Kandula Durgesh: ఆ సినిమాలకు మరింత సహకారం.. ఉగాది నాటికి నంది అవార్డులు: మంత్రి కందుల దుర్గేష్‌

Eenadu icon
By Entertainment Team Published : 22 Dec 2025 16:31 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అమరావతి: వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులతో (Nandi Awards) పాటు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ( Kandula Durgesh) తెలిపారు. ఈ వేడుకలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని తెలిపారు. అమరావతిలో ‘ఆవకాయ్‌’ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా దుర్గేశ్‌ ప్రకటించారు. జనవరి 8 నుంచి 10 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్య విభాగాల్లో ఈ వేడుకలు ఉండనున్నాయి. కృష్ణానదీ తీరం పున్నమి ఘాట్‌, భవానీ ద్వీపంలో వీటికోసం ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్‌ను మంత్రి కందుల ఆవిష్కరించారు. అనంతరం సినీ పరిశ్రమ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

‘‘ఏపీలో షూటింగ్‌ జరుపుకొనే చిత్రాలకు ప్రభుత్వం నుంచి మరింత సహకారం ఉంటుంది. నంది అవార్డులు.. నంది నాటకోత్సవాలు జరగాలి. నాటకాన్ని సినిమానూ సమానంగా చూడాలని సీఎం పలుమార్లు చెబుతున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి త్వరలో సినిమాటోగ్రఫీశాఖ ఓ సమావేశం నిర్వహించనుంది. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఏ రకమైన ఆలోచన చేయాలి? వాళ్ల ఇబ్బందులను తొలగించాలన్న దానిపై ఇందులో మాట్లాడతాం. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ వర్గాలేవీ పాల్గొనడం లేదు. వారితో మరోసారి సమావేశం నిర్వహించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి వివరిస్తాం’’

  • : ఈ ఏడాదికి ఇవే చివరి సినిమాలు..

‘‘బడ్జెట్‌ను బట్టి సినిమాకు సహకారం అందించాలని ఒక ఆలోచన ఉంది. అలాగే ఏపీలో షూటింగ్‌ చేసిన సినిమాలకు ఇంకొంత సపోర్ట్‌ చేయాలి.  థియేటర్ల నుంచి ఆదాయం తగ్గుతోంది కాబట్టి, ప్రస్తుతం ఉన్న విధి విధానాల ప్రకారం అత్యధిక బడ్జెట్‌ సినిమాలకు సహకారం అందిస్తున్నాం. ఇక్కడ రెండు వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నటీనటుల పారితోషికం కాకుండా సినిమా బడ్జెట్‌ ఎక్కువగా ఉంటే ఆ సినిమాకు సహకారం ఇవ్వాలని ఒక  వాదన నడుస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులకు పారితోషికంతో కలిపితే సినిమా బడ్జెట్‌ అవుతుందన్న మరో వాదన కూడా ఉంది. ఈ రెండింటికీ మధ్యే మార్గంగా ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం. ఏపీలో ఎక్కువగా షూటింగ్‌ సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం’’ అని మంత్రి వివరించారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విజయ్‌ ఆంటోనీ మూవీ.. వాటి వల్లే నాకు ఛాన్స్‌: మంచు లక్ష్మి విజయ్‌ ఆంటోనీ ‘బూకి’ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో మంచు లక్ష్మి తెలిపారు.
  • అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
  • ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్‌ పాత్ర ఇదే.. వీడియో వైరల్‌ ‘వారణాసి’లోని తన పాత్రపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు.
  • చిరంజీవి భుజానికి సర్జరీ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
  • నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శలు.. స్పందించిన త్రిష ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షకుడు విజయ్‌ (Vijay)ను విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన విమర్శలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అల్లు వారి పెళ్లిసందడి.. తొలి శుభలేఖ చిరంజీవికే.. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పెళ్లి పిలుపులు షురూ చేశారు.
  • బుచ్చిబాబుకు చరణ్‌ విషెస్‌.. ఫొటో పంచుకున్న హీరో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్‌చరణ్‌ విషెస్‌ తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.
  • ‘ధురంధర్‌’లో విలన్‌ రోల్‌ మిస్సయారా?.. నాగార్జున క్లారిటీ..! కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు నాగార్జున (Nagarjuna). ఇటీవల ‘కూలీ’లో ప్రతినాయకుడు సిమన్‌ పాత్రలో నటించి మెప్పించారు.
  • నేను ‘సాగర సంగమం’ తీశానని చెప్పలేదుగా: నాగవంశీ తాను నిర్మించిన కొత్త సినిమా ‘ఫంకీ’ ఫలితంపై నాగవంశీ స్పందించారు.
  • రూ.120 కోట్లకు ‘టాక్సిక్‌’ మూవీ హక్కులు: దిల్‌ రాజు ఏమన్నారంటే? ‘టాక్సిక్‌’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్‌ రాజు స్పందించారు.
  • మిమ్మల్ని కూడా హగ్‌ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్‌ ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు.
  • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. నామినేషన్స్‌ జాబితా ఇదే! ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్‌’. 
  • అప్పుడు నిరుత్సాహంలో ఉన్నా.. క్లిష్ట సమయంలో ‘ఫంకీ’: విశ్వక్‌సేన్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఫంకీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు.
  • అర్జున్‌ ఉదారత.. ఈ రియల్‌ హీరోలకు సన్మానం.. రూ.లక్ష కానుక ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun Sarja) మంచి మనసు చాటుకున్నారు.
  • అల్లు అర్జున్‌తో యాడ్‌ షూట్‌.. ఆ నిబంధనలు పాటించాలట! ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటారు సినీ నటులు.
  • విజయ్‌ దేవరకొండ పెళ్లికి వెళుతున్నారా?: తరుణ్‌ భాస్కర్‌ ఏమన్నారంటే విజయ్‌ దేవరకొండ పెళ్లిపై ప్రశ్న ఎదురవగా దర్శక, నటుడు తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు.
  • ‘దృశ్యం 3’ క్లైమాక్స్‌.. ప్రతి ఒక్కరూ షాక్‌ అవ్వాల్సిందేనట! ‘దృశ్యం’ క్లైమాక్స్‌ ట్విస్ట్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ ట్విస్ట్‌ గురించి అయితే మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.
  • ‘రామాయణ’లో విక్రాంత్‌ మాస్సే?.. నటుడి రియాక్షన్‌ ఇదీ ‘రామాయణ’లో తాను భాగమైనట్లు వచ్చిన రూమర్స్‌పై నటుడు విక్రాంత్‌ మాస్సే స్పందించారు.
  • రాజమౌళి మరో ట్విస్ట్‌.. ‘వారణాసి’ మొత్తం ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదట! ‘వారణాసి’ (Varanasi) మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.
  • సినిమా టికెట్లు.. అలా మోసపోయా: విశ్వక్‌సేన్‌ ‘ఫంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్‌సేన్‌. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వులు పంచారు.