ఇంటర్నెట్ డెస్క్:నిమ్మకాయ తొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రసం తీసిన తర్వాత తొక్కలను పారేసే బదులు, వాటిని వివిధ ఇంటి పనులకు పరిష్కారంగా ఉపయోగించవచ్చు. అయితే, వాటిని ఏ విథంగా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..


  • నిమ్మ తొక్కలను ఎండబెట్టి వార్డ్‌రోబ్ లేదా షూ రాక్ మూలల్లో ఉంచడం వల్ల సువాసన వెదజల్లుతుంది.
  • మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తుంటే నిమ్మ తొక్కలను అందులో ఉంచండి. వాటికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దుర్వాసనను దూరం చేస్తాయి.
  • నిమ్మ తొక్కలను వంటల్లో కూడా వాడుకోవచ్చు. వీటిని ఎండబెట్టి పొడి చేసి టీ, కూరలు, సలాడ్లలో కలిపితే రుచి రెట్టింపు అవుతుంది. డెజర్ట్‌లు, కేకుల్లో కూడా వేసుకోవచ్చు.
  • వంటగది సింక్‌లు, గాజు సామాగ్రిని శుభ్రం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకుంటే కొత్తవిలా మెరుస్తాయి.

ఆరోగ్య ప్రయోజనాలు:

  • బరువు తగ్గడం: నిమ్మకాయ తొక్కలను నీటిలో మరిగించి తాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
  • రోగనిరోధక శక్తి: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • బ్లడ్ షుగర్: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • డిటాక్సిఫికేషన్: శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో తోడ్పడుతుంది.
  • ఆక్సీకరణ ఒత్తిడి: ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది.

(Note:ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )

For MoreLatest News