Nayanam Review: నయనం.. సైకలాజికల్ థ్రిల్లర్.. థ్రిల్ పంచిందా!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
వెబ్‌సిరీస్ : నయనం; నటీనటులు : వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్, ఉత్తేజ్, అలీ రజా, రేఖా నిరోషా, హరీష్ తదితరులు; దర్శకత్వం : స్వాతి ప్రకాశ్; స్ట్రీమింగ్ వేదిక : జీ5, విడుదల : డిసెంబర్ 19

ప్రేమకథా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ సందేశ్. ఇటీవల కాలంలో వైవిధ్యమైన కథలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘నయనం’. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది.
కథేంటంటే..
డాక్టర్ నయన్ (వరుణ్ సందేశ్) కంటి వైద్యుడు. చిన్నప్పటినుంచి ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడమంటే ఆయనకెంతో ఆసక్తి. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న టీచర్ మాటలతో కంటి వైద్యుడు అవుతాడు. న్యూటన్ గురుత్వాకర్షణ కనిపెట్టినట్లు కంటి సాయంతో ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేలా ఒక ప్రయోగం చేస్తాడు. తన దగ్గరకు వచ్చిన పేషెంట్ల కంటిలోకి ఒక రకమైన ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా 12 గంటల సమయంలో నాలుగు నిమిషాల పాటు వారు ఏం చేసినా ఒక ప్రత్యేక కళ్లజోడు ద్వారా చూడగలడు. అలా తన (Varun Sandesh) దగ్గర చికిత్స తీసుకున్న మాధవి (ప్రియాంక జైన్) తన భర్త గౌరీ శంకర్(ఉత్తేజ్)ను హత్య చేయడం చూస్తాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. మరి మాధవి తన భర్తను ఎందుకు హత్య చేసింది? ఈ విషయం నయన్ పోలీసులకు చెప్పాడా? సీఐ (అలీ రజా) ఈ కేసును పరిష్కరించాడా? అన్నది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే (Nayanam Review ).
ఎలా ఉందంటే..
యువ దర్శకులు సరికొత్త కాన్సెప్ట్‌తో సినిమాలను, సిరీస్‌లను రూపొందిస్తూ నేటితరం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా మర్డర్ మిస్టరీలను ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దుతున్నారు. నయనం కూడా ఈ కోవకు చెందిందే అయినా దర్శకురాలు స్వాతి సరికొత్త నేపథ్యాన్ని ఎంచుకొని సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మర్డర్ మిస్టరీకి సైన్స్ ఫిక్షన్ జోడించి తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆరంభ ఎపిసోడ్‌లోనే నయన్ పాత్ర, అతని వ్యక్తిత్వం, ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అతడు ప్రత్యేకంగా కళ్లజోడు కనిపెట్టడం తదితర సన్నివేశాలతో కథా ప్రపంచాన్ని పరిచయం చేసిన తీరు మెప్పిస్తుంది (Nayanam Review). ఆ తర్వాత కూడా కథలో ఇతర పాత్రల నేపథ్యాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడక్కడ ఫ్లాట్‌గా సాగిన అనుభూతి కలుగుతుంది.

ఎప్పుడైతే గౌరీ శంకర్‌ను మాధవి హత్య చేయడం నయన్ స్పెషల్ కళ్లజోడు ద్వారా చూస్తాడో.. అప్పుడే కథ కీలక మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి కథా కథనాలు చివరివరకు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతాయి. ఒకవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్.. మరోవైపు హత్య వెనక కారణాన్ని తెలుసుకునేందుకు నయన్ చేసే ప్రయత్నాలు.. ‘ఈ విషయంలో కలుగజేసుకోవద్దు’ అంటూ గుర్తుతెలియని వ్యక్తి అతడిని హెచ్చరించడం వంటి సన్నివేశాలతో సిరీస్ నడిపించిన విధానం అలరిస్తుంది. చివరి ఎపిసోడ్‌లో ట్విస్ట్ రివీల్ అయిన గౌరీశంకర్‌ను మాధవి ఎందుకు హత్య చేసిందో కారణం చెప్పకుండా ముగించి సీజన్ 2కు బాటలు వేయడం కాస్త నిరాశ పరుస్తుంది.
ఎవరెలా చేశారంటే..
డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ చక్కగా నటించాడు. ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలన్న యువకుడిగా అతని నటన బాగుంది. ప్రియాంక జైన్ పాత్ర కథలో ట్విస్ట్ ఇస్తుంది. అలీ రజా అలవాటైన పోలీస్ పాత్రలో చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలినవాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కూడా సిరీస్ బాగుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి కూడా తక్కువే. అరగంటకు కాస్త అటుఇటుగా కట్ చేసిన విధానం బాగుంది. దర్శకురాలు స్వాతి సరికొత్త నేపథ్యాన్ని ఎంచుకొని అంతే ఆసక్తిగా ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ను తీర్చిదిద్దారు. సీజన్ 2 కోసం మరిన్ని ఆసక్తికర విషయాలు దాచిపెట్టారు.
కుటుంబంతో కలిసి చూడొచ్చా? : ఈ సిరీస్‌లో ఎటువంటి అసభ్యత లేదు. ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.
