సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తులసీ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్‌ ఎదుట బుధవారం తెలంగాణ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ జిల్లా కమిటీ అధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షను చేప ట్టారు. అనంతరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ను కలిసి సమస్యల ను విన్నవించి వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఈ దీక్షలకు హాజ రైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ 2024 మార్చి నుంచి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. పదవీవిరమణ పొంది 21 నెలలు గడుస్తున్న కూడా పదవీవిరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీపీఎఫ్‌, జీఐఎస్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, కమిటేషన్‌, గ్రాట్యూటీ ప్రభుత్వం నుంచి ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక రాష్ట్రంలో 32మంది ఉద్యోగస్తులు మానసిక ఆవేదనకు గురై మృతిచెందా రని తెలిపారు. ఇట్టి ప్రజయోజనాల విషయాన్ని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్న వించి, నిరసనలు, ధర్నాకార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోవడం లేద న్నారు. జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామన్నారు. దీక్షలో జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యావనపెల్లి పరమేష్‌, ఉపాధ్యక్షుడు వంగ సుధా కర్‌, జనపాల శంకరయ్య, కోశాఽధికారి ధర్మయ్య, సంఘ సభ్యులు వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌, సానరవీందర్‌, రెహమాన్‌, తిరుపతి, అమీరుద్దోన్‌,చొప్పదండి రవీందర్‌, రాఘవేందర్‌రావు, గడీల రమేష్‌, అనందిని, జయశ్రీ, భాగ్యరేఖ పాల్గొన్నారు.


English Translation
Sirisilla Collectorate, December 24 (Andhra Jyoti) : Telangana Government Pensioners Association JAC State General Secretary Tulsi Satyanarayana has demanded that the state government solves the problems of the retired employees and release the arrears. State Government Pensioners' Association and State Government Pensioners' Joint Action Committee on the call of the State Committee on a one-day hunger strike in front of the Collectorate on Wednesday under the auspices of Telangana Pensioners' Association JAC district committee. Later, he met the Additional Collector Gaddam Nagesh at the Collectorate and presented the petitions. On this occasion, State Chief Secretary Satyanarayana, who was present at these initiations, said that the state government should immediately pay the arrears of the retired teachers from March 2024 till now. Even after 21 months of retirement, GPF, GIS, leave encashment, commission and gratuity are not being given by the government to the retired employees and teachers. He said that 32 employees in the state died due to mental agony as they did not receive their dues immediately after retirement. He said that after listening to the government many times about these successes, the government which has taken up protests and sit-in programs is not paying attention. District President Mallarapu Purushottam said that they will fight till the dues of the retired employees are paid. District General Secretary Dyavanapelli Paramesh, Vice President Vanga Sudha Kar, Janapala Shankaraiah, Treasurer Dharmaiah, Sangha members Venkateswarlu, Prabhakar, Sanarwinder, Rahman, Tirupati, Amiruddon, Choppadandi Ravinder, Raghavendra Rao, Gadila Ramesh, Anandini, Jayashree and Bhagyarekha participated.