కొమురం భీం జిల్లాలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఇల్లిల్లు తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శంకర్ సర్పంచ్‌గా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఓటర్లకు డబ్బులు పంచినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రతి ఇంటికి వెళ్లి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను అడుగుతున్నాడు. ఈ క్రమంలో డబ్బులు నిన్ను ఎవరు అడిగారని ఇచ్చావంటూ ఒక వృద్దురాలు ప్రశ్నించింది. డబ్బులు తిరిగిచ్చేది లేదని ముఖం మీదే చెప్పడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కింద వీడియోలో చూడొచ్చు.

Updated at - Dec 17 , 2025 | 09:14 PM


English Translation

The defeated Sarpanch candidate in Komuram Bhim district is going from house to house collecting money. The incident took place in Chintala Manepalli mandal Balaji. Shankar, a Congress-backed candidate from the village, contested as Sarpanch and was defeated. Even though money was distributed to the voters, there was no result. So he goes to every house and asks the voters to return the money he gave. An old woman asked who asked you for the money. There was an argument for a while as he said to his face that he would not return the money. Full details about this can be seen in the video below.

Updated at - Dec 17, 2025| 09:14 PM