to crack down on betting apps that are taking innocent lives, is limited to the name. Prime Minister Narendra Modi said that 'India AI Impact Expo-2026' is a powerful combination of ideas, innovations and determination.
- In the case of the death of movie actress Pratyusha.. Siddhartha Reddy was sentenced to two years in jail. The Supreme Court has upheld the two-year jail sentence imposed by the Telangana High Court on Gudipalli Siddharth Reddy, the accused in the case of actress Pratyusha's death, which created a sensation in the united Andhra Pradesh two decades ago. Actor and Chancellor of Mohanbabu University (MBU) Mohanbabu has faced a setback in the AP High Court in the kidnapping case of student leaders. On the occasion of the International Fleet Review (IFR), President Draupadi Murmu hosted a presidential banquet at the ENC Officers' Mess, Visakhapatnam on Tuesday night.
- Hand of fortune in Hung Out of the 11 municipalities where the chairperson elections were postponed, the process was completed in 8 places on Tuesday.
- Telangana State as Bio World 'Bio Asia is going beyond its name.. becoming Bio World. Looking at this assembly.. I can proudly say that Telangana will grow as Bio World.
- Investments of Rs.1,700 crores Telangana received an investment of Rs.1,700 crore on Tuesday as the venue of the Bio Asia 2026 conference.
- Family members should be clear about values and policies. Shailaja Kiran, MD, Margadarshi Chitfunds, said that when all family members have a clear understanding of the values and procedures to be followed in the construction of business enterprises, family businesses can survive for a long time.
- Your toilet is your doctor. Technological changes are coming in the field of medicine and health. Medical diagnostic tests are getting easier.
- Old fees in 70 engineering colleges The Telangana Admissions and Fees Control Committee (TAFRC) will give a shock to some private engineering colleges in the state.
- Dan.. Simba.. Leo Dan.. Simba.. Leo.. Charlie.. Tyson.. Rana.. Virat..
- Police are ready to join the armed forces. Chief Minister Revanth Reddy has directed the officials to focus on cleanliness in the three municipal corporations under the capital. Convener Acharya K.Vijayakumar Reddy revealed that new facilities have been made available to keep track of the status of APSET application and get it again even if the registration number is lost.
- BJP is the alternative to Congress in the state. BJP state president N. Ramachander Rao has called upon the ranks to work hard to bring the party to power in the state in the future. Dr. Rechus Ella, Chief Development Officer of Bharat Biotech, said that one in every three children in the world is supplied with vaccines from India.
- My child did not get full justice. Pratyusha's mother Sarojini Devi said that she does not feel that justice has been done to her child 100%. She spoke to 'Eenadu-ETV' here on Tuesday.
- Words..fires..Tense situations arose in some places during the process of election of municipal chairpersons and vice-chairpersons in joint Warangal and joint Adilabad districts on Tuesday. Can't be sent back Throughout the municipal elections.. Kasula Hawaii ran. The political parties who distributed large amounts of money to the voters before the polling. After the counting, they spent crores of rupees to impress the corporators and councilors. State secretary of the party and MLA of Kothagudem Koonanneni Sambasivarao stated that the CPI won an unprecedented victory in the first election when Kothagudem was formed as a corporation.