Visakhapatnam: విశాఖలో 189 టన్నుల పశు మాంసం పూడ్చివేత

Eenadu icon
By Crime News Team Updated : 22 Dec 2025 18:20 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆనందపురం: గోవులను వధించి.. ఆ మాంసాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న అంతర్జాతీయ రాకెట్‌ను విశాఖపట్నం సిటీ పోలీసులు ఛేదించారు. మొత్తం 189 టన్నుల మాంసాన్ని సీజ్‌ చేసి, కీలక నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ-1 డీసీపీ మణికంఠ మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రధాన పోర్టుల్లో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో, పశుసంవర్థకశాఖకు అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర విజిలెన్స్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి ఆనందపురం పరిధిలోని శ్రీ మిత్ర కోల్డ్‌ స్టోరేజ్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన మాంసంపై అనుమానం రావడంతో.. శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఈ పరీక్షల్లో ఆవు మాంసం, ఎద్దు మాంసం, గేదెమాంసం ఉన్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రధాన నిందితుడైన ఫర్హాన్‌ను అరెస్టు చేశారు. విచారణలో ఇదో పెద్ద రాకెట్‌ అని తేలడంతో, ప్రధాన సరఫరాదారులైన మన్సూర్‌ అలీని మహారాష్ట్రలోని లోనావాలో, రషీద్‌ ఖురేషిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో అరెస్టు చేశారు. తప్పుడు ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు, హెల్త్‌ సర్టిఫికెట్లు తయారు చేసి.. విశాఖపట్నం పోర్టు ద్వారా అక్రమంగా పశు మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.  మిగతా ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  సీజ్‌ చేసిన మాంసాన్ని పూడ్చేందుకు కోర్టు అనుమతించడంతో.. జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి, పశుసంరక్షణ శాఖ, రెవెన్యూ అధికారుల సమక్షంలో 189 టన్నుల మాంసాన్ని పూడ్చిపెట్టినట్లు డీసీపీ తెలిపారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 17:16 IST

English Translation

Visakhapatnam: 189 tonnes of cattle meat buried in Visakha

Eenadu icon
By Crime News Team Updated : 22 Dec 2025 18:20 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Anandapuram: Cows are slaughtered.. Visakhapatnam city police have busted an international racket of illegally exporting meat to foreign countries. Visakha-1 DCP Manikantha revealed to the media that a total of 189 tonnes of meat has been seized and the key accused have been arrested. In the context of Directorate of Revenue Intelligence officials conducting inspections at major ports across the country, based on the complaints received by the Animal Husbandry Department, inspections were conducted at Shree Mitra Cold Storage under Anandapuram along with State Vigilance and Food Safety officials. The samples were sent to the lab in Hyderabad as there was suspicion of the meat being prepared for export to foreign countries. In these tests, it was found that cow meat, beef meat and buffalo meat were present. The police have registered a case to this effect.

Farhan, the main accused, has been arrested. As the investigation revealed that it was a big racket, the main suppliers Mansoor Ali were arrested from Lonawa in Maharashtra and Rashid Qureshi from Meerut in Uttar Pradesh. The accused admitted during the investigation that they were illegally exporting cattle meat to foreign countries through Visakhapatnam port after preparing false invoices, e-way bills and health certificates.  Police are hunting for the remaining six accused.  As the court allowed to bury the seized meat.. DCP said that 189 tonnes of meat was buried in the presence of GVMC, Pollution Control Board, Animal Welfare Department and Revenue officials. on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 17:16 IST