రాజమండ్రి, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి):వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) రాజమండ్రిలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలను ప్రారంభించారు. అలాగే, కాలేజీలో విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించారు.


జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారు..

ఈ సందర్భంగా ప్రసంగించారు మంత్రి నారా లోకేశ్. ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. యువత భవిష్యత్‌పై ద్వేషంతోనే జగన్‌ ఈ పని చేస్తున్నారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే పలు ఐటీ సంస్థలపై వైసీపీ పిల్ వేసిందని ప్రస్తావించారు. ఇటీవల రహేజా ఐటీ పార్క్‌పైనా పిల్‌ వేశారని ఫైర్ అయ్యారు. ఐటీ ప్రాజెక్టులతో యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు మంత్రి నారా లోకేశ్.


యువత భవిష్యత్‌పై జగన్‌కు ఇంత ద్వేషం ఎందుకు..? అని ప్రశ్నించారు. ఏపీకి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచనా సబబా..? అని నిలదీశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకూడదని ధైర్యం చెప్పారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తి దేవుడు ఇస్తారని తెలిపారు. తాను ఏ తప్పు చేసినా అమ్మ కొట్టేవారని గుర్తుచేశారు. ఇప్పటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే అమ్మ తిట్టినా మనం బాధపడకూడదని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


విద్యార్థులతో మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పలు సమాధానాలు ఇచ్చారు.

విద్యార్థి హరివర్మ:

ప్రశ్న:డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందే అవకాశం కల్పించాలి.

మంత్రి నారా లోకేశ్ సమాధానం:విద్యతో పరిశ్రమను అనుసంధానం చేయాలి. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే నంబర్ వన్‌లో మనం ఉన్నాం. ఆక్వాను ప్రోత్సాహిస్తున్నామని వ్యాఖ్యానించారు.


విద్యార్థి శ్రీదేవి:

మహిళలను గౌరవించాలని పదేపదే చెబుతున్నారు కదా.. సోషల్ మీడియాలో, సినిమాల్లో మహిళలను అవమానపరుస్తున్నారు.


మంత్రి నారా లోకేశ్ సమాధానం:

నా తల్లిని కొంతమంది అవమాన పరిచారు. ఈ విషయంలో చాలా ఆవేదనకు గురయ్యాను. కేజీ నుంచి పీజీ వరకు మహిళలను గౌరవించాలనేది తాము లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. నైతిక విలువలపై ఒక చట్టం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.


విద్యార్థి సాత్విక:

డిగ్రీ చదువుకునేటప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకొనే అవకాశం కల్పిస్తారా..?

మంత్రి నారా లోకేశ్ సమాధానం:

నైపుణ్యం పోర్టల్‌లో కెరీర్ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని వివరించారు.


విద్యార్థి కీర్తన:

మీకు పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది.. కదా మీ మధ్య ప్రేమ ఎలా ఉంటుంది..? .

మంత్రి నారా లోకేశ్ సమాధానం:

భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి. పెద్దలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.


విద్యార్థి కిషోర్:

ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కదా ఏలా కల్పిస్తారు..?

మంత్రి నారా లోకేశ్ సమాధానం:

ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. గూగుల్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Read LatestAP NewsAndTelugu News


English Translation

Rajahmundry, December 18 (Andhra Jyoti):Andhra Pradesh State Education and IT Minister Nara Lokesh has expressed his anger against YCP chief YS Jagan Mohan Reddy. Minister Nara Lokesh visited Rajahmundry today (Friday). New buildings inaugurated at Rajahmundry Arts College. Also, Lokesh conducted an interview with the students in the college. Later, Adikavi Nannaiah inaugurated new buildings in the University.


Jagan and Co are conspiring..

Minister Nara Lokesh spoke on this occasion. He flagged that Jagan and Co are conspiring against IT investments and youth jobs. Is Jagan doing this out of hatred for the future of the youth? They showered questions. He mentioned that YCP has already lodged a PIL against many IT companies. Recently, Raheja came under fire for putting a pill on the IT park. He clarified that more than one lakh jobs will be created for the youth with IT projects. Minister Nara Lokesh said that Jagan is working to prevent the development of the state.


Why does Jagan have so much hatred for the future of the youth..? He asked. Why is the idea of ​​blocking the investments and jobs coming to AP..? He deposed that. Students are encouraged not to commit suicide. He said that God gives strength to overcome the challenges faced in life. He reminded me that his mother used to beat him whenever he did anything wrong. Minister Lokesh said that if we do something wrong, even if mother scolds us, we should not feel sad.


Minister Nara Lokesh conducted an interview with the students. On this occasion, he gave many answers to the questions asked by the students.

Student Harivarma:

Question:We should provide an opportunity to get a job after completing the degree.

Minister Nara Lokesh Answer:Industry should be linked with education. We are number one in the world in Aqua sector. They commented that they are encouraging Aqua.


Student Sridevi:

They are repeatedly saying that women should be respected.. They are insulting women in social media and movies.


Minister Nara Lokesh Answer:

My mother was insulted by some people. I was very upset about this. We have decided to aim to respect women from KG to PG. He mentioned that they are trying to bring a law on moral values.


Student Satvika:

Would they be given the opportunity to do part-time job while studying for degree..?

Minister Nara Lokesh Answer:

Explained that students will be given an opportunity through career counseling on Naipunyam portal.


Student Keertana:

You have had a marriage arranged by elders.. How can there be love between you..? .

Minister Nara Lokesh Answer:

There should be understanding between husband and wife. It is advised to take adults as role models and move forward.


Student Kishore:

20 lakh jobs will be provided in AP. How will they provide it?

Minister Nara Lokesh's answer:

We are working hard to create jobs in the private and public sectors. We provide jobs through Google. Minister Nara Lokesh said that the job calendar will be announced in January.


Also read this news..

Read LatestAP NewsAndTelugu News