Sujeeth: ఆ షాటే ‘ఓజీ’లో పెట్టా.. వావ్‌ అన్నారు: సుజీత్‌

Eenadu icon
By Entertainment Team Updated : 21 Dec 2025 16:42 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: లఘు చిత్రాలతో దర్శకత్వ ప్రతిభ చూపి, ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో సుజీత్‌ (Sujeeth) ఒకరు. తీసింది మూడు సినిమాలే అయినా మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ‘ఓజీ’ (OG Movie)తో ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన ఓ ‘రౌండ్‌ టేబుల్‌’ సమావేశంలో పాల్గొన్నారు. తన జర్నీని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయం పంచుకున్నారు. 2009లో తాను తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌లోని షాట్‌నే.. పవన్‌ కల్యాణ్‌ ( Pawan Kalyan) హీరోగా తెరకెక్కించిన ‘ఓజీ’లో పెట్టానని తెలిపారు. ఆ లఘు చిత్రంలోని షాట్‌కు ఇప్పటికీ తక్కువ వ్యూసే ఉన్నాయని, అదే సినిమాలో చూసిన వారంతా వావ్‌ అన్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్టార్‌ యాక్టర్స్‌కు ఉన్న పవర్‌ అలాంటిదని అభిప్రాయపడ్డారు. ఎలాంటి గుర్తింపు దక్కని షాట్‌ను స్టార్‌తో తెరకెక్కించడం వల్ల దాని స్థాయి పెరిగిపోయిందన్నారు.

‘ఓజీ’ సినిమా షూటింగ్‌కు ముందే తాను డెమో షూట్‌ చేసినట్లు తెలిపారు. ఆ ఫుటేజీ నిడివి 2:35 గంటలని చెప్పారు. డెమో కారణంగానే మూవీ షూటింగ్‌ త్వరగా పూర్తి చేయగలిగానని అన్నారు. కొన్ని రోజుల క్రితం.. సుజీత్‌కు ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కార్‌ను పవన్‌ కల్యాణ్‌ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబరులో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో ప్రదర్శితమవుతోంది. సుజీత్‌ చెప్పిన ఆ షాట్‌ మరేదో కాదు.. నీటిలో హీరో అడుగేడయం, ఆ రిఫ్లెక్షన్‌ను హైలైట్‌ చేస్తూ నటుడి వైపు కెమెరాను ఫోకస్‌ చేయడం. అది షార్ట్‌ఫిల్మ్‌లో ఎలా ఉంది? సినిమాలో ఎలా రూపొందిందో ఈ కింది వీడియోల్లో చూసేయండి..



► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 16:13 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విజయ్‌ ఆంటోనీ మూవీ.. వాటి వల్లే నాకు ఛాన్స్‌: మంచు లక్ష్మి విజయ్‌ ఆంటోనీ ‘బూకి’ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో మంచు లక్ష్మి తెలిపారు.
  • అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
  • ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్‌ పాత్ర ఇదే.. వీడియో వైరల్‌ ‘వారణాసి’లోని తన పాత్రపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు.
  • చిరంజీవి భుజానికి సర్జరీ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
  • నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శలు.. స్పందించిన త్రిష ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షకుడు విజయ్‌ (Vijay)ను విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన విమర్శలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అల్లు వారి పెళ్లిసందడి.. తొలి శుభలేఖ చిరంజీవికే.. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పెళ్లి పిలుపులు షురూ చేశారు.
  • బుచ్చిబాబుకు చరణ్‌ విషెస్‌.. ఫొటో పంచుకున్న హీరో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్‌చరణ్‌ విషెస్‌ తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.
  • ‘ధురంధర్‌’లో విలన్‌ రోల్‌ మిస్సయారా?.. నాగార్జున క్లారిటీ..! కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు నాగార్జున (Nagarjuna). ఇటీవల ‘కూలీ’లో ప్రతినాయకుడు సిమన్‌ పాత్రలో నటించి మెప్పించారు.
  • నేను ‘సాగర సంగమం’ తీశానని చెప్పలేదుగా: నాగవంశీ తాను నిర్మించిన కొత్త సినిమా ‘ఫంకీ’ ఫలితంపై నాగవంశీ స్పందించారు.
  • రూ.120 కోట్లకు ‘టాక్సిక్‌’ మూవీ హక్కులు: దిల్‌ రాజు ఏమన్నారంటే? ‘టాక్సిక్‌’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్‌ రాజు స్పందించారు.
  • మిమ్మల్ని కూడా హగ్‌ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్‌ ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు.
  • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. నామినేషన్స్‌ జాబితా ఇదే! ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్‌’. 
  • అప్పుడు నిరుత్సాహంలో ఉన్నా.. క్లిష్ట సమయంలో ‘ఫంకీ’: విశ్వక్‌సేన్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఫంకీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు.
  • అర్జున్‌ ఉదారత.. ఈ రియల్‌ హీరోలకు సన్మానం.. రూ.లక్ష కానుక ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun Sarja) మంచి మనసు చాటుకున్నారు.
  • అల్లు అర్జున్‌తో యాడ్‌ షూట్‌.. ఆ నిబంధనలు పాటించాలట! ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటారు సినీ నటులు.
  • విజయ్‌ దేవరకొండ పెళ్లికి వెళుతున్నారా?: తరుణ్‌ భాస్కర్‌ ఏమన్నారంటే విజయ్‌ దేవరకొండ పెళ్లిపై ప్రశ్న ఎదురవగా దర్శక, నటుడు తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు.
  • ‘దృశ్యం 3’ క్లైమాక్స్‌.. ప్రతి ఒక్కరూ షాక్‌ అవ్వాల్సిందేనట! ‘దృశ్యం’ క్లైమాక్స్‌ ట్విస్ట్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ ట్విస్ట్‌ గురించి అయితే మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.
  • ‘రామాయణ’లో విక్రాంత్‌ మాస్సే?.. నటుడి రియాక్షన్‌ ఇదీ ‘రామాయణ’లో తాను భాగమైనట్లు వచ్చిన రూమర్స్‌పై నటుడు విక్రాంత్‌ మాస్సే స్పందించారు.
  • రాజమౌళి మరో ట్విస్ట్‌.. ‘వారణాసి’ మొత్తం ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదట! ‘వారణాసి’ (Varanasi) మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.
  • సినిమా టికెట్లు.. అలా మోసపోయా: విశ్వక్‌సేన్‌ ‘ఫంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్‌సేన్‌. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వులు పంచారు.