హైదరాబాద్:భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము నిన్ననే నగరానికి రాగా.. ఈరోజు(శనివారం) సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోగా.. మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల ముగింపు సదస్సులో ఉప రాష్ట్రపతి పాల్గొనున్నారు. మరోవైపు శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి.. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిన్న జరిగిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(పీఎస్సీ) ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈరోజు గచ్చిబౌలిలో బ్రహ్మ కుమారిస్ శాంతి సర్వోవర్‌ను ఆమె సందర్శించారు.


ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క రాష్ట్రపతి ముర్ముకి ఘనస్వాగతం పలికారు. బ్రహ్మ కుమారిస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటారు. కాగా, రెండ్రోజుల పర్యటన సందర్భంగా నేడు హైదరాబాద్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి.. నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్‌పర్సన్ల సమావేశ ముగింపు సెషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌కి వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు.


ఆదివారం ఉదయం శ్రీ రామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో నిర్వహించే వరల్డ్ మెడిటేషన్ డే కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నేరుగా ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.


ReadLatestandHealthNews


English Translation

Hyderabad:President of India Draupadi Murmu and Vice President CP Radhakrishnan are visiting Hyderabad. While Draupadi Murmu arrived in the city yesterday, CP Radhakrishnan arrived today (Saturday). When he reached the Shamshabad airport at noon today, Minister Sridhar Babu and officials extended a warm welcome. The Vice President participated in the closing conference of Public Service Commissioners today. On the other hand, the President, who came for winter vacation, was the chief guest at the National Conference of Public Service Commission (PSC) chairpersons held at Ramoji Film City yesterday. She visited Brahma Kumaris Shanti Sarvovar at Gachibowli today.


Governor Jishnu Dev Varma and Minister Sitakka extended a warm welcome to President Murmu on this occasion. She planted saplings in a special program organized on the occasion of 21st anniversary of Brahma Kumaris. Meanwhile, the Vice President, who reached Hyderabad today during his two-day visit, will go straight to Ramoji Film City. He participated as the chief guest in the closing session of the meeting of chairpersons of national level public service commissions held there. After this program, he will go to Raj Bhavan and stay there for the night.


On Sunday morning, he will attend the World Meditation Day program organized by Sri Ramachandra Mission, Heartfulness Institute at Kanha Shanti Vanam, Rangareddy district. Afterwards, Vice President CP Radhakrishnan will leave for Delhi directly. Telangana and Hyderabad Police are maintaining heavy security in the wake of the visits of the President and Vice President. rel="noopener">HealthNews