హైదరాబాద్:ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో కాల్పులకు తెగబడి పోలీసుల చేతుల్లో హతమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాది సాజిద్ అక్రమ్( Terrorist Sajid Akram)కు హైదరాబాద్( Hyderabad)తో సంబంధాలున్న సంగతి తెలిసిందే. అతను హైదరాబాద్ నగరంలోనే బీకామ్ వరకూ చదివారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి( DGP Shivadhar Reddy) తెలిపారు. సాజిద్ అక్రమ్ 27 సంవత్సరాల కాలంలో ఆరుసార్లు మాత్రమే భారతదేశానికి వచ్చాడని వెల్లడించారు. 1998లో అక్రమ్ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని.. ఆ తర్వాత అదే సంవత్సవరం యురోపియన్ కు చెందిన యువతి వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడని తెలిపారు.
పెళ్లి అయిన అదే ఏడాది మెుదటిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడని చెప్పారు. 2004లో ఓసారి, 2009 ఫిబ్రవరిలో మరోసారి నగరానికి వచ్చాడని డీజీపీ వెల్లడించారు. 2011 జూబ్లీ ప్రాపర్టీ సెటిల్మెంట్ ఇంకోసారి వచ్చాడని, 2016 మరోసారి ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడని చెప్పుకొచ్చారు. 2022 తల్లి, సోదరిని చూడటం కోసం నగరానికి డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. కాగా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధం ఉన్న తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్.. యూదులంతా బాండీ బీచ్‌లో హునెక్కా పండుగ చేసుకుంటుండగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో 16 మంది మృతిచెందగా.. 36 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని కుమారుడు నవీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నవీద్‌పై న్యూ సౌత్‌వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు. వాటిలో 15 హత్యలు, ఓ ఉగ్రవాద చర్యకు సంబంధించిన కేసులు ఉన్నాయి.
English Translation
Hyderabad:It is known that the terrorist Sajid Akram of the Islamic State of Iraq and Syria (Terrorist Sajid Akram), who was killed by the police in a shootout at Australia's Bandy Beach, has connections with Hyderabad. Telangana DGP Shivadhar Reddy said that he studied up to B.Com in Hyderabad city. Sajid Akram revealed that he came to India only six times in 27 years. He said that Akram went to Australia for employment in 1998. Later that year, he married a young European woman, Venera Grosso.
He said that he came to Hyderabad for the first time with his wife in the same year of marriage. The DGP revealed that he came to the city once in 2004 and again in February 2009. He said that he came here again in 2011 for Jubilee property settlement and in 2016 he came here again for property settlement. DGP Shivdhar Reddy told the city to see the mother and sister in 2022. Meanwhile, father and son Sajid Akram and Naveed Akram, who are related to the Islamic State of Iraq and Syria, were shot while celebrating Hunekkah festival at Bandi Beach.
In this shooting, 16 people died. Sajid Akram died on the spot in police firing, while his son Naveed was being treated at the hospital and was arrested by the police. On the other hand, Naveed has been charged with a total of 59 offenses by the Bandy Beach Police in New South Wales. Among them are 15 cases of murder and one related to a terrorist act.