గుట్టుగా కొని.. సరిహద్దు దాటించి

Eenadu icon
By Telangana Dist. Desk Published : 20 Dec 2025 03:22 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

రాష్ట్రం, ప్రదేశాలు, పరిస్థితులను బట్టి కొన్ని వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. వంటగ్యాస్‌ ఇదే కోవలోకి వస్తుంది. నిత్యావసరమైన గ్యాస్‌ ధరలు మన ప్రాంతంతో పోలిస్తే మహారాష్ట్రలో తక్కువగా ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు గుట్టుగా గ్యాస్‌ సిలిండర్లను సరిహద్దు దాటిస్తున్నారు.

అక్కడి వారి సహకారంతో..

జిల్లాకు చెందిన కొందరు దళార్లు పొరుగు రాష్ట్రంలోని నాందేడ్, ధర్మాబాద్‌ ప్రాంతాల గ్యాస్‌ డీలర్ల సహకారంతో ఈ తంతు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మన ప్రాంతంలోని ఖాళీ సిలిండర్లను అక్కడకు తీసుకెళ్లి వారివద్ద సిలిండర్లు తీసుకుంటున్నారు. మన ప్రాంతంతో పోలిస్తే అక్కడ గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర రూ.51 వరకు తక్కువ కాగా, వాణిజ్య సిలిండర్‌ ధర రూ.170 వరకు తక్కువగా లభ్యమవుతోంది. అక్కడ పెద్దమొత్తంలో సిలిండర్లను కొనుగోలు చేస్తూ స్థానికంగా ఎక్కువ ధరతో విక్రయిస్తున్నారు.

  • తానూరు, కుభీరు, కుంటాల, సారంగాపూర్‌ మండలాల పరిధిలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలున్నాయి. వీటిలో ప్రధాన రహదారులే కాకుండా అంతర్గతంగా ఉండే అనువైన ప్రాంతాల నుంచి సిలిండర్లను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఎక్కువ వ్యాపారం జరిగే హోటళ్లను సైతం తమ విక్రయకేంద్రాలుగా మార్చుకుంటున్నారు.

వాహనాల్లోనూ..

గ్యాస్‌ సిలిండర్లతో నడిచే వాహనాల వినియోగమూ ఎక్కువగానే ఉంది. ఎల్‌పీజీ ఫిల్లింగ్‌ కేంద్రాలతో పోలిస్తే నేరుగా సిలిండర్‌ నుంచి గ్యాస్‌ నింపుకోవడం ఖర్చు తక్కువవుతుంది. అద్దెకార్లు తిప్పేవారు ఎక్కువగా ఇలా రాయితీపై వచ్చే సిలిండర్లను తమ అవసరాలకు వాడుతున్నారు. 

ప్రధానంగా 14.2 కిలోలు, 19 కిలోల సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. సగటున రోజుకు 80 వరకు గృహావసర సిలిండర్లు, 40 వరకు వాణిజ్య సిలిండర్లు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన రోజుకు రూ. 10,800, నెలకు రూ. 3.24 లక్షలు చొప్పున వారికి గిట్టుబాటవుతోంది. ఇందులో రవాణా, ఇతరత్రా ఖర్చులు పోయినా రూ. 2 లక్షలకు పైగానే వెనకేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

రిహద్దు ప్రాంతాల్లో గతంలో ఉన్న తనిఖీ కేంద్రాల ఎత్తివేత కూడా వీరికి కలిసొచ్చినట్లయ్యింది. అడిగేవారు, ఆపేవారు లేకపోవడంతో చాలా సులభంగా సరిహద్దు దాటిస్తున్నారు. పరిశీలించి చూస్తే తప్ప వేబిల్లు, పన్ను చెల్లింపుల వ్యవహారం గుర్తించడం కష్టం. 

► Read latest Adilabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కష్టాలు [ 19-02-2026] కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇసుక లభించక ఇబ్బంది పడుతున్నారు. గతంలో వాగులనుంచి ఇసుక తీస్తే అటవీశాఖ అధికారులు వాహనాలను సీజ్‌ చేసేవారు.
  • భారాస నుంచి కాపాడేందుకే మద్దతిచ్చా [ 19-02-2026] కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ భారాస కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా కాపాడేందుకే తాను ఛైర్‌పర్సన్‌ ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చానని.. సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పేర్కొన్నారు.
  • విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు [ 19-02-2026] విమానాశ్రయం మాస్టర్‌ ప్లాన్‌కు అనుమతి వచ్చిందని, త్వరలో భూసేకరణ ప్రారంభమవుతుందని, ఇది జిల్లా ప్రజలకు శుభవార్త అని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ వెల్లడించారు.
  • దిగుబడి గగనం.. ప్రాణాలే పణం! [ 19-02-2026] ప్రకృతి అన్నదాతలను అతలాకుతలం చేస్తోంది.. అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. గత వానాకాలంలో అధిక వర్షాల కారణంగా పత్తిలో పూత, కాత రాలిపోయి దిగుబడులు తగ్గడంతో రైతులు నష్టపోయారు.. గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడంతో అప్పులు భారంగా మారుతున్నాయి.
  • అదే అలజడి.. తగ్గని వేడి [ 19-02-2026] క్యాతనపల్లి బల్దియా పాలకవర్గం ఎన్నికలో ఆది నుంచి అడ్డంకులు, ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లాలో మిగతా పురపాలికల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరగగా క్యాతనపల్లిలో మాత్రం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
  • ఊరుకో కన్నా.. అమ్మ పాఠాలు వింటోంది [ 19-02-2026] నూతనంగా ఎన్నికైన సర్పంచులకు పాలనలో మెలకువలపై అవగాహన పెంచేందుకు స్థానిక ఐజా ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కొంతమంది తమ చంటి పిల్లలతో శిక్షణకు హాజరయ్యారు.
  • మహాలక్ష్మీ.. సొమ్ము భద్రం [ 19-02-2026] బస్సులో సీటు దొరక్కపోతే గమ్యస్థానం వచ్చేవరకు నిలబడే వెళ్లాలి. ఆ ఇబ్బందికన్నా ఎలాగోలా కష్టపడి ఖాళీసీటు దొరికించుకోవాలనే ఆత్రం ప్రయాణికులది. అందుకే.. రద్దీలో ఉన్నా, తోపుళ్లు జరుగుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా బస్సెక్కి సీటులో కూర్చోవడమే లక్ష్యమన్నట్లుగా ఆరాటపడుతుంటారు.
  • మార్చి 9న పెళ్లి.. అంతలోనే విషాదం [ 19-02-2026] పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామనుకున్న తల్లిదండ్రుల గుండె పగిలింది.. ప్రమాదం రూపంలో యువకుడిని బలి తీసుకోవడంతో అందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు..
  • దైవ దర్శనానికి వెళ్తూ... తిరిగిరాని లోకాలకు [ 19-02-2026] భార్యాభర్తలు కలిసి వేలాల మల్లన్న సన్నిధికి బయలుదేరారు. కొద్ది నిమిషాల్లో గమ్యం చేరే సమయానికి లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కానరాని లోకాలకు తీసుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలోని ఖాసింపల్లి పైవంతెన వద్ద చోటు చేసుకుంది.

