బాధ్యతే అసలైన గౌరవం..!
ప్లాట్‌ఫామ్‌పై నిలబడి రైలు కోసం ఎదురుచూస్తున్న జనంలో ఆమె ఒకరు. కానీ, తను రైలు ఎక్కడానికి కాదు. ఆ ట్రైన్ నుంచి దిగే ప్రయాణికుల కోసం. వాళ్లిచ్చే సామాన్లు మోస్తేనే ఆమె పిల్లల కడుపు నిండుతుంది.

- A
- A+
- A++

ప్లాట్‌ఫామ్‌పై నిలబడి రైలు కోసం ఎదురుచూస్తున్న జనంలో ఆమె ఒకరు. కానీ, తను రైలు ఎక్కడానికి కాదు. ఆ ట్రైన్ నుంచి దిగే ప్రయాణికుల కోసం. వాళ్లిచ్చే సామాన్లు మోస్తేనే ఆమె పిల్లల కడుపు నిండుతుంది. తనే సంధ్యా మారవి. భర్త మరణంతో పిల్లల భవిష్యత్తుకోసం రైల్వే కూలీగా మారారీమె.
జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలీదు. 2016లో భర్త మరణం సంధ్యా మారవిని కుదిపేసింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ముగ్గురు పిల్లలు. తను బాధ పడుతూ కూర్చుంటే వారి కడుపు నిండేదెలా అనుకున్నారామె. దాంతో కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకున్నారు. ఎప్పుడూ ఇంటి నుంచి బయటికి వెళ్లింది లేదు. పెద్దగా చదువు లేదు. ఏ పని చేయాలో తెలియలేదు. అలాగని ఎవరి దగ్గరా చేయి చాచలేదు. కష్టాన్నే నమ్ముకున్నారు సంధ్య. కుటుంబాన్ని పోషించడానికి మగవాళ్లు మాత్రమే చేయగలిగే రైల్వే కూలీనే వృత్తిగా ఎంచుకున్నారు. జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బ్యాడ్జ్ నెంబర్ 36, ఎరుపు చొక్కా ధరించి కూలీగా మారారీమె. 400మంది పురుషుల మధ్యలో ఒక్కరే మహిళ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిసారీ సుమారు 45కేజీల బరువుని భుజాలపై మోసుకెళ్లాలి. అయినా భయపడలేదీమె. ‘మొదటిసారి నేను స్టేషన్‌లో పనిచేయడానికి నిలబడినప్పుడు అందరూ వింతగా చూశారు. మగవాళ్లు మాత్రమే చేసే పని నీవల్ల అవుతుందా? ఇంత బరువు మోయగలవా అన్నట్లు చూశారు. వాళ్ల ముందే లగేజీని మోసి చూపించా. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సంకల్పం బలంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు’ అంటారు సంధ్య. రోజూ కట్నీ నుంచి జబల్‌పుర్‌నకు 45కి.మీ ప్రయాణించి ప్రయాణికుల పిలుపుకోసం ఎదురు చూస్తుంటారీమె.
అమ్మ మేల్కొంటుంది...
స్టేషన్‌లో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లగానే ఆమెలోని కూలీ నిద్రపోయి అమ్మ మేల్కొంటుంది. పిల్లలకి అన్నం తినిపించి, చదువు చెప్పి, నిద్రపుచ్చే వరకూ విశ్రాంతి తీసుకోరామె. ‘భుజాన మోసేది ప్రయాణికుల బరువులు కాదు, నా ముగ్గురు పిల్లల భవిష్యత్తు’ అంటారు సంధ్య. కష్టాలకు కుంగిపోకుండా... నేను వాటిని గెలవగలను అని నిరూపించుకున్నారు. చేసే పని ఎలాంటిది అని ఆలోచించకుండా బాధ్యతే అసలైన గౌరవం అనుకున్న సంధ్య ఈతరం మహిళలకి స్ఫూర్తిదాయకమే కదూ!
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Responsibility is real respect..!
She was one of the crowd standing on the platform waiting for the train. But, he did not board the train. For passengers alighting from that train. Her child's stomach is filled only by carrying the goods they give.

- A
- A+
- A++

She was one of the crowd waiting for the train on the platform. But, he did not board the train. For passengers alighting from that train. Her children's stomachs are filled only by carrying the goods they give. He himself became Sandhya Mara. After the death of her husband, she becomes a railway laborer for the future of her children.
No one knows when life will take a turn. The death of her husband in 2016 shook Sandhya Maravi. There is no spillage in the hand. Three children. Do you think how their stomachs will be filled if he sits suffering. With that, the burden of the family was put on their shoulders. Never went out of the house. Not much education. Didn't know what to do. He did not extend his hand to anyone. Sandhya believed in hardship. He chose railway labor as a profession which only men could do to support the family. Badge number 36, wearing a red shirt and becoming a laborer at Jabalpur railway station. There is only one woman among 400 men. Around 45 kg weight should be carried on the shoulders every time from morning to evening. But don't be afraid. "The first time I stood up to work at the station, everyone looked at me strangely. Can you do what only men do? They looked as if they could carry such a weight. Carry the luggage in front of them. No matter how tough the circumstances are, nothing is impossible if the will is strong' says Sandhya. Every day we travel 45 km from Katni to Jabalpurna and wait for the call of passengers.
Amma wakes up...
After finishing work at the station and going home, the laborer in her sleeps and Amma wakes up. Feed the child rice, teach him and let him rest until he falls asleep. Sandhya says, 'It is not the passengers' weights that I am carrying on my shoulders, but the future of my three children.' They proved that I can overcome difficulties without getting discouraged. Sandhya Ithara, who thinks responsibility is real respect without thinking about what kind of work is done!
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :