IND u19 Vs PAK u19: ఫైనల్లో భారత్‌ బోల్తా

Eenadu icon
By Sports News Desk Published : 22 Dec 2025 03:34 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

యువ భారత్‌ బోల్తా కొట్టింది. అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీ ఆరంభం నుంచి అదిరే ప్రదర్శన చేసిన జట్టు.. తుది మెట్టుపై చతికిల పడింది. ఆదివారం ఫైనల్లో బంతితో, బ్యాటుతో ఘోరంగా విఫలమైన భారత్‌.. 191 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయింది. సమీర్‌ మిన్హాస్‌ (172; 113 బంతుల్లో 17×4, 9×6) విరుచుకుపడడంతో మొదట పాకిస్థాన్‌ 8 వికెట్ల నస్టానికి 347 పరుగుల భారీస్కోరు సాధించింది. అహ్మద్‌ హుస్సేన్‌ (56), ఉస్మాన్‌ ఖాన్‌ (35) రాణించారు. బంతితో భారత్‌ తేలిపోయింది. దీపేశ్‌ (3/83), కనిష్క్‌ చౌహాన్‌ (1/72), హెనిల్‌ పటేల్‌ (2/62) ధారాళంగా పరుగులిచ్చారు. ఖిలాన్‌ పటేల్‌ (2/44) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఛేదనలో భారత్‌ చేతులెత్తేసింది. అలీ రజా (4/42), హుజైఫా (2/12), సుభాన్‌ (2/29), సయ్యమ్‌ (2/38) ధాటికి 26.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. 36 పరుగులు చేసిన దీపేశ్‌  టాప్‌ స్కోరర్‌. సమీర్‌ మిన్హాస్‌.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.

తేలిపోయారు..:పాకిస్థాన్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పేలవంగా బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు అతణ్ని ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. మరో ఓపెనర్‌ హంజా (18) త్వరగానే నిష్క్రమించినా.. సమీర్‌ జోరుతో పాక్‌ భారీ స్కోరు దిశగా సాగింది. సమీర్‌.. ఉస్మాన్‌ ఖాన్‌తో రెండో వికెట్‌కు 92, అహ్మద్‌ హుస్సేన్‌తో మూడో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు. ఆ తర్వాత ఫర్హాన్‌ (19)తో నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి.. 43వ ఓవర్లో ఔటయ్యాడు. ఆఖర్లో భారత బౌలర్లు కాస్త మెరుగ్గా బౌలింగ్‌ చేయగలిగారు. పాక్‌ చివరి ఏడు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు రాబట్టింది. ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన భారత్‌.. ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. పది ఓవర్లలోపే ఓటమి ఖాయమైపోయింది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (26; 10 బంతుల్లో 1×4, 3×6) ధాటిగానే ఆరంభించినా.. ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 5వ ఓవర్లో అతడు ఔటయ్యేటప్పటికి స్కోరు 49. అంతకన్నా ముందే ఆయుష్‌ మాత్రే (2), ఆరోన్‌ జార్జ్‌ (16) వెనుదిరిగారు. విహాన్‌ మల్హోత్రా (7), వేదాంత్‌ త్రివేది (9) కూడా విఫలం కావడంతో భారత్‌ 68/5తో పీకలలోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ తర్వాత అద్భుతమేమీ జరగలేదు. మిగతా బ్యాటర్లు కూడా పోరాడకుండానే వెనుదిరిగారు.

సంక్షిప్త స్కోర్లు...

పాకిస్థాన్‌:347/8 (సమీర్‌ మిన్హాస్‌ 172, అహ్మద్‌ హుస్సేన్‌ 56, ఉస్మాన్‌ ఖాన్‌ 35, ఫర్హాన్‌ 19; దీపేశ్‌ 3/83, ఖిలాన్‌ పటేల్‌ 2/44, హెనిల్‌ పటేల్‌ 2/62)

భారత్‌:26.2 ఓవర్లలో 156 ఆలౌట్‌ (దీపేశ్‌ 36, వైభవ్‌ సూర్యవంశీ 26, ఖిలాన్‌ పటేల్‌ 19, ఆరోన్‌ జార్జ్‌ 16, అభిజ్ఞాన్‌ కుందు 13, ఆయుష్‌ మాత్రే 2; అలీ రజా 4/42, సుభాన్‌ 2/29, సయ్యమ్‌ 2/38)

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.

