న్యూఢిల్లీ, డిసెంబర్ 19:ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే కూటమి ఎంపీలతోనూ సీఎం సమావేశమయ్యారు. కూటమి ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సుమారు 40 నిమిషాల పాటు ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎక్కువ ఎదురుదెబ్బలే తగులుతున్నాయని అన్నారు.
ఒక్క వైద్య కళాశాలలు పీపీపీ వ్యవహారం మాత్రమే వాళ్లకి దొరికిందని తెలిపారు. ఆ విషయంలో కూడా ప్రజలు వాళ్లకి అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని చూశారని.. అది కూడా విఫలమే అయ్యిందని తెలిపారు. ఢిల్లీ స్థాయిలో కూడా పీపీపీ విధానంపై అధ్యయనం చేయాలని ఎంపీలను సీఎం కోరారు.
ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నడుస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రికి పలువురు ఎంపీలు వివరించారు. ‘మనకి గుర్తింపు పెరుగుతున్న కొద్దీ మనపై బాధ్యత ఎక్కువ అవుతుంది’ అని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉందని ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Read LatestAP NewsAndTelugu News
English Translation
New Delhi, December 19: Chief Minister Chandrababu Naidu (CM Chandrababu Naidu) is busy during his visit to Delhi. He is meeting many Union Ministers and discussing various projects and issues related to the state. The CM also met with the MPs of the alliance. AP CM Chandrababu directed the alliance MPs. Chandrababu spoke to the MPs for about 40 minutes. He said that the former CM YS Jagan Mohan Reddy is facing a lot of setbacks regarding the welfare schemes being undertaken in the state.
He said that only one medical college was a PPP affair. They said that people did not give them a chance in that regard as well. He said that they tried to make a drama in the name of Koti Sankhala.. that also failed. The CM asked the MPs to study the PPP system at the Delhi level as well.
Several MPs explained to the Chief Minister that hospitals are currently running on the PPP method in the states of Delhi and Gujarat. "The more recognition we have, the more responsibility we have," he said. Chief Minister Chandrababu Naidu said in the meeting of MPs that there is still a need to work responsibly in the state.
Also read...
Read LatestAP NewsAndTelugu News