సృష్టి బతుకమ్మాయె...

- A
- A+
- A++

బతుకమ్మ పూల పండుగ. ఆటల పాటల పండుగ. కళలు, పంటల పండుగ. ప్రకృతిలో మమేకమయ్యే పండుగ. కుటుంబ అనుబంధాల పండుగ. సామాజిక సంబంధాలకు నెలవు. ఆడవాళ్లకు ఆటవిడుపు. పేరులోనే దీవెన గలది. గొబ్బెమ్మ, ఓనం కూడా బతుకమ్మను పోలిన పూల పండుగలే. అయినా ఇది ప్రత్యేకమైనది. విశిష్టమైనది. బతుకమ్మ ఒంటరిది కాదు. ముందు బొడ్డెమ్మను తర్వాత విజయ దశమిలను తోడుగా తెస్తుంది. బతుకమ్మ ఊరంతటినీ ఏకం చేస్తుంది. ముఖ్యంగా బతుకమ్మ పాటలు విశేషమైనవి, విశిష్టమైనవి.
‘ధరచోళ దేశమున ఉయ్యాలో ధర్మాంగదుడను రాజు ఉయ్యాలో’ పాటలో కొడుకులు చనిపోగా చేసిన తపస్సు వల్ల పుట్టిన బిడ్డను అత్రి వసిష్ఠుడు చేరి ‘బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మ తీరింది’; ‘శ్రీలక్ష్మి ఉయ్యాలో, సృష్టి బతుకమ్మాయె ఉయ్యాలో, పుట్టినా రీతిజెప్పె ఉయ్యాలో, భట్టు నరసింహకవి ఉయ్యాలో’ లాంటి పాటలు బతుకమ్మ పండుగ పుట్టు పూర్వోత్తరాలను చెబుతాయి. ఆ తర్వాత వచ్చే పాటలన్నీ బతుకమ్మ పూలతో మమేకమైన తీరును వర్ణిస్తాయి. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ’ అని పూల పరిచయం చేస్తూ... ‘అలరి గుమ్మడి పూలతో ఉయ్యాలో అరుగులు వేయించి ఉయ్యాలో గునుగు పూలతో ఉయ్యాలో గోడలు పెట్టించి ఉయ్యాలో’ అంటూ పూలతో పేర్చే బతుకమ్మను వర్ణిస్తాయి.
‘తంగేడు పూవుల్ల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ’ అంటూ నిమజ్జనం చేసి, ‘ఇసుకల పుట్టిన గౌరమ్మ, ఇసుకలో పెరిగిన గౌరమ్మ’ అంటూ ఆ అమ్మను నీళ్లలో ఓలలాడించి పసుపు కుంకుమలతో స్త్రీలంతా పరస్పరం గౌరవించుకుంటూ పాడే పాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పైకి చూడటానికి అచ్చట్లు ముచ్చట్లతో ఆటవిడుపుగా కనపడ్డా స్త్రీల జీవితాలతో సంపూర్ణంగా ముడిపడి ఉండే సంస్కృతీ సంప్రదాయాలకు ఈ పాటలు అద్దం పడతాయి. పెళ్లే ధ్యేయంగా జరిగే పెంపకంతో పాటు ‘హిమవంతూనింట్లో పుట్టి...’ అనే పాటలో ‘గన్నేరు కొమ్మను తెచ్చి పత్తి విత్తనాలు చేసి’ అంటూ పెళ్లి రీతులు, అప్పగింతలు, అత్తారింట్లో నడుచుకోవాల్సిన తీరుపై సుద్దులు బుద్ధులు, సంతాన ప్రాప్తికి పడే తపన లాంటివన్నీ చెబుతారు.
‘అర్ధరాత్రి పూట ఉయ్యాలో ఒక జాము దాటి ఉయ్యాలో అలుకవేళాయె ఉయ్యాలో’ పాటలో అర్జునుడు సుభద్రల మధ్య కట్నకానుకలు, అల్లుళ్ల దెప్పిపొడుపులు, పుట్టింటితో ఆడబిడ్డల అనుబంధాలు... ప్రస్తావనకు వస్తాయి. సమష్టి కుటుంబాల్లో కోడళ్ల వెతలు, బహుభార్యత్వం, అత్యాచారాలు లాంటి వాటికి బాధితులైన స్త్రీల వేదనలు, ఏకాంతం కోసం నవదంపతుల ఆరాటం, జానపదులుగా రూపాంతరం చెందిన దేవతలు, ఆధ్యాత్మిక అంశాలు, వృత్తి పనుల తీరుతెన్నులు, స్త్రీల అలంకరణలు... సమస్తం గేయాలై అబ్బురపరుస్తాయి. రేణుకాదేవి ఎల్లమ్మ పాట, మాయలఫకీరు పాట, రాజరంపాలుని కథలు కూడా బతుకమ్మ గీతాల్లో కనిపిస్తాయి. ఏది ఏమైనా బతుకమ్మ పాటలు ఒక సంస్కృతి... సంప్రదాయం. బతుకమ్మ పాటలకు బతుకమ్మ పాటలే సాటి.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి బ్రహ్మశక్తి- సృష్టికి జ్ఞానాన్ని, వాక్కుకు అర్థాన్ని, మానవ బుద్ధికి వివేకాన్ని ప్రసాదించే చైతన్యశక్తి.
- శ్రీమంతుడు జీవన ప్రయాణంలో మనిషికి నీడలా... మనుగడ, ఆశ కలిసి ప్రయాణం సాగిస్తాయి. సృష్టిలో ఏ జీవికీ లేనన్ని అవసరాలు, కోరికలు మనిషి మనసులో పుడుతుంటాయి. వాటి నుంచి విముక్తి పొందడం అంత తేలిక కాదు. అవి తీరని కోరికలైనప్పుడు దుఃఖం, కోపం వంటి అరిషడ్వర్గాలు మెండై, మనిషిని వేదన వైపు నడిపిస్తాయి.
- మనోపరిణతి చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగి ఫలాలను అందించి, అలసినవారికి నీడనిచ్చినప్పుడే దానికి సార్థకత. చంద్రుడు క్రమంగా కళలను పెంచుకుని పూర్ణత్వాన్ని పొందినప్పుడే పున్నమి వెన్నెల అలరిస్తుంది.
- శ్రమే దైవం సృష్టిలోని ప్రతి జీవికీ శ్రమతోనే ఆనందం లభిస్తుంది. దాంతోనే జీవితంలో ఏదైనా సాధించగలం. శ్రమ అంటే కేవలం శారీరక కష్టం కాదు. ఒక తపస్సు, ఒక యజ్ఞం, ముక్తికి మార్గం. శ్రమకు నిర్వచనం అనవచ్చు భగీరథుణ్ని. సగర పుత్రుల మోక్షం కోసం గంగను భూమికి తేవాలని సంకల్పించాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు.
- రెండు వేళ్ల రహస్యం కృష్ణుడంటే గోపికలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. అయితే యశోదమ్మ ప్రేమకు బంధితుడైన బాలకృష్ణుడి ఘట్టం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని దాచుకుంది.
- విజయం దిశగా పయనం అమ్మ పండుగకు వేళయింది. ఈ అమ్మ - అందరి అమ్మల మూలపుటమ్మ, ఆమె అనుగ్రహాన్ని విరివిగా పంచే మహిమాన్విత మాసం- ఆశ్వయుజం.
- నిత్య సంకల్పం నిత్యపూజతో సహా ఏ శుభకార్యం ప్రారంభించినా ‘ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం’ అని సంకల్పం చెబుతాం. ఇది మనిషి సంపూర్ణ జీవితాన్ని సాధించడానికి అవసరమైన నాలుగు సూత్రాలను రోజూ గుర్తుచేసే మహత్తర జీవనదృష్టి.
- తస్మై శ్రీ తరువే నమః చెట్టులో పుట్టలో దైవత్వాన్ని దర్శించుకునే తత్వం భారతీయులది. వృక్ష మూలం బ్రహ్మకు, మధ్య భాగం విష్ణువుకు, కొన భాగం సదాశివుడికి ఆలయాలని ‘మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతశ్శివరూపాయ’ అనే శ్లోకం వివరిస్తుంది.