English Translation

IND u19 Vs PAK u19: India rolled in the final

Eenadu icon
By Sports News Desk Published : 22 Dec 2025 03:34 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Young India rolled. The team that has performed the same since the beginning of the Under-19 Asia Cup ODI tournament, has squatted on the final step. India, who failed miserably with the ball and the bat in Sunday's final, lost to arch-rival Pakistan by a huge margin of 191 runs. Sameer Minhas (172; 17x4, 9x6 off 113 balls) broke first and Pakistan scored a huge score of 347 runs for the loss of 8 wickets. Ahmed Hussain (56) and Usman Khan (35) excelled. India was comfortable with the ball. Deepesh (3/83), Kanishk Chauhan (1/72) and Henil Patel (2/62) scored liberally. Khilan Patel (2/44) bowled sparingly. India raised their hands in the fight. Ali Raza (4/42), Huzaifa (2/12), Subhan (2/29) and Sayyam (2/38) were bowled out for 156 runs in 26.2 overs. Dipesh was the top scorer with 36 runs. Sameer Minhas was selected as 'Player of the Match' and 'Player of the Series'.

Decided..:Pakistan lost the toss and came to bat.. Opener Sameer Minhas got excited with the destructive batting. He ran the scoreboard with fours and sixes. The Indian bowlers who bowled poorly could not restrain him at all. Another opener Hamza (18) left early, but with Sameer's strength, Pakistan went towards a huge score. Sameer added 92 runs for the second wicket with Usman Khan and 137 runs for the third wicket with Ahmed Hussain. After that he added 42 runs for the fourth wicket with Farhan (19) and was dismissed in the 43rd over. In the end the Indian bowlers were able to bowl a bit better. Pakistan lost 4 wickets in the last seven overs and scored 45 runs. India, who lost wickets regularly in Chhedan, did not seem to win at any stage. Defeat was assured within ten overs. Opener Vaibhav Suryavanshi (26; 1×4, 3×6 in 10 balls) started strongly but could not last long. By the time he got out in the 5th over, the score was 49. Before that, Ayush Matre (2) and Aaron George (16) were back. Vihan Malhotra (7) and Vedant Trivedi (9) also failed, leaving India in dire straits at 68/5. Nothing miraculous happened after that. The rest of the batsmen also retreated without a fight.

Brief scores...

Pakistan:347/8 (Samir Minhas 172, Ahmed Hussain 56, Usman Khan 35, Farhan 19; Deepesh 3/83, Khilan Patel 2/44, Henil Patel 2/62)

India:156 all out in 26.2 overs (Deepesh 36, Vaibhav Suryavanshi 26, Khilan Patel 19, Aaron George 16, Abhiyan Kundu 13, Ayush Mathre 2; Ali Raza 4/42, Subhan 2/29, Sayyam 2/38)

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Come baby Yuvraj There are no favorable conditions for cricket in his country. The game is played only three months a year. It is great to grow in cricket from such a place and play for the national team. Such a thing got a chance to enter the ring in the World Cup.
  • Invincible? Hat-trick victories.. Huge win against Pakistan in the last match.. Highest net run rate which is not possible for any other team in the tournament.. Team India's mood is not normal in T20 World Cup.
  • Australia out Shock for former champion Australia. The Kangaroo team is out of the T20 World Cup on Tuesday after the Group-B match between Zimbabwe and Ireland was canceled due to rain. The Aussies lost two of the three matches they played..
  • Kiwisoo ahead New Zealand cruised to the Super-8s in the T20 World Cup with no work to do. Kiwis defeated Canada by 8 wickets in Group D match on Tuesday. First, Canada scored 173 runs for 4 wickets.
  • Confused.. Australia, which has won ICC tournaments many times, it is not expected that a team that is in top form in the World Cup, will leave the T20 World Cup so soon.
  • Will Pakistan stand? Australia has already left the T20 World Cup. The fate of another big team will be decided on Wednesday. Pakistan, who suffered a heavy blow at the hands of India in the last match, is going to face Namibia in its last group match. The big team came very close to victory against England and Nepal, who lost by mistake, ended the T20 World Cup with that same victory. The team lost the first three matches in Group-C and left the Super-8 race. In the final match against Scotland on Tuesday, they won by 7 wickets.
  • News in Brief (5) Jammu and Kashmir came close to making history in the Ranji Trophy. The team, which is showing strength with an inspiring performance in batting and bowling, is moving towards the final for the first time in the history of Ranji.