ఇంటర్నెట్ డెస్క్:చికెన్ ఫ్రై చాలా మందికి ఇష్టమైన వంటకం. బయట హోటళ్లకు వెళ్లకుండానే ఇంట్లోనే సులభంగా, రుచిగా చికెన్ ఫ్రై తయారు చేసుకోవచ్చు. అవసరమైన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం..


కావలసిన పదార్థాలు:

  • చికెన్ – 500 గ్రాములు
  • ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి – 2 (చిన్నగా తరిగినవి)
  • కారం – 1 టీ స్పూన్ (రుచికి తగినంత)
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా – ½ టీ స్పూన్
  • పసుపు – ¼ టీ స్పూన్
  • ఉప్పు – తగినంత
  • నిమ్మరసం – 1 టీ స్పూన్
  • కరివేపాకు – కొద్దిగా
  • నూనె – సరిపడా

Chicken (1).jpg

తయారీ విధానం:

  • ముందుగా చికెన్‌ను శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. తర్వాత ఒక బౌల్‌లో చికెన్ వేసి, అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 20–30 నిమిషాలు మెరినేట్ చేసుకోవాలి.
  • తరువాత స్టౌవ్‌పై ఒక పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
  • ఇప్పుడు మెరినేట్ చేసిన చికెన్‌ను పాన్‌లో వేసి బాగా కలపాలి. మంటను మధ్యస్థంగా ఉంచి మూత పెట్టి 10–15 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో చికెన్ అంటుకోకుండా కలుపుతూ ఉండాలి.
  • చికెన్ బాగా ఉడికిన తర్వాత మూత తీసి మంట పెంచి నీరు పూర్తిగా ఆరే వరకు వేయించాలి. చివరగా గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి స్టౌవ్ ఆఫ్ చేయాలి.
  • ఈ రుచికరమైన చికెన్ ఫ్రైను వేడి వేడిగా అన్నం, రోటీ లేదా చపాతీతో తినవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో సర్వ్ చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.

(Note:ఇందులోని సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )

For MoreLatest News