- బలాలు
- + కథా నేపథ్యం
- + దర్శకత్వం, నిడివి
- + నటీనటులు
- బలహీనతలు
- - అక్కడక్కడ ఫ్లాట్‌గా సాగే స్క్రీన్ ప్లే
- చివరిగా: నయనం.. షార్ప్ అండ్ ఎంగేజింగ్.
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 10:44 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రివ్యూ: సీతా పయనం.. అర్జున్ దర్శకత్వం వహించిన మూవీ ఎలా ఉంది? ఐశ్వర్య అర్జున్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ‘సీతాపయనం’ చిత్రాన్ని రూపొందించారు అర్జున్. మరి ఈ మూవీ ఎలా ఉంది?
- రివ్యూ: కామెడీ డ్రామా ‘టీటీటీ’.. పెళ్లి ముఖ్యమా? అంతిమయాత్రా? జీవా హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టీటీటీ’. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
- ‘కపుల్ ఫ్రెండ్లీ’ రివ్యూ.. ప్రేమకథ మెప్పించిందా! ప్రేమికుల రోజు వచ్చిన ప్రేమకథ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకులను మెప్పించిందా..
- రివ్యూ: ఫంకీ.. విష్వక్‌సేన్‌కు విజయం దక్కిందా? విష్వక్‌సేన్ కథానాయకుడిగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్‌టైన్ ‘ఫంకీ’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: హనీ.. మరో క్షుద్ర నేపథ్యంతో వచ్చిన నవీన్ చంద్ర థ్రిల్లర్ మెప్పించిందా? నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: శ్రీ చిదంబరంగారు.. వైవిధ్య కథాంశంతో వచ్చిన మూవీ మెప్పించిందా? ఫిబ్రవరిలో బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల జోరు కనిపిస్తోంది. అలా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘శ్రీ చిదంబరంగారు’.
- రివ్యూ: యుఫోరియా.. గుణశేఖర్‌కు విజయాన్ని అందించిందా? ఈసారి విజయమే లక్ష్యంగా యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ తీసిన చిత్రం ‘యుఫోరియా’. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?Euphoria Movie Review
- రివ్యూ: సర్వం మాయ.. మలయాళంలో రూ.140కోట్లు వసూలు.. మూవీ ఎలా ఉంది? సింపుల్ కథకు హృద్యమైన సన్నివేశాలు జోడించి సినిమాను తీర్చిదిద్దుతుంటారు మలయాళ దర్శకులు. అలాంటి చిత్రమే ‘సర్వం మాయ’.
- రివ్యూ: గాంధీ టాక్స్.. మూకీ సినిమా ఎలా ఉంది? ‘గాంధీ టాక్స్’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని తెరపైకి తెచ్చి అందరి దృష్టినీ ఆకర్శించారు దర్శకుడు కిశోర్. ఈ చిత్ర కథేంటి? మాటల్లేని ఈ సినిమా భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?
- రివ్యూ: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా మెప్పించిందా? ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో విజయవంతమైన ‘జయ జయ జయ జయహే’కి రీమేక్ ఇది. మరి మాతృకతో పోలిస్తే ఇందులో కనిపించే కొత్త అంశం ఏంటి? ఎలాంటి వినోదాన్ని ఇచ్చింది?
- ‘సిరై’.. రూ.3కోట్లతో తీస్తే రూ.30 కోట్లు వసూలు చేసిన క్రైమ్ డ్రామా ఎలా ఉంది? తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటుడు విక్రమ్ ప్రభు. వైవిధ్యమైన కథలతో అలరించే ఆయన నటించిన 25వ చిత్రం ‘సిరై’.
- రివ్యూ: ‘బోర్డర్2’.. దేశభక్తి నేపథ్యం మరోసారి మెప్పించిందా? బాలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దేశభక్తి చిత్రాల్లో ‘బోర్డర్’కి ప్రత్యేక స్థానముంది. ఇప్పుడు 28ఏళ్ల తర్వాత ‘బోర్డర్ 2’ను తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు అనురాగ్ సింగ్. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకుల్ని అలరించిందా?
- రివ్యూ: చీకటిలో.. శోభిత ధూళిపాళ్ల క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించిన ‘చీకటిలో..’ ఎలా ఉంది?ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: తస్కరీ.. ఇమ్రాన్ హష్మీ వెబ్‌సిరీస్ థ్రిల్ పంచిందా? ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘తస్కరీ’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందంటే?
- రివ్యూ: కలాంకావల్.. సైకో కిల్లర్‌గా మమ్ముట్టి.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది? మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘కలాంకావల్’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: నారీ నారీ నడుమ మురారి.. శర్వానంద్ మూవీ ఎలా ఉందంటే? శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదలైంది.
- రివ్యూ: అనగనగా ఒక రాజు.. నవీన్ పొలిశెట్టి ఎంటర్‌టైనర్ ఎలా ఉంది? నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో మారి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా? రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: మన శంకరవరప్రసాద్‌గారు.. చిరు-అనిల్ కాంబో మెప్పించిందా? చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- వెబ్‌సిరీస్ రివ్యూ: కానిస్టేబుల్ కనకం: సీజన్-2.. చంద్రిక బతికే ఉందా? వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌కు కొనసాగింపు ఉంటుందని చివరిలో చూపించారు. మరి ఇప్పుడు వచ్చిన సీజన్2 ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది.