Nayanam Review: నయనం.. సైకలాజికల్ థ్రిల్లర్.. థ్రిల్‌ పంచిందా!

Eenadu icon
By Entertainment Team Updated : 20 Dec 2025 12:22 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

వెబ్‌సిరీస్‌ : నయనం; నటీనటులు : వరుణ్‌ సందేశ్‌, ప్రియాంక జైన్, ఉత్తేజ్, అలీ రజా, రేఖా నిరోషా, హరీష్ తదితరులు; దర్శకత్వం : స్వాతి ప్రకాశ్‌; స్ట్రీమింగ్‌ వేదిక : జీ5, విడుదల : డిసెంబర్‌ 19

ప్రేమకథా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ సందేశ్. ఇటీవల కాలంలో వైవిధ్యమైన కథలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘నయనం’. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది.

కథేంటంటే..

డాక్టర్ నయన్ (వరుణ్ సందేశ్) కంటి వైద్యుడు. చిన్నప్పటినుంచి ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడమంటే ఆయనకెంతో ఆసక్తి. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న టీచర్ మాటలతో కంటి వైద్యుడు అవుతాడు. న్యూటన్ గురుత్వాకర్షణ కనిపెట్టినట్లు కంటి సాయంతో ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేలా ఒక ప్రయోగం చేస్తాడు. తన దగ్గరకు వచ్చిన పేషెంట్ల కంటిలోకి ఒక రకమైన ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా 12 గంటల సమయంలో నాలుగు నిమిషాల పాటు వారు ఏం చేసినా ఒక ప్రత్యేక కళ్లజోడు ద్వారా చూడగలడు. అలా తన (Varun Sandesh) దగ్గర చికిత్స తీసుకున్న మాధవి (ప్రియాంక జైన్) తన భర్త గౌరీ శంకర్‌(ఉత్తేజ్)ను హత్య చేయడం చూస్తాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. మరి మాధవి తన భర్తను ఎందుకు హత్య చేసింది? ఈ విషయం నయన్ పోలీసులకు చెప్పాడా? సీఐ (అలీ రజా) ఈ కేసును పరిష్కరించాడా? అన్నది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే (Nayanam Review ). 

ఎలా ఉందంటే..

యువ దర్శకులు సరికొత్త కాన్సెప్ట్‌తో సినిమాలను, సిరీస్‌లను రూపొందిస్తూ నేటితరం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా మర్డర్ మిస్టరీలను ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దుతున్నారు. నయనం కూడా ఈ కోవకు చెందిందే అయినా దర్శకురాలు స్వాతి సరికొత్త నేపథ్యాన్ని ఎంచుకొని సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మర్డర్ మిస్టరీకి సైన్స్ ఫిక్షన్ జోడించి తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆరంభ ఎపిసోడ్‌లోనే నయన్ పాత్ర, అతని వ్యక్తిత్వం, ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అతడు ప్రత్యేకంగా కళ్లజోడు కనిపెట్టడం తదితర సన్నివేశాలతో కథా ప్రపంచాన్ని పరిచయం చేసిన తీరు మెప్పిస్తుంది (Nayanam Review). ఆ తర్వాత కూడా కథలో ఇతర పాత్రల నేపథ్యాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడక్కడ ఫ్లాట్‌గా సాగిన అనుభూతి కలుగుతుంది.

ఎప్పుడైతే గౌరీ శంకర్‌ను మాధవి హత్య చేయడం నయన్ స్పెషల్ కళ్లజోడు ద్వారా చూస్తాడో.. అప్పుడే కథ కీలక మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి కథా కథనాలు చివరివరకు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతాయి. ఒకవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్.. మరోవైపు హత్య వెనక కారణాన్ని తెలుసుకునేందుకు నయన్ చేసే ప్రయత్నాలు.. ‘ఈ విషయంలో కలుగజేసుకోవద్దు’ అంటూ గుర్తుతెలియని వ్యక్తి అతడిని హెచ్చరించడం వంటి సన్నివేశాలతో సిరీస్ నడిపించిన విధానం అలరిస్తుంది. చివరి ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ రివీల్ అయిన గౌరీశంకర్‌ను మాధవి ఎందుకు హత్య చేసిందో కారణం చెప్పకుండా ముగించి సీజన్ 2కు బాటలు వేయడం కాస్త నిరాశ పరుస్తుంది. 

ఎవరెలా చేశారంటే..

డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ చక్కగా నటించాడు. ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలన్న యువకుడిగా అతని నటన బాగుంది. ప్రియాంక జైన్‌ పాత్ర కథలో ట్విస్ట్ ఇస్తుంది. అలీ రజా అలవాటైన పోలీస్ పాత్రలో చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలినవాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కూడా సిరీస్ బాగుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి కూడా తక్కువే. అరగంటకు కాస్త అటుఇటుగా కట్ చేసిన విధానం బాగుంది. దర్శకురాలు స్వాతి సరికొత్త నేపథ్యాన్ని ఎంచుకొని అంతే ఆసక్తిగా ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ను తీర్చిదిద్దారు. సీజన్ 2 కోసం మరిన్ని ఆసక్తికర విషయాలు  దాచిపెట్టారు.

కుటుంబంతో కలిసి చూడొచ్చా? : ఈ సిరీస్‌లో ఎటువంటి అసభ్యత లేదు. ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.

  • బలాలు 
  • + కథా నేపథ్యం 
  • + దర్శకత్వం, నిడివి
  • + నటీనటులు 
  • బలహీనతలు
  • - అక్కడక్కడ ఫ్లాట్‌గా సాగే స్క్రీన్ ప్లే 
  • చివరిగా: నయనం.. షార్ప్ అండ్ ఎంగేజింగ్.
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 10:44 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రివ్యూ: సీతా ప‌య‌నం.. అర్జున్‌ దర్శకత్వం వహించిన మూవీ ఎలా ఉంది? ఐశ్వ‌ర్య అర్జున్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తూ స్వీయ ద‌ర్శ‌క‌నిర్మాణంలో ‘సీతాప‌య‌నం’ చిత్రాన్ని రూపొందించారు అర్జున్‌. మరి ఈ మూవీ ఎలా ఉంది?
  • రివ్యూ: కామెడీ డ్రామా ‘టీటీటీ’.. పెళ్లి ముఖ్యమా? అంతిమయాత్రా? జీవా హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘టీటీటీ’. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ రివ్యూ.. ప్రేమకథ మెప్పించిందా! ప్రేమికుల రోజు వచ్చిన ప్రేమకథ ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ ప్రేక్షకులను మెప్పించిందా..
  • రివ్యూ: ఫంకీ.. విష్వక్‌సేన్‌కు విజయం దక్కిందా? విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్‌టైన్‌ ‘ఫంకీ’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • రివ్యూ: హనీ.. మరో క్షుద్ర నేపథ్యంతో వచ్చిన నవీన్‌ చంద్ర థ్రిల్లర్‌ మెప్పించిందా? నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘హనీ’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ పంచింది?
  • రివ్యూ: శ్రీ చిదంబ‌రంగారు.. వైవిధ్య కథాంశంతో వచ్చిన మూవీ మెప్పించిందా? ఫిబ్ర‌వ‌రిలో బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాల జోరు కనిపిస్తోంది. అలా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘శ్రీ చిదంబ‌రంగారు’.
  • రివ్యూ: యుఫోరియా.. గుణశేఖర్‌కు విజయాన్ని అందించిందా? ఈసారి విజయమే లక్ష్యంగా యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్‌ తీసిన చిత్రం ‘యుఫోరియా’. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?Euphoria Movie Review 
  • రివ్యూ: సర్వం మాయ.. మలయాళంలో రూ.140కోట్లు వసూలు.. మూవీ ఎలా ఉంది? సింపుల్‌ కథకు హృద్యమైన సన్నివేశాలు జోడించి సినిమాను తీర్చిదిద్దుతుంటారు మలయాళ దర్శకులు. అలాంటి చిత్రమే ‘సర్వం మాయ’.
  • రివ్యూ: గాంధీ టాక్స్‌.. మూకీ సినిమా ఎలా ఉంది? ‘గాంధీ టాక్స్‌’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని తెరపైకి తెచ్చి అందరి దృష్టినీ ఆకర్శించారు దర్శకుడు కిశోర్‌. ఈ చిత్ర కథేంటి? మాటల్లేని ఈ సినిమా భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?
  • రివ్యూ: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా మెప్పించిందా? ‘ఓం శాంతి శాంతి శాంతిః’.  మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘జ‌య జ‌య జ‌య జ‌య‌హే’కి రీమేక్‌ ఇది. మరి మాతృక‌తో పోలిస్తే  ఇందులో క‌నిపించే కొత్త అంశం ఏంటి? ఎలాంటి వినోదాన్ని ఇచ్చింది?
  • ‘సిరై’.. రూ.3కోట్లతో తీస్తే రూ.30 కోట్లు వసూలు చేసిన క్రైమ్‌ డ్రామా ఎలా ఉంది? తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటుడు విక్రమ్‌ ప్రభు. వైవిధ్యమైన కథలతో అలరించే ఆయన నటించిన 25వ చిత్రం ‘సిరై’.
  • రివ్యూ: ‘బోర్డర్‌2’.. దేశభక్తి నేపథ్యం మరోసారి మెప్పించిందా? బాలీవుడ్‌ నుంచి వచ్చిన గొప్ప దేశభక్తి చిత్రాల్లో ‘బోర్డర్‌’కి ప్రత్యేక స్థానముంది. ఇప్పుడు 28ఏళ్ల తర్వాత ‘బోర్డర్‌ 2’ను తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు అనురాగ్‌ సింగ్‌. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకుల్ని అలరించిందా?
  • రివ్యూ: చీకటిలో.. శోభిత ధూళిపాళ్ల క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?  శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించిన ‘చీకటిలో..’ ఎలా ఉంది?ఎలాంటి థ్రిల్‌ పంచింది?
  • రివ్యూ: తస్కరీ.. ఇమ్రాన్‌ హష్మీ వెబ్‌సిరీస్‌ థ్రిల్ పంచిందా? ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘తస్కరీ’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?
  • రివ్యూ: కలాంకావల్‌.. సైకో కిల్లర్‌గా మమ్ముట్టి.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది? మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘కలాంకావల్‌’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ పంచింది?
  • రివ్యూ: నారీ నారీ నడుమ మురారి.. శర్వానంద్‌ మూవీ ఎలా ఉందంటే? శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదలైంది.
  • రివ్యూ: అనగనగా ఒక రాజు.. నవీన్‌ పొలిశెట్టి ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది? నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో మారి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • రివ్యూ: భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి.. రవితేజ ఖాతాలో హిట్‌ పడిందా? రవితేజ కథానాయకుడిగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • రివ్యూ: మన శంకరవరప్రసాద్‌గారు.. చిరు-అనిల్‌ కాంబో మెప్పించిందా? చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • వెబ్‌సిరీస్‌ రివ్యూ: కానిస్టేబుల్‌ కనకం: సీజన్‌-2.. చంద్రిక బతికే ఉందా? వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌కు కొనసాగింపు ఉంటుందని చివరిలో చూపించారు. మరి ఇప్పుడు వచ్చిన సీజన్‌2 ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ పంచింది.

English Translation

Nayanam Review: Nayanam.. Psychological Thriller.. Thrill Panchinda!

Eenadu icon
By Entertainment Team Updated : 20 Dec 2025 12:22 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

Webseries : Nayanam; Actors: Varun Sandesh, Priyanka Jain, Utj, Ali Raza, Rekha Nirosha, Harish and others; Directed by: Swati Prakash; Streaming Platform : G5, Released : December 19

Varun Sandesh made a special name for himself by acting in love story films. In recent times they are trying to entertain with different stories. His latest web series 'Nayanam' is a part of this. And how is this series? What a thrill.

The story is..

Dr. Nayan (Varun Sandesh) is an eye doctor. He is very interested in knowing other people's personal things since childhood. He becomes an eye doctor with the words of the teacher, 'Sarvendriyanam Nayanam Pradhanam'. Just as Newton discovered gravity, he does an experiment to see what is going on in other people's homes with the help of his eyes. By injecting a type of injection into the eyes of his patients, he was able to see through a special pair of glasses whatever they were doing for four minutes out of 12 hours. So Madhavi (Priyanka Jain) who gets treatment from him (Varun Sandesh) sees her husband Gauri Shankar (Uttej) murdered. He is suddenly shocked by this. Why did Madhavi kill her husband? Did Nayan tell the police about this? Did the CI (Ali Raza) solve this case? To know that, you have to watch the series (Nayanam Review). 

How is it..

Young directors are making movies and series with a new concept and surprising the audience today. Especially the murder mysteries are being made entertaining. Although Nayanam also belongs to this category, director Swathi has chosen a new background and made the series more interesting. The way science fiction is added to the murder mystery is good. Nayanam's character, his personality, the way he invents special glasses to know other people's personal things and so on, introduces the world of the story (Nayanam Review) in the very first episode. Even after that they tried to tell the background of other characters in detail in the story. This gives a flat feeling here and there.

Whenever Nayan sees Madhavi killing Gauri Shankar through special glasses.. then the story takes a crucial turn. From there, the story continues in suspense till the end. On the one hand, the police investigation. On the other hand, Nayan's efforts to find out the reason behind the murder. The twist revealed in the last episode is a bit disappointing as it ends without explaining why Madhavi killed Gauri Shankar and paves the way for season 2. 

Who did it..

Varun Sandesh played the role of Dr. Nayan well. His performance as a young man who wants to know other people's personal matters is good. Priyanka Jain's character gives a twist to the story. Ali Raza left in his usual police role. The rest acted according to their scope. Technically the series is also good. The length of each episode is also short. The way it is cut a bit here and there for half an hour is good. Director Swathi has chosen a new background and has fashioned this murder mystery thriller with equal interest. More interesting things are hidden for Season 2.

Watch it with the family? : There is no profanity in this series. Can be watched with family without objection.

  • Strengths
  • + Storyline
  • + Direction, Length
  • + Actors
  • Weaknesses
  • - Flat Screenplay here and there
  • Finally: Nayanam.. Sharp and Engaging.
  • Note: This review is from the point of view of the reviewer which is only the personal opinion of the reviewer.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 10:44 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Review: Seetha Payanam.. How is Arjun directed movie? Introducing Aishwarya Arjun to the Telugu audience, Arjun made a self-directed film 'Seethapayanam'. And how is this movie?
  • Review: Comedy drama 'TTT'.. Is marriage important? The final journey? Jeeva's latest movie is 'TTT'. Currently, the OTT is streaming on 'Netflix'.
  • 'Couple Friendly' review.. Did you like the love story? Did the love story 'Couple Friendly' that came on Valentine's Day please the audience..
  • Review: Funky.. Has Vishwaksen succeeded? How is the comedy entertainer 'Funky' directed by KV Anudeep starring Vishwaksen? What kind of entertainment was it?
  • Review: Honey.. Did you like Naveen Chandra's thriller with another occult theme? How is the horror thriller movie 'Honey' starring Naveen Chandra in the lead role? What kind of thrill did it spread?
  • Review: Mr. Chidambarangaru.. Did you like the movie with a different plot? In February, there is a boom in small films at the box office. So today the movie 'Sri Chidambarangaru' came to the audience.
  • Review: Euphoria.. Did it bring success to Gunasekhar? Gunasekhar's film 'Euphoria' is aiming for success this time with the youth in mind. And what is the story of this film? What kind of experience did it give to the audience? Euphoria Movie Review
  • Review: Sarvam Maya.. Collected Rs.140 Crores in Malayalam.. How is the movie? Malayalam directors add heartwarming scenes to the simple story and make the movie. One such film is 'Sarvam Maya'.
  • Review: Gandhi Talks.. How is a silent film? Director Kishore attracted everyone's attention by releasing a silent film titled 'Gandhi Talks'. What is the story of this film? Has this wordless movie impressed the audience with emotions? Or not?
  • Review: Om Shanti Shanti Shantih.. Did you like the husband and wife comedy drama? 'Om Shanti Shanti Shantih'.  It is a remake of Malayalam hit 'Jaya Jaya Jaya Jayahe'. And compared to the matrix, what is new? What kind of entertainment did it give?
  • 'Sirai'.. how is the crime drama that collected Rs.30 crore if it was made with Rs.3 crore? Apart from Tamil, actor Vikram Prabhu is known to Telugu audience. 'Sirai' is his 25th film that entertains with diverse stories.
  • Review: 'Border2'.. Is the patriotic theme appealing once again? 'Border' has a special place among the great patriotic films from Bollywood. Now after 28 years, director Anurag Singh has brought 'Border 2' to the screen. And what is the story of this film? Did it entertain the audience?
  • Review: In the dark.. Did Shobhita Dhulipalla's crime thriller please?  How was 'Chikatilo..', directed by Saran Koppishetty and starring Sobhita Dhulipalla in the lead role? What kind of thrill did it give?
  • Review: Taskari.. Emraan Hashmi's web series gave a thrill? Taskari is a crime thriller web series starring Emraan Hashmi. How is this series streaming on Netflix?
  • Review: Kalankavaal.. Mammootty as Psycho Killer.. Malayalam Blockbuster? How is Mammootty's 'Kalankaval' movie? What kind of thrill did it spread?
  • Review: Nari Nari Naduma Murari.. How is Sharwanand's movie? 'Nari Nari Naduma Murari' is a family entertainer starring Sharwanand. Released on Wednesday evening on the occasion of Sankranthi.
  • Review: Aanganaga Ok Raju.. How is Naveen Polishetty's entertainer? How is the family entertainer directed by Mari with Naveen Polishetty and Meenakshi Chaudhary in key roles? What kind of entertainment did it spread?
  • Review: An appeal to husband mahasayula.. Has Ravi Teja got a hit on his account? How is the family entertainer ``Bhartha Mahasayayyuku'' directed by Kishore Tirumala starring Ravi Teja as the protagonist? What kind of entertainment did it give?
  • Review: Mana Shankaravaraprasad.. Did Chiru-Anil combo please? How is the movie 'Mana Shankaravaraprasadgaru' directed by Anil Ravipudi starring Chiranjeevi? What kind of entertainment?
  • Webseries Review: Constable Kanakam: Season-2.. Is Chandrika alive? The suspense thriller starring Varsha Bollamma in the lead role has been shown at the end to have a sequel. And how is season 2 now? What a thrill it was.