Andhra Pradesh News: చిలకలూరిపేట ప్రమాద ఘటన.. వెంకటనాయుడి ముఠా నుంచి మరిన్ని కార్లు స్వాధీనం

Eenadu icon
By Crime News Team Updated : 20 Dec 2025 13:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణమైన ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెంకటనాయుడు ముఠా చోరీ చేసిన కార్లను నరసరావుపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 కార్లను పీఎస్‌కు తరలించారు. గతంలోనూ 10 కార్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 కార్లను ఈ ముఠా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన కార్లు కూడా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ముఠా చిలకలూరిపేట పోలీసుల కస్టడీలో ఉంది. ఇప్పటికే వెంకటనాయుడు తండ్రి ఏఎస్సై శ్రీనివాసరావును ఎస్పీ సస్పెండ్ చేశారు. 

అసలేం జరిగిందంటే..?

ఈ నెల 4న నాదెండ్ల మండలం గణపవరం సమీపంలోని చిలకలూరిపేట బైపాస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో అయిదుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. వెంకటనాయుడి బృందం ఓ భారీ లారీని ఆపి అక్రమంగా డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజీ ద్వారా చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుల్ని సీసీ కెమెరాల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నాక డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఏఎస్సై శ్రీనివాసరావు కుమారుడి లీలలు వెలుగులోకి వచ్చాయి. 2023లో ఏఎస్సై కుమారుడు కోటప్పకొండ వద్ద రూ.2వేల నోట్ల మార్పిడికి రూ.10 లక్షల కమీషన్‌ ఎరవేసి.. కారుతో పాటు రూ.50 లక్షలు దోచుకున్నట్లు కేసు నమోదైంది. ఆ కేసులో తండ్రి పాత్రపై ఎప్పటినుంచో విచారణ ఫైలు ఎస్పీ కార్యాలయంలో పెండింగులో ఉంది.

ఏఎస్సై 15 ఏళ్లుగా నరసరావుపేటలోనే పనిచేస్తున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుడు వెంకటనాయుడు దందాలు చేసినట్లు, ఫైనాన్స్‌ కార్లను తీసుకొచ్చి ఫేక్‌ నంబర్లతో ఇతరులకు తక్కువ ధరకే అమ్మడం, గంజాయి క్రయవిక్రయాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటి విషయంలో కుమారుడిని ఎప్పటికప్పుడు రక్షిస్తూ.. అరాచకాలకు అండగా నిలిచినట్లు తేలడంతో ఏఎస్సైని మొదట వెల్దుర్తి ఠాణాకు బదిలీ చేశారు. ఇటీవల సస్పెండ్‌ చేశారు. ( Andhra Pradesh News)

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 13:11 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • 4 గ్రాముల బంగారం కోసం వృద్ధుడి దారుణ హత్య! శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన వృద్ధుడి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తస్కరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా హతమార్చారు.
  • కల్వర్టును ఢీకొన్న వాహనం..ముగ్గురి దుర్మరణం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
  • కత్తులతో పొడిచి న్యాయవాది దారుణ హత్య ఓ న్యాయవాదిని తన సొంత బావమరుదులే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది.
  • దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక పంట దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలంలో చోటు చేసుకుంది.
  • విద్యార్థిపై వార్డెన్ల దాష్టీకం.. ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపరిచిన ముగ్గురు వార్డెన్లపై ఖమ్మం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ కథనం ప్రకారం...
  • భార్యతో గొడవ.. కత్తెరతో పసికందు హత్య రక్షించాల్సిన తండ్రే రాక్షసుడిగా మారాడు. భార్యతో జరిగిన చిన్న గొడవకు అభం శుభం తెలియని పసికందును బలి తీసుకున్నాడు. కన్నకూతురు అని కూడా చూడకుండా, అత్యంత కిరాతకంగా కత్తెరతో పొడిచి చిన్నారిని హతమార్చాడు.
  • కారులోనే ప్రేయసిని కాల్చేసి.. తనూ కాల్చుకుని.. ప్రేమికుల రోజున ప్రేయసిని హత్యచేసి, ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన నొయిడాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దాద్రీ రోడ్డులో ఓ కారు చాలా సమయం నుంచి నిలిచి ఉందని పోలీసులకు సమాచారం శనివారం అందింది.
  • విమానంలో ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని బెదిరింపులు ‘ప్రయాణికుల మాటున దిల్లీ విమానంలో ఐదుగురు ఆత్మాహుతి బాంబర్లు ప్రయాణిస్తున్నారు.. శంషాబాద్‌లో ల్యాండింగ్‌ కాగానే ఆ విమానాన్ని పేల్చివేస్తాం’ అంటూ గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆర్జీఐఏ ఈ-మెయిల్‌కు సందేశం పంపించాడు.

