ఇంటర్నెట్ డెస్క్:నిమ్మకాయ తొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రసం తీసిన తర్వాత తొక్కలను పారేసే బదులు, వాటిని వివిధ ఇంటి పనులకు పరిష్కారంగా ఉపయోగించవచ్చు. అయితే, వాటిని ఏ విథంగా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
- నిమ్మ తొక్కలను ఎండబెట్టి వార్డ్‌రోబ్ లేదా షూ రాక్ మూలల్లో ఉంచడం వల్ల సువాసన వెదజల్లుతుంది.
- మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తుంటే నిమ్మ తొక్కలను అందులో ఉంచండి. వాటికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దుర్వాసనను దూరం చేస్తాయి.
- నిమ్మ తొక్కలను వంటల్లో కూడా వాడుకోవచ్చు. వీటిని ఎండబెట్టి పొడి చేసి టీ, కూరలు, సలాడ్లలో కలిపితే రుచి రెట్టింపు అవుతుంది. డెజర్ట్‌లు, కేకుల్లో కూడా వేసుకోవచ్చు.
- వంటగది సింక్‌లు, గాజు సామాగ్రిని శుభ్రం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకుంటే కొత్తవిలా మెరుస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
- బరువు తగ్గడం: నిమ్మకాయ తొక్కలను నీటిలో మరిగించి తాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
- రోగనిరోధక శక్తి: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- బ్లడ్ షుగర్: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
- డిటాక్సిఫికేషన్: శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో తోడ్పడుతుంది.
- ఆక్సీకరణ ఒత్తిడి: ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది.
(Note:ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
For MoreLatest News
English Translation
Internet Desk:Lemon peels have many uses. Instead of discarding the skins after extracting the juice, they can be used as a solution for various household tasks. But now let's find out how they can be used..
- Dry lemon peels and keep them in the corners of your wardrobe or shoe rack to release fragrance.
- If your fridge smells bad, keep lemon peels in it. They have antibacterial properties. They remove bad smell.
- Lemon peels can also be used in cooking. If they are dried and powdered and added to tea, curries and salads, the taste doubles. It can also be used in desserts and cakes.
- It is useful for cleaning kitchen sinks and glassware. Add a little baking soda to it to make it shine like new.
Health Benefits:
- Weight Loss: Drinking lemon peels boiled in water helps in weight loss.
- Immunity: Boosts immunity with vitamin C, antioxidants.
- Blood Sugar: Helps control blood sugar levels.
- Detoxification: In the body Helps in removing toxins.
- Oxidative stress: Helps in reducing oxidative stress.
(Note:Information in this is provided to you based on internet. Just for your understanding.. Not verified by ABN Andhrajyothy)
For MoreLatest News