సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్‌లో చిత్రీకరించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (man moves house on truck).
hey_itspriyanka అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటిని ట్రక్కు మీద వేసుకుని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్తున్నారు. న్యూజిలాండ్‌లో చాలా ఇళ్లను చెక్కతో కడతారు. అవి చాలా తేలికగా ఉంటాయి. అలాగే చాలా దృఢంగా కూడా ఉంటాయి. వాటిని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే వీలు ఉంటుంది. ఇలా ఇళ్లను ట్రక్కుల మీద వేసుకుని తరలించడం న్యూజిలాండ్‌లో తరచుగా కనిపించే విషయమే. అయితే ఇతర దేశాల వారికి మాత్రం ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది (house transported on highway).
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వంటి ప్రధాన నగరాల్లో భూమి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి (shocking viral video). ఎవరైనా తమ స్థలంలో కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు పాత ఇంటిని కూల్చివేసే బదులు, దానిని అమ్మి కొనుగోలుదారునికి ట్రక్కులో పంపుతారు. ఈ పద్ధతి వల్ల తక్కువ పర్యావరణ నష్టం జరుగుతుంది. న్యూజిలాండ్ ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే న్యూజిలాండ్‌లో చాలా మంది చెక్క ఇళ్లను కట్టుకోవడానికే ఆసక్తి చూపుతారు. న్యూజిలాండ్‌లో పాత ఇళ్లను కూలగొట్టి, కొత్తవి కట్టుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలుకోసం క్లిక్ చేయండి..
English Translation
The world of social media is very fascinating. Entertaining, engaging, innovative videos are always ready to attract netizens. Those videos are very popular on social media and are becoming very viral. Recently, a video shot in New Zealand is doing the rounds. The video is currently going viral on social media (man moves house on truck).
This video was shared on the Instagram handle hey_itspriyanka. According to the viral video, a house is put on a truck and taken from one place to another. Most houses in New Zealand are made of wood. They are very light. They are also very strong. They can be carried from one place to another. Moving houses on trucks like this is a common sight in New Zealand. But for other countries it is very surprising (house transported on highway).
Land prices are very high in major cities like Auckland in New Zealand (shocking viral video). When someone wants to build a new house on their lot, instead of tearing down the old house, they sell it and truck it to the buyer. This method causes less environmental damage. New Zealand places a high priority on nature. That is why many people in New Zealand are interested in building wooden houses. Demolishing old houses and building new ones is very rare in New Zealand.
Also Read..
Click for more Exclusive News..