తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. తాజాగా ఎన్నికల ఫలితాలు, ట్రెండ్స్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నిర్మల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. గత ఎన్నికలతో పోల్చితో ఈసారి బీజేపీ గణనీయమైన పురోగతి సాధించిందని అన్నారు. గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా ఈసారి బీజేపీకి మంచి ఓటింగ్ పడింది. కేంద్రం తీసుకువస్తున్న పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రోజు రోజుకీ బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం నిధులను తమ స్వలాభం కోసం ఖర్చు చేయకుండా చూడాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నాయి. చాలా చోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదు.. రెండో ఒక్కటే. మహాత్మా గాంధీ అంటే బీజేపీకి ఎంతో గౌరవం, రామరాజ గ్రామస్వరాజ్యం కోసమే ఉపాధి హామీ పథకం పేరు మార్చడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పథకం ఇంతకు ముందు 100 రోజులు ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం 120 రోజులకు పెంచింది.. దీని వల్ల ఎంతో మంది నిరుపేదలకు లాభం చేకూరుతుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి...


English Translation

The Gram Panchayat Elections in Telangana have been completed. BJP state president N Ramachandra Rao spoke on the recent election results and trends in a program held in Nirmal. He said that BJP has made significant progress this time compared to the previous elections. Even in districts which were not represented in the past, the BJP got a good turnout this time. The schemes brought by the center are going to the people. Day by day people's trust in BJP is increasing in this order. Development and welfare programs in the rural areas are being done with the funds of the central government.


They asked the BJP to win the upcoming elections to ensure that the state government does not spend the funds for their own benefit. Congress and BRS parties are bragging about their achievements. Many places have been criticized for abuse of power. But BRS - Congress party is not different.. The latter is the same. He said that Mahatma Gandhi has great respect for the BJP and that the name of the employment guarantee scheme was changed for the sake of Ramaraja Gram Swarajyam. The central government has increased the employment guarantee scheme from 100 days earlier to 120 days.. He said that this will benefit many poor people.