Drinking water: ఆర్వో ప్లాంట్‌ నీళ్లు తాగుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

Eenadu icon
By Telangana News Desk Updated : 21 Dec 2025 19:20 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మన ఇంట్లోని నీళ్లే కదా... మన ఆర్వో ప్లాంట్లోనే శుద్ధిఅయింది కదా... నిక్షేపంలా తాగొచ్చని అనుకుంటాం. కానీ అందులో రసాయనాల అవక్షేపాలు ఉంచొచ్చు. తస్మాత్‌ జాగ్రత్త!

  • బాటిల్‌లో అయినా, బబుల్‌లో అయినా తాగునీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యానికి కారణమయ్యే విషాలు ఏ దశలోనైనా పోగుపడొచ్చు. అందుకే ఆర్వో ప్లాంట్‌ నుంచి ఆ నీటిని నిల్వ చేసిన పాత్ర వరకు అన్నిటినీ తరచిచూడాలి. ఎందులోనైనా సరే నీరు ఎక్కువరోజులు నిల్వ ఉంటే అందులో ప్రమాదకర బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆల్గే, శిలీంధ్రాలు వేగంగా పెరుగుతాయి.
  • ప్లాంట్‌లో లీకేజీలు ఉన్నా, ప్లంబింగ్‌ కనెక్షన్లు సక్రమంగా లేకున్నా నీటిలోకి సీసం, సింథటిక్‌ మూలకాలు చేరే ప్రమాదం ఉంది.
  •  కొన్ని ఆర్వో ప్లాంట్లు శరీరానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలను కూడా పూర్తిగా ఫిల్టర్‌ చేసేస్తాయి. ఆ నీటితో చాలా సమస్యలు వస్తాయి. ఒకవేళ ఆ నీళ్లనే తాగాల్సివస్తే ఫిల్టర్‌ అయిన పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
  • ఎక్కువ పీడనంలో నీటిని ఫిల్టర్‌ చేస్తుంటే ఆర్వో ప్లాంట్‌లో వడకట్టే రంధ్రాలు కుంచించుకుపోతాయి. దానివల్ల విద్యుత్తు వినియోగం ఎక్కువవడంతో పాటు... కరిగిన ఘన పదార్థాలు పోయి నీటి నాణ్యత కూడా తగ్గిపోతుంది.
  • ఆల్గే తొలగించడానికి ఉపయోగించే క్లోరిన్‌ వంటి రసాయనాల అవశేషాలు ప్లాంట్‌లో మిగిలిపోతే దీర్ఘకాలంలో   అనారోగ్యాలకు దారితీయొచ్చు
  • ఆర్వో ప్లాంట్లలో శుద్ధి అయిన నీళ్లలో ఆమ్లత ఉంటుంది. అది మన  శరీరంలోని ఖనిజ లవణాలను తొలగించే అవకాశం ఉంది. ఇది మన ఆహారం రుచిని కూడా ప్రభావితం చేస్తుంది.
  • ఒకవేళ బాటిళ్లు, బబుల్స్‌లో నీటిని వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ నాణ్యత ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎక్కువ కాలం వాడితే బిస్పినాల్స్, థాలేట్లు వంటి రసాయన అవశేషాలు, మైక్రోప్లాస్టిక్‌లు నీటిలోకి లీక్‌ అవుతుంటాయి. ఇవి మన శరీరంలోని జీవక్రియలను ఛిన్నాభిన్నం చేస్తాయి.

  • ఆర్వో ప్లాంట్లలోని ఫిల్టర్లలో బయోఫిల్మ్‌లను మార్చడమే కాకుండా పూర్తిగా సిస్టమ్‌ శానిటైజేషన్‌ను తరచూ చేస్తుండాలి.
  • గాలి, కాలుష్యం లోపలికి రాకుండా కంటెయినర్లు, బాటిళ్లను గట్టిగా మూసేయాలి. స్క్రూఆర్‌ క్యాప్‌లు దీనికి బాగా ఉపయోగపడతాయి.
  • బాటిళ్లలో నీళ్లనైతే నేరుగా సూర్యుడి కిరణాలు పడని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి. సూర్యకాంతి నుంచి వచ్చే యూవీ కిరణాలు నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి.
  • ప్లాస్టిక్‌వి కాకుండా సర్టిఫైడ్‌ ఫుడ్‌గ్రేడ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లేదా హెచ్‌డీపీఈ ట్యాంకులను వాడుకోవాలి.  
  • వడకట్టే పొరకు నష్టం జరగకుండా పీడనాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఆటోమేటెడ్‌ షట్‌డౌన్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. 
  • ఆర్వో ప్లాంట్లను తరచూ తనిఖీచేయాలి. ఏవైనా కాలుష్య సంకేతాలు, రంగు, రుచి, వాసనలో మార్పులుంటే ఆ నీటిని వాడకూడదు. ప్లాంట్‌ను సరిచేసుకోవాలి.
  • ఆర్వోప్లాంట్‌లోని నీటిని 24 నుంచి 48 గంటల్లో తాగేయడం మేలు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 19:09 IST

English Translation

Drinking water: Are you drinking Arvo plant water? Beware Tasmat!

Eenadu icon
By Telangana News Desk Updated : 21 Dec 2025 19:20 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Isn't the water in our house...purified in our Arvo plant itself...like a deposit... We think we can drink. But chemical deposits can be kept in it. Beware of Tasmat!

  • Be careful with drinking water whether it is in a bottle or bubble. Toxins that cause illness can accumulate at any stage. That's why everything from the Arvo plant to the container where the water is stored should be checked. If water is stored in anything for a long time, dangerous bacteria can form in it. Algae and fungi grow rapidly.
  • If there are leaks in the plant or improper plumbing connections, there is a risk of lead and synthetic elements entering the water.
  • Some Arvo plants also completely filter out calcium, magnesium and potassium, which are essential for the body. A lot of problems come with that water. If you have to drink that water, you should ensure that the filtered nutrients are in the food.
  • If the water is filtered under high pressure, the filter holes in the Arvo plant will shrink. In addition to increasing electricity consumption, water quality is also reduced due to the loss of dissolved solids.
  • Residues of chemicals such as chlorine used to remove algae can lead to illnesses in the long run. It has the potential to remove mineral salts from our body. It also affects the taste of our food.
  • If using water in bottles and bubbles, some precautions should be taken. If low-quality plastic bottles are used for a long time, chemical residues like bisphenols, phthalates and microplastics will leak into the water. These break down the metabolites in our body.

  • In addition to changing the biofilms in the filters in Arvo plants, complete system sanitization is often done. It should be done.
  • Containers and bottles should be tightly closed to prevent air and pollution from entering. Screw caps are very useful for this.
  • Bottled water should be stored in places away from direct sunlight. UV rays from sunlight can damage the water quality.
  • Certified food grade stainless steel or HDPE tanks should be used instead of plastic ones.  
  • The pressure should be checked periodically to avoid damage to the filter membrane. Automated shutdown systems should be installed. 
  • RVO plants should be inspected regularly. If there are any signs of contamination, changes in color, taste or smell, the water should not be used. The plant needs to be fixed.
  • It is better to drink the water in Arvoplant within 24 to 48 hours.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 19:09 IST