- ప్రకృతి - పురుషుడు సృష్టికర్త కూడా తోడుగా శక్తి లేనిదే సృష్టి చేయలేడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు తమ ‘సౌందర్యలహరి’ మొదటి శ్లోకంలోనే... శివుడైనా శక్తి చెంతనున్నప్పుడే సృష్టిని కొనసాగించగలడని, ఆ శక్తి లేకపోతే చలించడానికి కూడా ఆయనకు సాధ్యం కాదనే పరమ సత్యాన్ని చాటారు.
- పతనానికి తొలి మెట్టు మనసులో మొదలయ్యే చిన్న కాలుష్యం అసూయ. అది పైకి కనిపించదు కానీ లోపలి నుంచి మనిషిని తొలిచేస్తుంది. ఒకరి ఆనందాన్ని చూసి సంతోషించలేకపోవడం, ఒకరి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడమే అసూయ.
- గురుకృప త్రిమూర్తుల తత్వ స్వరూపుడు గురువు. ఈశ్వరుడికీ గురువుకూ మూర్తి భేదమే కానీ ఆత్మ ఒక్కటే. సద్గురువుల విశ్వాసాలు, విధానాలు, బోధనలు వేరైనా వారి లక్ష్యం లోకకల్యాణమే. ప్రజలను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, మృత్యువు నుంచి అమృతత్వానికి నడిపించడమే వారి ధ్యేయం.
- మౌన స్నేహితుడు ముండకోపనిషత్తులోని ఒక అద్భుతమైన మంత్రం మన జీవితంలోని అతి పెద్ద సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
- గమ్యం ఒకటే! ‘ఆధ్యాత్మికత’ అన్నది ఎంతో విశాలమైన భావన. దాన్ని ఒక నిర్వచనానికి, నిర్దిష్ట ఆచారాలకు, సంప్రదాయాలకు మాత్రమే పరిమితం చేయలేం. మౌలికంగా చూస్తే.. ఆధ్యాత్మిక ప్రయాణం వ్యక్తిగతమైనది. అందుకే, స్వభావానికి తగిన మార్గాన్ని ఎంచుకోవడం కీలకం.
- వేలాడుతున్న మనిషి పెద్దలు చెప్పిన కొన్ని పిట్టకథలు లోతైన తాత్వికసత్యాలను సులువుగా అర్థమయ్యేట్టు చేస్తాయి.
- అహింసా పరమో ధర్మః ‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరో దమః/ అహింసా పరమం దాన మహింసా పరమం తపః’ అంటుంది మహాభారతం. అహింసే పరమధర్మమని, దానికి మించిన తపస్సు లేదని చెబుతుంది.
- విచక్షణ విచక్షణ అనేది తెలివికి సంబంధించింది మాత్రమే కాదు, అంతర్గతంగా ఉండే ఒక ఆధ్యాత్మిక శక్తి…. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆ వివేకం అవసరం.
- మెఱమెచ్చులు లోకుల మెప్పు పొందడానికి ప్రతివారు ప్రయత్నిస్తారు. మెఱమెచ్చు(మితిమీరిన పొగడ్త)లకు మురిసిపోనివారు తక్కువ. స్వలాభం కోసం స్తుతించేవారిని ముద్దుచేసేవారు కొందరైతే- తమకు తాముగానే డాబులకు పోయేవారు మరికొందరు!
- జడ భరతుడు ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటే సరిపోదు. మనసులోని కోరికలను, మమకారాన్ని కూడా జయించాలి. భరతుడు ధర్మబద్ధంగా పరిపాలించి చివరికి రాజ్యాన్ని వదిలి అడవిలో తపస్సు చేస్తుంటాడు.
- గ్రంథగ్రంథులు నవనీతం అంటే వెన్న. ఇది సామాన్యమైన అర్థం. దాన్ని ఏ భాగవత గ్రంథానికో విశేషణంగా చేర్చి ‘భాగవత నవనీతం’ అన్నప్పుడు- నవ అంటే ‘తాజాగా’ నీతం అంటే ‘భూమికి తెచ్చిన అమృతం’ అనే విశేషార్థం స్ఫురిస్తుంది.
- విజయతీరాలు జీవితంలో విజయం అనేది ఆకస్మికంగా వరించే అదృష్టం కాదు. అది మనం అనునిత్యం తీసుకునే నిర్ణయాల ప్రతిఫలం.