చెల్లెలంటే విసుక్కుంటోంది!

మా పిల్లలిద్దరికీ 14 ఏళ్లు తేడా. పెద్దమ్మాయికి 16 ఏళ్లు. ఇంటర్‌ చదువుతోంది. చెల్లి పుట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య చెల్లెలంటే విసుక్కుంటోంది. చేయి చేసుకుంటోంది.

Eenadu icon
By Vasundhara Team Published : 22 Dec 2025 01:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

మా పిల్లలిద్దరికీ 14 ఏళ్లు తేడా. పెద్దమ్మాయికి 16 ఏళ్లు. ఇంటర్‌ చదువుతోంది. చెల్లి పుట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య చెల్లెలంటే విసుక్కుంటోంది. చేయి చేసుకుంటోంది. మేమేమైనా అంటే నేనంటే మీకు ఇష్టం లేదని ఏడుస్తోంది. అలాంటిదేమీ లేదంటే వినట్లేదు. ఎందుకిలా తయారైంది? తనని మార్చేదెలా?

పిల్లల మధ్య వయసులో అంతరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి సహజమే. పాపాయి పుట్టిన తొలిరోజుల్లో కొంచెం కొత్తదనం, తనకీ చెల్లి రూపంలో ఓ తోడు దొరికిందని మీ

పెద్దమ్మాయి సంతోషపడి ఉండొచ్చు. అయితే చిన్నదని పాపాయికే ఎక్కువ సమయం కేటాయించడం, పెద్దమ్మాయితో ఇదివరకులా గడపకపోవడం వంటివి చెల్లెలి పట్ల తనకి అసహనం, అసూయ వంటివి ఏర్పడటానికి కారణమై ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో స్నేహితులూ ‘నీకు ఇంత చిన్న చెల్లి ఉందా’ అని టీజ్‌ చేసినా కూడా దాన్నో అవమానంలా భావించే ఆస్కారముంది. ఫలితమే కోపం. ఇలాంటి పరిస్థితి రావొద్దనే పెద్ద పిల్లల్ని ముందు నుంచి రాబోయే చిన్నారి విషయంలో సిద్ధం చేయాలని చెబుతారు. రాబోయే తోబుట్టువును చూసుకోవడం, వాళ్లతో ప్రేమగా ఉండటం వంటి విషయాల్ని చర్చిస్తే వాళ్లూ అందుకు సిద్ధమై ఉంటారు. 14 ఏళ్లు ఇంటికి మహారాణిలా పెరిగి, తల్లిదండ్రుల ప్రేమనంతా పొంది... ఒక్కసారిగా మరొకరితో ఇవన్నీ పంచుకోవాలంటే తట్టుకోవడం కష్టమే. కాబట్టే, మీ పెద్దమ్మాయి ఇలా ప్రవర్తిస్తూ ఉండి ఉండవచ్చు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఓసారి తనని కూర్చోబెట్టుకుని ఆమె ప్రవర్తనకు కారణాలు కనుక్కోండి. తనపై మీ ప్రేమను వ్యక్తపరచండి. అలాగే తనతో మీరు గత ప్రవర్తనకీ ప్రస్తుతానికీ మధ్య తేడాలున్నాయా? విసుక్కోవడం, అన్ని పనులూ తననే చేయమనడం వంటివి ఏమైనా చేశారా అన్నదీ గమనించుకుని మార్చుకోవాలి. ఆపై నెమ్మదిగా అక్కగా చెల్లెలి పట్ల తన బాధ్యత, చిన్నారిని ఎలా అపురూపంగా చూసుకోవాలి... దానివల్ల వాళ్ల మధ్య ఏర్పడే అనుబంధం వంటివి అర్థమయ్యేలా చెప్పండి. చిన్న పాపకి సంబంధించిన పనులు, కొనే వస్తువులు వంటి అన్ని విషయాల్లో మీ పెద్దమ్మాయినీ భాగస్వామిని చేయండి. తన అభిప్రాయానికీ ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు క్రమంగా మార్పు వస్తుంది. అయితే ఇక్కడ మీరు చాలా సహనంతో, తన మీదా ఇదివరకటిలానే ప్రేమ ఉందన్న భావన కలిగేలా ప్రవర్తించాలి మరి!

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Sister is whining!

Our children are 14 years apart. Grandmother is 16 years old. Inter is studying. I was very happy when my sister was born. My sister is whining lately.

Eenadu icon
By Vasundhara Team Published : 22 Dec 2025 01:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Both our children are 14 years apart. Grandmother is 16 years old. Inter is studying. I was very happy when my sister was born. My sister is whining lately. Doing it. We are crying that you don't like me. I have not heard of anything like that. Why was it made? How to change him?

This situation is natural when there is a big age gap between children. Your

grandmother must have been happy to know that in the early days of Papai's birth, he got a companion in the form of a little sister. However, as she is younger, devoting more time to her father and not spending time with her elder sister may have caused her to be impatient and jealous of her younger sister. In some cases, even if friends tease, 'Do you have such a younger sister', there is a chance to feel it as an insult. The result is anger. It is said that the older children should be prepared in advance for the coming child before such a situation arises. If you discuss things like taking care of the upcoming sibling and being in love with them, they will be ready for it. Having grown up like a queen for 14 years, receiving all the love of parents... it is hard to bear to share all this with someone else at once. So, your grandmother might be behaving like this. Nothing is over yet. Sit her down for a while and find out the reasons behind her behavior. Express your love to him. Also, are there any differences between your past and present behavior with him? If you have done anything like whining and wanting to do all the work yourself, you should notice and change it. And then slowly tell her to understand her responsibility towards her younger sister, how to take care of the child wonderfully... and the bond that will be formed between them. Make your grand daughter a partner in all things related to the little baby, like shopping and things. Give priority to his opinion. Then there is a gradual change. But here you have to be very patient and behave in such a way that you feel love for her as before!

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :