అమరావతి, డిసెంబర్ 19:రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రజా రాజధానిలో పర్యటించేందుకు మలేషియా బృందం శుక్రవారం అమరావతికి చేరుకుంది. ఈ ప్రతినిధులతో ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. రాజధాని నిర్మాణ పురోగతిని ఈ సందర్భంగా వారికి వివరించింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మలేషియా బృందంలోని సభ్యులు స్పష్టం చేశారు.
ఇక రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను వివరించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రతినిధి బృందాలు ఇప్పటికే పలు దేశాలు పర్యటించారు. నవంబర్ రెండో వారం చివర్లో సీసీఐ ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరిగింది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇక విశాఖలో గుగూల్ డేటా సెంటర్ సైతం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
Updated Date - Dec 19 , 2025 | 10:05 PMEnglish Translation
Amaravati: Huge investments in Amaravati...Malaysian companies come forward
ABN, Publish Date - Dec 19 , 2025 | 09:48 PM
Malaysian companies have recently come forward to invest heavily in Amaravati. A Malaysian delegation arrived in Amaravati on Friday to tour the public capital.

Amaravati, December 19:Many foreign companies are showing interest in investing in the capital Amaravati. Recently, Malaysian companies have come forward to invest heavily in Amaravati. The Malaysian team reached Amaravati on Friday to tour the public capital. A group of high officials met with these representatives. On this occasion, the progress of capital construction was explained to them. The members of the Malaysian team have made it clear that they are ready to invest in Amaravati.
The delegations of CM Chandrababu and Minister Narayana have already visited many countries to explain the possibilities of investing in other capital as well as in different areas across the state. At the end of the second week of November, a partnership conference was held at Visakhapatnam under the auspices of CCI. Investments have flowed in the state through this conference. It is known that Google data center will also be set up in Visakha.
Read this news also..
The news is like a festival.. Railway Department Key Announcement
CM Chandrababu with Amit Shah Bheti
For MoreAP NewsAndTelugu News
Updated Date - Dec 19, 2025 | 09:53 PMSubscribe