English Translation

Andhra Pradesh News: Chilakaluripet accident.. More cars seized from Venkatanaidu's gang

Eenadu icon
By Crime News Team Updated : 20 Dec 2025 13:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Chilakaluripet: A crucial development has taken place in the case of ASI's son Venkatanaidu who caused an accident in Chilakaluripet of Palnadu district. The Narasa Raopet police seized the cars stolen by Venkatanaidu's gang. 8 cars were moved to PS. Earlier also 10 cars were impounded. The police found that the gang had stolen a total of 22 cars. Steps were taken to seize the rest of the cars as well. The gang is currently in the custody of the Chilakaluripet police. Venkatanaidu's father ASI Srinivasa Rao has already been suspended by the SP. 

What actually happened..?

It is known that five engineering students died in an accident at Chilakaluripet bypass near Ganapavaram in Nadendla mandal on 4th of this month. The Chilakaluripet rural police found that the accident occurred when Venkatanaidu's team stopped a heavy lorry and tried to collect money illegally. Later, after the accused were identified on the CCTV cameras and taken into custody, the activities of the son of ASI Srinivasa Rao, who works in the DSP's office, came to light. In 2023, a case was registered that ASI's son had stolen Rs.10 lakh commission for exchanging Rs.2000 notes at Kotappakonda and robbed Rs.50 lakhs along with a car. The investigation file on the father's role in that case is still pending in the SP's office.

ASI has been working in Narasa Raopet for 15 years. It is alleged that the son Venkatanaidu had committed robberies by obstructing the father's authority, brought finance cars and sold them to others at a low price with fake numbers, and was involved in the sale of ganja. The ASI was first transferred to Veldurthi police station as it was found that he was protecting his son from time to time and stood up to the anarchy. Recently suspended. ( Andhra Pradesh News)

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 13:11 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • The brutal murder of an old man for 4 grams of gold! An atrocity took place in Sripottisriramulu Nellore district. Unidentified persons brutally killed an old man who had gone to graze cattle to steal his gold ring.
  • Vehicle collided with culvert. Three persons from Karnataka were killed in a fatal road accident in the suburbs of Timmannapalli village of Oorkonda mandal of Nagarkarnool district.
  • Lawyer brutally stabbed to death An incident where a lawyer was stabbed to death by his own brother-in-law took place in Hyderabad on Saturday. The incident of a farmer committing suicide by drinking pesticide due to lack of crop yield has taken place in Bela mandal of Adilabad district. Wardens assault on a student.. A case was registered in Khammam second town police station on Saturday against three wardens who seriously injured a student. According to the story of Inspector Balakrishna...
  • Argument with wife.. Baby girl killed with scissors The father he was supposed to save turned into a monster. Abham sacrificed an unknown baby due to a small quarrel with his wife. Without even seeing that she was his daughter, he killed the child by stabbing him with a scissor.
  • A man committed suicide by shooting his girlfriend in the car... on Valentine's Day. According to the police report.. On Saturday, the police received information that a car had been parked on Dadri Road for a long time.
  • There were threats of suicide bombers in the plane. An unidentified person sent a message to the RGIA e-mail saying, 'According to the passengers, there are five suicide bombers traveling on the Delhi flight...we will blow up the flight when it lands in Shamshabad'.