ఇంటర్నెట్ డెస్క్:చికెన్ ఫ్రై చాలా మందికి ఇష్టమైన వంటకం. బయట హోటళ్లకు వెళ్లకుండానే ఇంట్లోనే సులభంగా, రుచిగా చికెన్ ఫ్రై తయారు చేసుకోవచ్చు. అవసరమైన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
- చికెన్ – 500 గ్రాములు
- ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి – 2 (చిన్నగా తరిగినవి)
- కారం – 1 టీ స్పూన్ (రుచికి తగినంత)
- ధనియాల పొడి – 1 టీ స్పూన్
- గరం మసాలా – ½ టీ స్పూన్
- పసుపు – ¼ టీ స్పూన్
- ఉప్పు – తగినంత
- నిమ్మరసం – 1 టీ స్పూన్
- కరివేపాకు – కొద్దిగా
- నూనె – సరిపడా

తయారీ విధానం:
- ముందుగా చికెన్‌ను శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. తర్వాత ఒక బౌల్‌లో చికెన్ వేసి, అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 20–30 నిమిషాలు మెరినేట్ చేసుకోవాలి.
- తరువాత స్టౌవ్‌పై ఒక పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- ఇప్పుడు మెరినేట్ చేసిన చికెన్‌ను పాన్‌లో వేసి బాగా కలపాలి. మంటను మధ్యస్థంగా ఉంచి మూత పెట్టి 10–15 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో చికెన్ అంటుకోకుండా కలుపుతూ ఉండాలి.
- చికెన్ బాగా ఉడికిన తర్వాత మూత తీసి మంట పెంచి నీరు పూర్తిగా ఆరే వరకు వేయించాలి. చివరగా గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి స్టౌవ్ ఆఫ్ చేయాలి.
- ఈ రుచికరమైన చికెన్ ఫ్రైను వేడి వేడిగా అన్నం, రోటీ లేదా చపాతీతో తినవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో సర్వ్ చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.
(Note:ఇందులోని సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
For MoreLatest News
English Translation
Internet Desk:Chicken fry is a favorite dish of many people. You can make easy and delicious chicken fry at home without going out to hotels. Now let's know the required ingredients and preparation method..
Ingredients required:
- Chicken – 500 grams
- Onions – 2 (finely chopped)
- Ginger-garlic paste – 1 tbsp
- Green chillies – 2 (finely chopped)
- Pepper – 1 tsp (enough to taste)
- Coriander powder – 1 tsp
- Garam masala – ½ tsp
- Yellow – ¼ tsp
- Salt – enough
- Lemon juice – 1 tsp
- Curry – little
- Oil – enough

Preparation method:
- First wash the chicken 2-3 times. Then add chicken in a bowl, add salt, chilli, turmeric, coriander powder, ginger-garlic paste and mix well. Marinate this mixture for at least 20–30 minutes.
- Then put a pan on the stove and heat oil. After the oil is heated, add curry leaves and green chillies and fry for a while. Then add onions and fry until golden brown.
- Now add the marinated chicken to the pan and mix well. Keep the flame on medium and cover and cook for 10–15 minutes. The chicken should be mixed in between so that it does not stick.
- After the chicken is cooked well, remove the lid and raise the flame and fry until the water dries up completely. Finally add garam masala and lemon juice and turn off the stove.
- This delicious chicken fry can be eaten hot with rice, roti or chapati. If served with onion slices and lemon, it will taste better.
(Note:This information is just for your understanding.. ABN Andhrajyothy has not verified this)
For MoreLatest News