English Translation

Bulky.. across the border

Eenadu icon
By Telangana Dist. Desk Published : 20 Dec 2025 03:22 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Prices of some items fluctuate depending on the state, places and conditions. Cooking gas falls into this category. Essential gas prices are lower in Maharashtra as compared to our region. With the support of this, some brokers are crossing the border in bundles of gas cylinders.

With their cooperation there..

It seems that some brokers from the district are continuing this trick with the cooperation of gas dealers from Nanded and Dharmabad areas of the neighboring state. Empty cylinders in our area are taken there and cylinders are taken from them. Compared to our region, the price of a cylinder used for domestic purposes is as low as Rs.51, while the price of a commercial cylinder is available as low as Rs.170. There they buy cylinders in bulk and sell them locally at a higher price.

  • There are border areas of Maharashtra in Tanur, Kubhiru, Kuntala and Sarangapur mandals. Apart from the main roads, it seems that the cylinders are being moved from suitable areas inside.
  • They are also converting the hotels where there is a lot of business into their sales centers. The cost of filling gas directly from the cylinder is less as compared to LPG filling centres. The renters are mostly using these subsidized cylinders for their needs. 

    QIt seems that mainly 14.2 kg and 19 kg cylinders are used more. It is reported that on an average, 80 household cylinders and 40 commercial cylinders are being moved per day. In this calculation per day Rs. 10,800 per month, Rs. 3.24 lakhs is being paid to them. In this, transportation and other expenses are Rs. It is clear that more than 2 lakhs are going back.

    SThe lifting of check points in the border areas in the past also seems to have reached them. Crossing the border is very easy as there are no questioners or stops. It is difficult to identify the issue of waybill and tax payments except by looking. 

    ► Read latest Adilabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

    Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

    More

    • Sand problems for Indiramma's houses [ 19-02-2026] Beneficiaries of Indiramma Houses in Kawwal Tiger Conservation Center are facing difficulties due to lack of sand. In the past, if sand was taken from the rivers, the forest officials used to seize the vehicles. 19-02-2026] Sirpur MLA Palwai Harishbabu stated that he supported the Congress in the election of the Chairperson to protect the Kagajnagar Municipality from going into the hands of Bharasa. 19-02-2026] MP Godom Nagesh and MLA Payal Shankar revealed that the airport master plan has been approved and land acquisition will start soon, which is good news for the people of the district. [ 19-02-2026] Nature is harassing the rice farmers.. but due to excessive rains.. or lack of rains.. Due to heavy rains in the last monsoon, the farmers suffered losses due to the loss of cotton and reduced yields.. Due to the lack of remunerative prices, the debts are becoming heavy. 19-02-2026] In the election of Kyatanapally Baldia governing body, obstacles and suspense continue since the beginning. Elections were held peacefully in other municipalities in the district, but unexpected developments are taking place in Kyatanapally. 19-02-2026] The second round of training classes are being conducted at the local Aiza Engineering College to increase the awareness of the newly elected sarpanchs on governance. Some attended the training with their children.
    • Mahalakshmi.. money safe [ 19-02-2026] If you do not find a seat in the bus, you have to stand until you reach your destination. Passengers are more eager to find an empty seat than that trouble. That's why.. even if it's crowded or there's a rush going on.. they want to sit in the seat of the bus regardless of all that.
    • Marriage on 9th March. 19-02-2026] There was a great tragedy in that house where the wedding bells were to be sounded.. The hearts of the parents who wanted to make their son's wedding a grand affair were broken.. As the young man was sacrificed in the form of an accident, everyone was drowned in the sea of sorrow.. 19-02-2026] The husband and wife left together for the presence of Velala Mallanna. The incident took place at Khasimpally flyover in Indaram village of Jaipur mandal of Manchiryala district when death came in the form of a lorry and took them to unknown worlds within a few minutes.